ప్రపంచ దేశాల వివరాలు
ఖండాలు:
భూగోళంలో 71 శాతం జలావరణంచే కప్పబడి ఉండగా కేవలం 29శాతంలో మాత్రమే భూబాగం నెలకొని ఉంది. ఈభూభాగాన్ని 7 ఖండాలుగా విభిజించారు. అవి- 1. ఆసియా , 2. యూరోప్, 3. ఉత్తర అమెరికా, 4. దక్షిణ అమెరికా, 5. ఆఫ్రికా, 6. ఆస్ట్రేలియా, 7. అంటార్కిటికాలు. అటు విస్తీర్ణ పరంగానూ, ఇటు భూపరంగానూ కూడా ఖండాలలోకెల్లా పెద్ద ఖండమైన ఆసియా, ప్రపంచ భూవిస్తీర్ణం రీత్యా ప్రపంచంలోకెల్లా చిన్నఖండం. ఆస్ట్రేలియానే ద్వీపఖండం అని కూడా అంటారు. ఇక ఆఫ్రికాకు చీకటిఖండం అనిపేరు. ఆఫ్రికా ఖండాలలోకెల్ల ఆర్థికంగా వెనుకబడిన ఖండం. యూరోప్, ఉత్తర అమెరికాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఖండాలు. కాగా అంటార్కిటికా జనావాసానికి యోగ్యంకాని మంచు ఖండం. దక్షిణ అమెరికా అంతా లాటిన్ అమెరికన్ దేశాల మయం. ఆఫ్రికా, ఆసియాలను ఎర్రసముద్రం వేరుచేస్తుండగా, ఆఫ్రికా, యూరోప్ లను మధ్యదరా సముద్రం వేరుచేస్తున్నది. ఇక ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖాండాలను, అట్లాంటిక్ మహాసముద్రం యూరోప్, ఆఫ్రికా ఖండాల నుండి వేరుచేస్తున్నది. ఆసియా, అమెరికా ఖండాలను పసిఫిక్ మహాసముద్రం వేరుచేస్తున్నది.భౌగోళిక సముదాయాలు:
ప్రపంచంలోని వివిధ దేశాల్ని కలిపి ఒక సహజ భౌగోళిక సముదాయంగా గుర్తించారు. వాటికి సంప్రదాయకంగా కొన్ని పేర్లు ఉన్నాయి. దానికి సంబంధియంచిన వివరణ ఇది.ఉత్తర యూరోప్:
ఐరోపా ఖండంలోని ఉత్తర ప్రాంతం ఇది. నార్వే, స్వీడన్. ఫిన్లాండ్, లాత్వియా, లిథుయేనియా, ఐస్లాండ్, బ్రిటన్, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్స్, ఎస్టొనియా దేశాలు ఈ ప్రాంతం కిందికి వస్తాయి. వీటిలో బ్రిటన్ ప్రాముఖ్యత ఎక్కువ. ఒకటి రెండు తప్ప మిగతావన్నీ అభివృద్ధి చెందిన దేశాలే.మధ్య మరియు తూర్పు యూరోప్:
గతంలో సోవియట్ శిబిరానికి సన్నిహితంగా ఉన్న పోలాండ్, రుమేనియా, హంగరీ, జెకొస్లా వేకియా, స్లోవేకియాలతోపాటు ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్లు ఈ ప్రాంతం కిందికి వస్తాయి. జెర్మనీ కూడా తూర్పు యూరోప్ లో అంతర్భాగమే. ఫ్రాన్స్, జెర్మనీ దేశాలు ఈ ప్రాంతంలో ఆధిక్య దేశాలు.దక్షిణ యూరోప్:
గతంలో లాటిన్ అమెరికాను పాదాక్రాంతం చేసుకున్నా స్పెయిన్, ఇటలీ, గ్రీస్, బల్గేరేయా, మాసిడినియా, యుగోస్లోవియా, స్లోవేకియా,క్రొయేషియా, ఆల్బేనియాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.పశ్చిమాసియా / మధ్య ప్రాచ్యం:
యూరోపియన్ దేశంగా భావించే టర్కీ, సిరియా, ఇరాన్, ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, యోమెన్, ఒమన్, అర్మేనియాలు మధ్యప్రాచ్యం (లేదా) పశ్చిమ ఆసియాలోనివి. ఆర్మేనియాను కూడా ఈ పశ్చిమాసియాలో అంతర్భాగం అనే చెప్పుకోవాలి.ఉత్తర ఆఫ్రికా:
ఆఫ్రికాలోని ప్రధానమైన దేశాలన్నీ ఈ విభాగం పరిధిలోకే వస్తాయి. మొరాకో, అల్జీరియా, ట్యూనీషియా, లిబియా, ఈజిప్ట్, మార్షియానా, మాలీ, నైగర్, చాద్, సూడాన్, ఎరిత్రియా, ఇథియోపియా, సోమాలియాలు ఉత్తరాఫ్రికాలోనివే.మధ్య ఆఫ్రికా:
గినియా, సియోర్రాలియోన్ వంటి చిన్న దేశాలు, జైరే (కాంగో)వంటి పెద్దదేశం ఈ విభాగంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ విభాగంలో కంపించేవి పెద దేశాలు. సెనెగల్,సిరియా, లైబీరియా, కోటె డిపోర్, బుర్కినా, ఫోసో, ఘనా, బెనిన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కామెరూన్, గబన్, జైర్, ఉగాండా, కీన్యా, టాంజానియాలు మధ్య ఆఫ్రికా దేశాలు.దక్షిణాఫ్రికా ప్రాంతం:
ఈ ప్రాంతంలో ప్రముఖమైంది దక్షిణాఫ్రికా, వజ్రాల నిల్వలకు మరోపేరు దక్షిణాఫ్రికా దేశాలు. అంగోలా, జాంబియా, మాలవి, నమీబియా, బోట్స్వానా, మొజాంబిక్, దక్షిణాఫ్రికా, లెసాథోలు ఈ విభాగంలోకి వస్తాయి.రష్యా, పరిసర దేశాలు:
జార్జియా, బెలారస్, ఉక్రెయిన్, మాల్డోవా, రష్యాలు ఈ విభాగంలో ఉన్నాయి.మధ్య ఆసియా:
ఈ ప్రాంతంలోని దేశాలు కూడా గతంలో సోవియట్ కు అనుబంధంగా ఉన్నవే. ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, తుర్క్మెనిస్థాన్, అజర్బైజాన్లను కలిపి మధ్య ఆసియాగా వ్యవహరిస్తారు.భారత ఉపఖండం:
దక్షిణాసియా యావత్తూ భారత ఉపఖండం కిందకే వస్తుంది. పాకిస్థాన్, నేపాల్, భారత్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు భారత ఉపఖండంలోని భాగాలు.ఆగ్నేయాసియా:
గతంలో వీటిని ఆసియన్ టైగర్లుగా వ్యవహరించే వారు. వైశాల్యంలో చిన్నవే అయినప్పటికీ సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించడమే ఆ బిరుదుకు కారణం. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్ ల్యాండ్, లావోస్,బ్రూనేల్ని ఆగ్నేయాసియా అంటారు.ఆస్ట్రేలియా:
న్యూజిలాండ్, ఆస్టేలియా, పాపువా న్యూగినియాలు కలిపితే ఆస్టేలియా ప్రాంతం అవుతుంది.దూరప్రాచ్యం:
చైనా ఈ ప్రాంతంలో ప్రాధాన్యదేశం. మంగోలియా, ఉత్తర, దక్షిణ కొరియాలు, జపాన్, తైవాన్, హాంగ్ కాంగ్ మిగిలిన దూర ప్రాచ్యదేశాలు.ఉష్ట మండల దక్షిణ అమెరికా:
ఖండం చివరి భాగంలోని అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే, చిలీ దేశాలు ఉష్ణ మండల దక్షిణ అమెరికా విభాగంలోకి వస్తాయి.సమశీతోష్ణ దక్షిణ అమెరికా:
దక్షిణ అమెరికా ఖండంలోని ప్రముఖ దేశమైన బ్రెజిల్ తో పాటు బొలీవియా, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సురినాం, ఫ్రెంచ్ గయానా, ఈక్వెడార్లు సమశీతోష్ణ దక్షిణ అమెరికాగా పిలవబడతాయి.మధ్య అమెరికా, కరేబియన్ దేశాలు:
ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య ఉండే దేశాలన్నీ ఈ విభాగం కిందకి వస్తాయి. మెక్సికో, గ్వాటిమాలా, హొండురాస్, నికరాగ్వా, కొష్టారికా, పనామా, సాల్వడార్, క్యూబా, జమైకా, హైతీ, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టోరికా వంటి చిన్న దేశాలెన్నో వీటిల్లో ఉన్నాయి.లాటిన్ అమెరికా దేశాలు:
మధ్య, దక్షిణ అమెరికాలలోని రోమన్ భాషలు మాట్లాడే 33 స్వతంత్ర దేశాలు, 13 ఇతర రాజకీయ విభాగాలను కలిపి లాటిన్ అమెరికన్ దేశాలంటారు. ఈ దేశాలలో మాట్లాడే రొమాన్స్ భాషలలో స్పెయిన్ ఆధికం కాగా, బ్రేజీల్లో పోర్చుగీస్ను, హైతీలో ఫ్రెంచ్ భాషాను మాట్లాడతారు.