రైల్వే వ్యవస్థ
భారతదేశంలో మొట్టమొదటి రైలు ఏప్రిల్ 16, 1853వ బొంబాయి మరియు థానేల మధ్య నడుపబడింది. 34 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గంపై రైలును అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ప్రారంభించారు. నేడు భారత రైల్వే వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద రవాణావ్యవస్థ. భారత రైల్వే వ్యవస్థ ఆసియా ఖండంలో మొదటి స్థానంలోనూ, ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నది. ప్రస్తుతం సుమారు 68,442 కిలోమీటర్ల పొడవైన రైల్వేమార్గాలు, సుమారు 7318 పైన రైల్వేస్టేషన్లను ఇండియన్ రైల్వేస్ కలిగియున్నది. దేశంలోని రైల్వే మార్గాలలో మూడు రకాల గేజ్ లున్నాయి.
భారతదేశంలోని రైల్వే జోన్లు – ప్రధాన కార్యాలయాలు – స్థాపించబడిన సంవత్సరం.
1. ఉత్తర రైల్వే మండలం (ఏప్రిల్ 4, 1952) – న్యూఢిల్లీ.
2. మధ్య రైల్వే మండలం (నవంబర్ 5, 1951) – ముంబయి (ఛత్రపతి శివాజీ టెర్మినల్).
3. పశ్చిమ రైల్వే మండలం (నవంబర్ 5, 1951) – ముంబయి (చర్చ్ గేట్).
4. తూర్పు రైల్వే మండలం (ఆగస్టు 1, 1955) – కోల్ కత్తా (పశ్చిమ బెంగాల్)
5. ఆగ్నేయ (South-East) రైల్వే మండలం (ఆగస్టు 1, 1955) – కోల్ కత్తా (పశ్చిమ బెంగాల్).
6. ఈశాన్య (North-East) రైల్వే మండలం (ఏప్రిల్ 4, 1952) – గోరఖ్ పూర్ (ఉత్తరప్రదేశ్).
7. ఈశాన్య సరిహద్దు (Frontier) రైల్వే మండలం (జనవరి 15,1958) – మాలిగాం (గువహతి).
8. దక్షిణ రైల్వే మండలం (ఏప్రిల్ 14, 1951) – చెన్నై (తమిళనాడు).
9. దక్షిణ మధ్య రైల్వే మండలం (అక్టోబర్ 2, 1966) – సికింద్రాబాద్ (తెలంగాణ).
10. వైరుతి (South-West) రైల్వే మండలం (ఏప్రిల్ 1, 2003) – హుబ్లీ (కర్ణాటక).
11. వాయువ్య (North-West) రైల్వే మండలం (అక్టోబర్ 1, 2002) – జైపూర్ (రాజస్థాన్).
12. ఉత్తర మధ్య రైల్వే మండలం (ఏప్రిల్ 1, 2003) – అలహాబాద్ (ఉత్తరప్రదేశ్).
13. పశ్చిమ మధ్య రైల్వే మండలం (ఏప్రిల్ 1, 2003) – జబల్ పూర్ (మధ్యప్రదేశ్).
14. తూర్పు మధ్య రైల్వే మండలం (అక్టోబర్ 1, 2002) –హాజీపూర్ (జార్ఖండ్)
15. తూర్పు కోస్తా రైల్వే మండలం (ఏప్రిల్ 1, 2003) – భువనేశ్వర్ (ఒడిశా)
16. ఆగ్నేయ మధ్య రైల్వే మండలం (ఏప్రిల్ 5, 2003) – బిలాస్ పూర్ (ఛత్తీస్ గఢ్)
17. కలకత్తా మెట్రో రైల్వే (డిసెంబర్ 2010) – కలకత్తా (పశ్చిమ బెంగాల్).
18. దక్షిణకోస్తా రైల్వే (27-02-2019) – విశాఖపట్నం.
రైల్వే పరికరాల తయారీ కేంద్రాలు:
1. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ – పెరంబూర్ 1955 (తమిళనాడు): ఇక్కడ రైలు బోగీలు, ఎయిర్ కండీషన్ కోచ్ లు తయారవుతాయి.
2. రైల్ కోచ్ ఫ్యాక్టరీ – కాపుర్తలా 1988 (పంజాబ్): ఇక్కడ సెకండ్ క్లాస్ స్లీపర్ రైల్వే బోగీలు ఎక్కువగా తయారవుతాయి. ఈ కర్మాగారం 1988లో ప్రారంభించబడింది.
3. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్-వారణాసి 1964 (ఉత్తరప్రదేశ్): ఇక్కడ రైల్వేడీజిల్ ఇంజిన్లు తయారవుతాయి.
4. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్-చిత్తరంజన్ 1950 (పశ్చిమబెంగాల్): ఇక్కడ ఎలక్ట్రో లోకోమోటివ్ లు (ఇంజిన్లు) తయారవుతాయి.
5. విల్ అండ్ యాక్సిల్ ప్లాంట్- ఎలహంక 1983 (బెంగళూరు): ఇక్కడ రైలు చక్రాలు, ఇరుసులు తయారవుతాయి.
6. డీజిల్ కంపోనెంట్ వర్క్స్ – పాటియాలా (పంజాబ్): ఇక్కడ రైల్వే డీజిల్ ఇంజిన్ యంత్ర విడి భాగాలను తయారు చేస్తారు.
రహదార్లు
దేశవ్యాప్తంగా 58,97,671 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గం కల్గియున్నది. భారతదేశపు రహదార్లను ఐదు రకాలుగా విభజించారు. అవి జాతీయ రహదార్లు, రాష్ట్ర రహదార్లు, జిల్లా రహదార్లు, గ్రామీణ రహదార్లు మరియు సరిహద్దు రహదార్లు. రోడ్డు రవాణాలో జాతీయ రహదార్లు అత్యంత ప్రధానమైనవి.
నేషనల్ హైవే డెవలప్ మెంట్ ప్రాజెక్ట్
ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులను మరింత విశాలవంతంగా చేయడం, తద్వారా ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా దీనిని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ను 7 దశలలో చేపడుతున్నారు.
ఫేజ్-1, గోల్డెన్ క్వాడ్రిలేటరల్:
ఇది నాలుగు మెట్రో నగరాల (ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కత్తా) జాతీయ రహదారులను కలుపుతుంది. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ మొత్తం పొడవు 5846 కి.మీ.ఫేజ్-2, నార్త్ సదరన్, ఈస్ట్ వెస్ట్రన్ ప్రాజెక్ట్:
దీనిలో భాగంగా శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు, సిల్చార్-పోర్ బందర్ ను కలిపే హైవే, మొత్తం 7300 కి.మీ. పొడవు ఉంటుంది.ఫేజ్-3, ఫేజ్-4, ఫేజ్-5, ఫేజ్-6, ఫేజ్-7 ఇందులో భాగంగా పూర్తి చేస్తారు.
ముఖ్యమైన జాతీయ రహదారి మార్గాలు:
1. ఢిల్లీ నుండి జలంధర్ మీదుగా అమృత్ సర్ వరకు (469 కి.మీ.లు).
2. ఢిల్లీ నుండి ఆగ్రా, వారణాసి మీదుగా కోల్ కత్తా వరకు (1,387 కి.మీ.లు).
3. ఆగ్రా నుండి గ్వాలియర్, నాసిక్ మీదుగా ముంబయి వరకు (1,122 కి.మీ.లు).
4. థాణె నుండి బెల్గాం, బెంగళూరు మీదుగా చెన్నై వరకు (1,122 కి.మీ.లు).
5. 6వ నెంబర్ రహదారిలో బహరగోరా నుండి విజయవాడ మీదుగా చెన్నై వరకు (1,458 కి.మీ.లు).
6. 3వ నెంబర్ రహదారిలో థూలియా నుండి నాగ్ పూర్, బహరగోరా మీదుగా కోల్ కతా వరకు (1,578 కి.మీ.).
7. వారణాసి నుండి రేవా, నాగ్ పూర్, హైదరాబాద్,బెంగళూరు, మధురై మీదుగా కన్యాకుమారి వరకు (2,325 కి.మీ.లు) (ప్రస్తుతం 44వ జాతీయ రహదారిగా పేరు మార్చారు).
8. ఢిల్లీ నుండి జైపూర్, అజ్మీర్, ఉదయ్ పూర్, అహ్మదాబాద్, బరోడాల మీదుగా ముంబయి వరకు (1,365 కి.మీ.లు).
9. పూణె నుండి షోలాపూర్, హైదరాబాద్ ల మీదుగా విజయవాడ వరకు (779 కి.మీ.లు).
10. ఢిల్లీ నుండి ఫజిల్కా వరకు (ఈ రహదారి ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల గుండా పోతుంది).
భారతదేశంలో విమానాశ్రయాలు
• పోర్ట్ బ్లెయిర్:
వీర సావర్కర్ విమానాశ్రయం.• హైదరాబాద్ (శంషాబాద్):
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.• పుట్టపర్తి:
శ్రీ సత్యసాయి విమానాశ్రయం.• విశాఖపట్నం:
విశాఖపట్నం విమానాశ్రయం (వైజాగ్).• తిరుపతి:
శ్రీవేంకటేశ్వర విమానాశ్రయం.• పసిఘాట్:
పసిఘాట్ విమానాశ్రయం (పస్సిఘాట్ విమానాశ్రయం).• గౌహతి:
లోకప్రియ గోపీనాథ్ బొర్దోలీ అంతర్జాతీయ విమానాశ్రయం గౌహతి వైమానిక దళ స్థావరం).• జార్హత్:
జార్హత్ విమానాశ్రయం (రేరియా విమానాశ్రయం).• సిల్చార్:
సిల్చార్ విమానాశ్రయం (కుంభీర్ గ్రామ్ విమానాశ్రయం, కుంభీర్ గ్రామ్ వైమానిక దళ స్థావరం).• పాట్నా:
లోకనాయక్ జయప్రకాశ్ విమానాశ్రయం .• న్యూఢిల్లీ:
ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయం (పాలమ్ వైమానిక దళ స్థావరం).• దబోలిమ్ (వాస్కోడిగామా):
దబోలిమ్ విమానాశ్రయం (గోవా విమానాశ్రయం, దబోలిమ్ నౌకాదల స్థావరం).• అహ్మదాబాద్:
సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం.• కాంగ్రా/ధర్మశాల:
గగ్గాల్ విమానాశ్రయం (కాంగ్రా విమానాశ్రయం).• కులు/మనాలి:
భుంటార్ విమానాశ్రయం (కులు, మనాలీ విమానాశ్రయం).• జమ్ము విమానాశ్రయం (సత్వరి విమానాశ్రయం):
లె కుషోక్ బకుల రింపోచీ విమానాశ్రయం/లె వైమానిక దళ స్థావరం• మైసూర్:
మందకల్లీ విమానాశ్రయం .• కోజీకోడ్ (కాలికట్):
కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం (కరిపూర్ విమానాశ్రయం).• భోపాల్:
భోపాల్ విమానాశ్రయం (బైరాగర్ విమానాశ్రయం, రాజా భోజ్ విమానాశ్రయం).• ఇండోర్:
దేవీ అహల్యాబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం .• ఔరంగాబాద్:
ఔరగాబాద్ విమానాశ్రయం (చిక్కల్ తాణా విమానాశ్రయం).• ముంబయి (బొంబాయి):
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం .• నాగపూర్:
డా, బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం / సోనేగావ్ వైమానికదళ స్థావరం.• పూనె(పూనా):
పూనె అంతర్జాతీయ విమానాశ్రయం (లోహెగావ్ విమానాశ్రయం) లోహెగావ్ వైమానిక స్థావరం.• ఇంఫాల్:
ఇంఫాల్ విమానాశ్రయం (తులిహల్ విమానాశ్రయం).• షిల్లాంగ్:
షిల్లాంగ్ విమానాశ్రయం (బరాపాని విమానాశ్రయం, ఉమ్రాయ్ విమానాశ్రయం).• ఐజ్వాల్:
లెంగ్ పుయి విమానాశ్రయం/తురియల్ వైమానిక దళ స్థావరం .• భువనేశ్వర్:
బిజూ పట్నాయక్ విమానాశ్రయం (భువనేశ్వర్ విమానాశ్రయం).• అమృత్ సర్:
రాజాసాన్సి అంతర్జాతీయ విమానాశ్రయం (అమృత్ సర్ అంతర్జాతీయ విమానాశ్రయం) అమృత్ సర్ వైమానిక స్థావరo.• జైపూర్:
జైపూర్ విమానాశ్రయం (సంగనీర్ విమానాశ్రయం).• ఉదయపూర్:
ఉదయ్ పూర్ విమానాశ్రయం (మహారాణా ప్రతాప్ విమానాశ్రయం).• కోయంబత్తూరు:
కోయంబత్తూరు విమానాశ్రయం (పీలమేడు విమానాశ్రయం).• డెహ్రాడూన్:
జోనీ గ్రాంట్ విమానాశ్రయం (డెహ్రాడూన్ విమానాశ్రయం).• ఆగ్రా:
ఆగ్రా విమానాశ్రయం (ఖేరియా విమానాశ్రయం/ఆగ్రా వైమానిక దళ స్థావరం).• లక్నో:
అమౌసి అంతర్జాతీయ విమానాశ్రయం .• వారణాసి:
వారణాసి విమానాశ్రయం (బాబత్ పూర్ విమానాశ్రయం).• సిలిగుడి:
బాగ్ డోగ్రా విమానాశ్రయం.• కోల్ కత్తా:
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం.• గన్నవరం (విజయవాడ):
ఎన్టీఆర్ అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం.జల రవాణా
అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత నౌకాయాన రంగం చాలా పెద్దది. భారతదేశంలో సుమారు 3,700 కి.మీ. పొడవైన అంతర్ జలరావాణా మార్గం (నదులు, కాలువలగుండా) ఉన్నది. భారతదేశ తీరరేఖ వెంబడి 13 ప్రధాన ఓడరేవులు 220కి పైగా చిన్న ఓడరేవులు ఉన్నాయి.
భారతదేశంలో ప్రధానమైన 13 ఓడరేవులు:
1. ముంబయి పోర్ట్ – మహారాష్ట్ర .
2. కోల్ కత్తా పోర్ట్ – పశ్చిమబెంగాల్ .
3. కోచి పోర్ట్ – కేరళ.
4. కాండ్లా పోర్ట్ – గుజరాత్.
5. చెన్నై పోర్ట్ – తమిళనాడు.
6. మార్మగోవా పోర్ట్ – గోవా .
7. మంగళూరు పోర్ట్ – కర్ణాటక
8. ట్యుటికోరిన్ పోర్ట్ – తమిళనాడు.
9. విశాఖపట్నం – ఆంధ్రప్రదేశ్ .
10. పారాదీప్ పోర్ట్ – ఒడిశా.
11. నవసేవ పోర్ట్ – మహారాష్ట్ర.
12. ఎన్నూర్ పోర్ట్ – తమిళనాడు.
13. పోర్ట్ బ్లెయిర్ – అండమావ్ నికోబార్ దీవులు (2010).