భూమి తన అక్షంపై తాను తిరగడంను భూభ్రమణం అంటారు. భూమి తనచుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిముషముల 4.09 సెకనుల సమయం పడుతుంది. భూభ్రమణం వల్ల రాత్రింబవళ్ళు, సముద్రంలో కలిగే ఆటు పోటులు, సముద్ర ప్రవాహాలు ఏర్పడుతాయి.
• భూపరిభ్రమణం :
భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టా తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటారు దీని వల్ల ఋతువులు ఏర్పడుతాయి.
• పరిహేళి :
భూమి సూర్యునికి మిక్కిలి దగ్గరగా ఉండే దూరం. ఇది 147 మిలియన్ కిలోమీటర్ వరకు ఉంటుంది.
• అపహేళి :
భూమి సూర్యునికి మిక్కిలి దూరంగా ఉండే దూరం. ఇది 152 మిలియన్ కిలోమీటర్లు వరకు ఉంటుంది.
• లీపు సంవత్సరం :
భూమి సూర్యుని చుట్టా తిరిగి రావడానికి 365 ¼ రోజులు పడుతుంది. అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు కలిపి ఒక రోజు అవుతుంది. ఆ సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి. క్రీ.శ. లోని సంవత్సరాలను 4 చేత భాగించగా శేషం మిగలని సంవత్సరంను లీపు సంవత్సరం అంటారు. ఈ లీపు సంవత్సరానికి ఫిబ్రవరి నెలలో 29 రోజులుంటాయి.
• విషవత్తులు :
భూమి తన కక్ష్యులో తిరిగేటప్పుడు మార్చి 21, సెప్టెంబరు 23వ తేదీలలో సూర్యకిరణాలు భూమధ్యరేఖపై లంబంగా పడతాయి. కనుక ఈ రెండు రోజులలో ప్రపంచమంతటా రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి.
• అక్షాంశాలు :
భూమాధ్యరేఖకు సమాంతరంగా 1 డిగ్రీల అంతరంతో ఉత్తర, దక్షిణ ధ్రువాల వరకు గీయబడిన వృత్తాలను అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు ఉత్తరార్దగోళంలో దక్షిణార్దగోళంలో 90 ఉండి భూమధ్య రేఖతో కలిపి మొత్తం 181గా ఉంటాయి. 0 డిగ్రీల అక్షాంశం అయిన భూమధ్య రేఖ అతిపెద్ద అక్షాంశం. అక్షాంశాలు తూర్పు పడమరలుగా వ్యాపించి ఉంటాయి.
• అయనరేఖలు :
కర్కట, మకర రేఖలను అయన రేఖలని అంటారు.
• ఆర్కిటిక్ వలయం :
66 ½ డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయమని అంటారు.
• 0 డిగ్రీ అక్షాంశం :
భూగోళాన్ని రెండు అర్డగోళాలుగా విభజించు భూమధ్య రేఖకు 0 డిగ్రీల అక్షాంశమని పేరు.
• అంటార్కిటిక్ వలయం :
66 ½ డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయమని పేరు.
• రేఖాంశాలు :
ఉత్తర, దక్షిణ దృవాలను కలుపుతూ భూ ఉపరింతలంపై గీసిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. ఈ రేఖాపై ఉన్న అన్ని ప్రదేశాలలో ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. అందువలన వీటిని ‘మధ్యాహ్న రేఖలు’ అని కూడా అంటారు. రేఖాంశాలు మొత్తం 360 ఉంటాయి.
• గ్రీనిచ్ రేఖాంశం :
0 డిగ్రీల రేఖాంశంను గ్రీనిచ్ రేఖాంశమని అంటారు. గ్రీనిచ్ రేఖకు తూర్పుగా 180 డిగ్రీల వరకు, పశ్చిమమునకు 180 డిగ్రీల రేఖాంశాలున్నవి. గ్రీనిచ్ రేఖాంశం లండన్ మీదుగా పోతుంది. గ్రీనిచ్ కాలమానానికి, భారత కాలమానానికి 5 ½ గంటల తేడా ఉంటుంది.
• అంతర్జాతీయ దివరేఖ :
180 డిగ్రీల తూర్పు, పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. 1884లో వాషింగ్టన్ లో జరిగిన భూగోళ సదస్సులో ఈ రేఖను నిర్ణయించారు. ఇది పసిఫిక్ మహాసముద్రం మీదుగా చాలా వరకు పోతుంది.
• 82 ½ డిగ్రీల తూర్పు రేఖాంశం :
ఇది భారతదేశ ప్రామాణిక కాలమానం. ఇది మన దేశంలోని అలహాబాద్ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ మీదుగా పోతుంది. మనదేశపు ప్రామాణిక కాలం గ్రీనిచ్ కాలానికి 5 ½ గంటలు ముందు ఉంటుంది.
• భూమధ్య రేఖ మండలం :
ఇది 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల అక్షాంశాల వరకు వ్యాపించి ఉంది. ఈ మండలాన్ని వార్చపాతాన్ని బట్టి భూమధ్యరేఖా వర్షపాత మండలమని, ఉద్బిజ్జాల ఆధారంగా సెల్వాలని, అల్పపీడన మేఖల ఉండడం వల్ల డోల్ డ్రమ్స్ అని పిలుస్తారు.
• పీగ్మీలు:
కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసించే ఒక ఆటవిక తెగ, వీరు పొట్టగాను, నల్లగాను ఉంది అర్దచంద్రాకారపు గుడిసెలలో నివసిస్తారు. ప్రధాన వృత్తి వేట.
• సెమాంగ్ లు, పకాయిలు:
మలేషియాలో నివసించే ఒక రకమైన ఆటవిక జాతి వారు. ఇంచుమించు పిగ్మీలలాంటి జీవితాన్నే గడుపుతారు.
• అజీజియా:
ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయిన ప్రాంతం. ఇది లిబియా దేశంలో ఉంది. సహారా ఏడారిలో ఉన్న అజీజియాలో 58 డిగ్రీల సే.గ్రే ఉష్ణోగ్రత రికార్డు అయింది.
• ఒయాసిస్ లు:
ఎడారి ప్రాంతంలో ఇసుక పొరల ద్వారా ఇంకిపోయిన నీరు గట్టి శిలాపొరల మధ్య నిలువ ఉంటుంది. అప్పుడప్పుడు నీటి బుగ్గల ద్వారా నీరు ఉపరితలం చేరుతుంది. వాటిని ఒయాసిస్ లు అంటారు.
• సవన్నా మండలం:
5 డిగ్రీల – 20 డిగ్రీల అక్షాంశాల మధ్యనున్న మండలాన్ని సవన్నా మండలం లేదా ఆయనరేఖ మండలమని అంటారు. ఇవి ఉష్ణమండలంలో సెల్వాలను అనుకోని ఖండాలకు మధ్యభాగంలో సముద్ర ప్రభావానికి దూరంగా ఉంటాయి.
• కాంపొస్:
దక్షిణ అమెరికాలో భూమధ్యరేఖకు దిగువన ఉన్న సవన్నా మండలాన్ని కాంపొస్ అంటారు. ఇది బ్రజిల్, బొలీవియా, పెరాగ్వే,అర్జెంటినాలో వ్యాపించి ఉంది.
• సమశీతోష్ణ తృణ మండలం :
35 డిగ్రీల – 55 డిగ్రీల అక్షాంశం వరకు వ్యాపించి ఉన్న మండలం ఇది. తక్కువ వర్షపాతం కురిసిన గడ్డి పెరగడం ఈ మండలం యొక్క ప్రత్యేకత.
• ప్రయరీలు:
కెనడా దక్షిణ భాగం, అమెరికా మధ్య ప్రాంతంలోని సమ శీతోష్ణమండల తృణభూములు.
• పంపాలు:
దక్షిణ అమెరికాలో అర్జెంటీన పశ్చిమ, దక్షిణ ప్రాంతంలో వ్యాపించి ఉన్న సమశీతోష్ల మండల తృణభూములు.
• డౌన్స్:
ఆస్ట్రేలియాలోని మురె డార్లింగ్ పరివాహక ప్రాంతంలో వ్యాపించి ఉన్న సమశీతోష్ణ మండల తృణభూములు.
• వెల్దులు:
ఆఫ్రికాలో ట్రాన్స్ వాల్, ఆరంజ్ ఫ్రీ స్టేట్ లో వ్యాపించి ఉన్న సమశీతోష్ణ మండల తృణభూములు.
• స్టేప్పీలు:
యురేషియా ప్రాంతంలో వ్యాపించి ఉన్న సమశీతోష్ణ మండల తృణ భూములు.
• రుతుపవన మండలం :
10 డిగ్రీల – 30 డిగ్రీల అక్షాంశాల మధ్య వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని మాన్ సూన్ లేదా రుతుపవన మండలమని పేరు. ఇది ‘మౌసమ్’ అనే అరబ్బి పదం ఈ మండలం ఇండియా శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, థాయ్ లాండ్, బంగ్లాదేశ్ లలో ఉంది.
• మధ్యధరా శీతోష్ణస్థితి :
భూమధ్య రేఖకు ఇరువైపుల 30 డిగ్రీల – 45 డిగ్రీల అక్షాంశాల మధ్యనున్న ఖండాల పశ్చిమ ప్రాంతాన్ని మధ్యధరా శీతోష్ణస్థితిని కలిగియున్నందున దీనికి ఈ పేరు వచ్చింది. శీతాకాలంలో వర్షాలు కురియడం, వేసవిలో పొడిగా ఉండడం ఈ మండలం ప్రత్యేకత.
• వెర్ఖోయాన్ప్క్:
సైబిరియాలోని ప్రాంతం ఇది. అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయిన ప్రాంతం. ఇక్కడ – 67.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత రికార్డయింది.
• ఎస్కిమోలు:
కెనడా ప్రాంతంలో నివసించే వారు. వీరి ప్రధాన వృత్తి వేటాడటం. వీరు నివసించే ఇండ్లను ఇగ్లూ అంటారు.
• యురేషియా :
యూరప్, ఆసియా ఖండాలను కలిపిన భూ భాగాలను యురేషియా అంటారు.
• ఆస్ట్రేలేషియా:
ఆస్ట్రేలియా దాని పరిసరదీవుల సముదాయాన్ని కలిపి ఆస్ట్రలేషియా అంటారు.
• పసిఫిక్ మహా సముద్రం:
సముద్రాలలో పెద్ద సముద్రం. దీని వైశాల్యం 165,760,000 చ కి మీ. భూమధ్య రేఖ వద్ద దీని పొడవు 16000 కిలోమీటర్లు. బేరింగ్ జలసంధి, 180 డిగ్రీల తూ.ప. రేఖాంశం ఈ సహాసముద్రం గుండా పోతున్నవి. దీనికి శాంత సముద్రమని పేరు.
• ద్వీపకల్పం :
విశాల భూభాగాలు సముద్రంలోనికి చొచ్చుకుని వచ్చిన వాటి ద్వీపకల్పం అంటారు. వీటికి మూడు వైపుల సముద్రం, ఒక వైపున భూభాగం ఉంటుంది. ఉదా: ఇండియా, అరేబియాలు.
• దీవులు :
అన్ని వైపుల నీరు ఆవరించియున్న ప్రాంతాన్ని దీవి అంటారు. ఉదా: శ్రీలంక, బ్రిటీష్ మలగసి, గ్రీన్ లాండ్.
• పర్వతాలు :
వాలు ఎక్కువగా ఉన్న పార్వలతో తక్కువ శిఖర వైశాల్యంతో ఉన్న ఎతైన విశాల ప్రాంతం. సుమారుగా 900 మీ కంటే ఎత్తులో ఉన్నట్లయితే దాన్ని పర్వతంగా భావించవచ్చు.
• ముడుత పర్వతాలు :
సముద్రాలలోని భూ అభినతిలో నిక్షేపితమైన శిలలపై ఏర్పడ్డ పార్శ్ప, ఊర్ద్వి బలాలవల్ల ముడుతలు పది నెట్టుకుని వచ్చిన పర్వతాలు. ఉదా: హిమాలయ, అండిస్, రాఖీ పర్వతాలు.
• మైదానాలు :
సముద్రమట్టానికి సుమారు 150 మీటర్ల ఎత్తులో ఉన్న సమతల ప్రాంతాన్ని మైదానంగా పేర్కొనవచ్చును. మైదానాలు కొద్దిపాటి ఎత్తు పల్లాలుగాను, వాలు తక్కువగానూ ఉంటాయి. ఉదా: గంగా సింధూ మైదానం.
• డెల్టా :
నది సముద్రంలో కలిసేచోట ఏర్పడిన మైదానాలు. ఇవి త్రిభుజాకారంలో ఉంటాయి. గ్రీకు అక్షరమైన ‘‘ ను పోలి ఉండటం వలన వీటికి ‘డెల్టాలు’ అని పేరు వచ్చింది. ఉదా: గంగా, గోదావరి డెల్టాలు.
• ఆస్టరాయిడ్స్ లేదా ప్లావెటాయిడ్స్:
సూర్యుని చుట్టూ, అంగారకుడు, బృహస్పతి గ్రహాల కక్ష్యల మధ్య తిరుగుతూ ఉండే గ్రహశకళాలను, లేదా సూక్ష్మగ్రహాలను ఆస్టరాయిడ్స్ అంటారు.
• అరోరా బోరియాలిస్ అరోరా ఆస్ట్రేలిస్:
ఉత్తరార్థగోళంలో అంతరిక్షంలో వివిధ రంగులతో కూడిన కాంతి కిరణాలు/కంపించే దృశ్యాన్ని ఆరోరాబో రియాలిస్ అంటారు. సూర్యుని నుండి వెలువడే ఒక విధమైన విద్యుత్ ఉత్పర్గం వల్ల, కొన్ని కాస్మిక్ కిరణాల వల్ల ఈ దృగ్విషయo ఏర్పడు తుంది. దక్షిణార్థగోళంలో ఇదే దృశ్యాన్ని ‘అరోరా ఆస్ట్రేలిస్’గా పిలుస్తారు.
• కొమెట్ (తోకచుక్క):
సూర్యుని గురుత్వాకర్షణ పరిధిలో సంచరించే అంతరిక్ష పదార్థాలు. వీటికి కేంద్రకం, వెలుగుతో కూడిన తోక ఉంటాయి. 1965లో జపాన్ శాస్త్రవేత్తలు ‘ఇకేయ-సాకి’ అనేకొత్త తోక చుక్కను కనుగొన్నారు. 1973లో కొహటెక్ అనే చెక్ ఖగోళ శాస్త్రవేత్త ‘కొహటెక్’ తోకచుక్కను కనుగొనెను. ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపించే హేలి తోకచుక్క చివరిసారిగా 1986లో కనిపించింది.
• డాగ్ స్టార్:
సీరియస్ అనే నక్షత్రానికి గల మరొక పేరు ఇది నక్షత్రాలన్నింటిలోకి ప్రకాశవంతమైనది.
• హరిత విప్లవం:
భారతదేశంలో 60వ దశకంలో అధికోత్పత్పత్తి వంగడాల (Hyv) ను ఉపయోగించి, రసాయనిక ఎరువులు వాడి, పంటల ఉత్పత్తిని అధికం చేసేందుకు రూపొందించిన కార్యక్రమమే హరిత విప్లవం (GreenRevolution) అని ప్రసిద్ధి చెందింది.
• ఖరీఫ్ పంటలు:
వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ ఖరీఫ్ పంటలను జూన్-జులై నెలల్లో విత్తుతారు. సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో కోతకు వస్తుంది. ముఖ్యమైన ఖరీఫ్ పంటలు- వరి, చెరుకు, జనుము, ప్రత్తి, పొగాకు, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి, వేరుశనగ మొదలగునవి.
• రబీ పంటలు:
శీతాకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. రబీ పంటలను అక్టోబర్ నెలలో విత్తుతారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో పంట కోతకు వస్తుంది. ముఖ్యమైన రబీ పంటలు – గోధుమ, బార్లీ, ఉలవలు, ఆవాలు, పప్పుధాన్యాలు మొదలగునవి.
• జెయిద్ పంటలు:
ఖరీఫ్, రబీ ఋతువుల పంటలు కాక, సంవత్సరం పొదువునా తాత్కాలిక నీటి పారుదల ద్వారా పండించే పంటలను జెయిద్ పంటలు అంటారు. వరి, మొక్కజొన్న, ఖర్బూజ, వేరుశనగ, కాయగూరలు, ఆకుకూరలు మొదలగునవి ఈ పంటలకు ఉదాహరణలు.