ప్రపంచ దేశాల వివరాలు
ఆఫ్గనిస్థాన్
• రాజధాని: కాబూల్
• వైశాల్యం: 652,230 చ.కి.మీ.
• జనాభా: 33,369,945
• ద్రవ్యం: ఆఫ్ఘని
• భాష: పస్టో, పర్షియన్, ఇంగ్లీషు, దారి
• మతం: ఇస్లాం
• ముఖ్య పంటలు: గోధుమ, మొక్కజొన్న, బార్లీ, దానిమ్మ, బాదం, పిస్తా
• ముఖ్య ఖనిజాలు: రాగి, సీసము, ఇనుము, వెండి, ముడి చమురు, బొగ్గు, గంధకము, సహజ వాయువు
• ముఖ్య పరిశ్రమలు: సిమెంటు, పట్టి, ఉన్ని, చర్మము, రాగ్గులు, తివాచీలు, సుగంధ ద్రవ్యాలు
• ముఖ్య ఎగుమతులు: పండ్లు, చర్మములు, తివాచీలు, ఉన్ని, ఎండు ద్రాక్ష
• ముఖ్య దిగుమతులు: పెట్రోలియమ్, దారాలు, వస్త్రాలు, ఆహార పదార్థాలు
• అక్షరాస్యత: 28.1 శాతం
అల్బేనియా
• రాజధాని: టిరావా
• వైశాల్యం: 28,748 చ.కి.మీ.
• జనాభా: 29,03,700
• ద్రవ్యం: లీక్ (Lek)
• భాష: అల్బేనియన్, గ్రీక్.
భారత్ – చైనా సరిహద్దు వివాదం
భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం ఇటీవలి కాలంలో మళ్లీ తెర మీదికి వచ్చింది. ఉత్తర సిక్కిం, లడక్ ప్రాంతాలలో వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యూక్చువల్ కంట్రోల్) వద్ద ఇరుదేశాల సైన్యాల మధ్య సంక్షోభం, ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. చైనా సైనికులు గాల్వన్ నదీ లోయ వద్ద, తూర్పు లడక్ ప్రాంతం వద్ద వాస్తవాధీన రేఖను పలు ప్రాంతాలలో చైనా సైనికులు దాటి వచ్చారు. భారత్, చైనాల మధ్య సరిహద్దు రేఖ లేదా వాస్తవాధీన రేఖను సక్రమంగా గుర్తించన కారణంగా మొదటి నుంచి ఇరు దేశాల మధ్య ఈ విషయంపై వివాదా లు ఏర్పడుతూనే వస్తున్నాయి. సరిహద్దు నియత్రణా రేఖ లేదా వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యూక్చువల్ కంట్రోల్) అంటే – భారత నియంత్రణ కింద ఉన్న ప్రాంతాలను, చైనా నియంత్రణ కింద ప్రాంతాలను విడదీసే రేఖ. ఈ 3,488 కిలోమీటర్ల పొడవునా ఉన్నట్లు భారత్ గుర్తిస్తోంది. కానీ చైనా ఇది 2000 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉన్నట్లు గుర్తిస్తోంది.
ఇటీవలి వివాదం: భారత్ లో హిమాలయా ల వద్ద ఉన్న జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పైన ఉన్న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని పాంగాంగ్ సరస్సు దగ్గర చైనా సైన్యాలు 2020 మే 5 తేదీన బాగా ముందుకు వచ్చి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. ఇందుకు ప్రతిగా భారత్ కూడా ఆ ప్రాంతంలోకి తమ సైన్యాన్ని వెంటేనే పంపించింది. మే 9నా చైనా సైనికులు సిక్కింలోని నాథులా ప్రాంతానికి విస్తరించించారు. మే 12వ తేదీన గాల్వన్ లోయ ప్రాంతంలోకి చైనా సైనిక దళాలు చొచ్చుకు వచ్చాయి. భారత్ కూడా వెంటేనే ప్రతిస్పందిస్తూ సేనల్ని అక్కడికి పంపింది. దాంతో ఆ ప్రాంతం లో పోటాపోటిగా రెండు దేశాలూ సైనిక మోహరింపులు చేపట్టాయి. ఈ ఘర్షణల్లో ఇరవై మంది భారత సైనికులు మృతి చెందారు.
సరిహద్దులు:
భారత్ – చైనాల మధ్య సరిహద్దు వివాదం గురించి తెలుసుకోవడానికి ముందుగా అసలు ఇరు దేశాల మధ్య సరిహద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉంది. భారత్ చినాతో 3488 కిలోమీటర పొడవునా సరిహద్దులను పంచుకుంటోంది. ఈ సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్టాలు ఉన్నాయి. భారత్ – చైనా దేశాల మద్య సరిహద్దులను మూడు సెక్టర్ల కింద విభజించారు. 1.పశ్చిమ సెక్టార్, 2. మధ్య సెక్టార్, 3. తూర్పు సెక్టార్. వీటిలో పశ్చిమ సెక్టార్ ఎప్పుడూ ఉద్రిక్తతలకు, చొరబాట్లకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం భారత్ లో కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ (జమ్మూకశ్మీర్ పైన ఉంది) సరిహద్దులలో వాస్త వాధీన రేఖ (లైన్ ఆఫ్ యూక్చువల్ కంట్రోల్ లేదా ఎల్ ఓసీ) వెంబడి 1597 కిలోమీటర్ల పొడవునా ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్ గా గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ల సరిహద్దులోని 545 కిలోమీటర్ల పొడవునా ఉన్న ప్రాంతంలోని 1346 కిలోమీటర్ల మేర సరిహద్దులను తూర్పు సెక్టార్ గా పేర్కొతున్నారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్టాలు ఈ సెక్టార్ లొకే వస్తాయి. ఈ ప్రాంతంలో కూడా చైనా మొదటి నించీ అప్పుడప్పుడు చొరబాట్లకు, సరిహద్దు వివాదాలకు దిగుతూ ఉంటుంది.
తాజా ఘర్షణలు:
2020 మే 10వ తేదీన భారత్, చైనా సైన్యాలు సిక్కింలోని నాథులా ప్రాంతంలో తిరిగి ఘర్షణలు పడ్డాయి. దాంతో చైనా కాశ్మీర్ పైన గల లద్దాఖ్ లోని పలు ప్రాంతాల్లో తమ సేనలను మోహరించింది. భారత్ కు టిబెట్ తో గల సరిహద్దు వద్ద కూడా చైనా దళాలను మోహరించింది. ఇందుకు జవాబుగా భారత్ కూడా ఆ ప్రాంతాలకు తన సేనలను తరలించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు వాస్తవాధీన రేఖ వద్ద తుపాకుల ఉపయోగాన్ని నివారిస్తున్నాయి. కానీ చైనా వాటిని పాటించడం లేదు. ఈ తాజా ఘర్షణల్లో పలువురు భారతీయ సైనికులు మరణించారు. అయితే సరిహద్దు ఘర్షణల వల్ల ఇరుదేశాల మధ్య వాణిజ్యంపై పెద్దగా ప్రభావం ఉండదని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. గాల్వాన్ లోయ వద్ద వివాదాన్ని పరిష్కరించడానికి జూన్ 23వ తేదీన ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరపాలని నిర్ణయించారు. తర్వాత ఆ సమావేశం వాయిదా పడింది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం 2020 జూన్ 29వ తేదీన చైనాకు చెందిన 59 మొబైల్ ఫోన్ యాప్ ల వాడకాన్ని దేశంలో నిషేధించింది.
భారత్-నేపాల్ సరిహద్దు వివాదం
భారత్-నేపాల్-చైనాల త్రైపాక్షిక సరిహద్దు ప్రాంతంలో మన దేశంలో ఉన్న ధార్చులా ప్రాంతం నుంచి చైనా సరిహద్దులోని లీపులేఖ్ ప్రాంతా నికి ఒక రోడ్డు నిర్మాణానికి భారత రక్షణ మంత్రి 2020 మే 8వ తేదీన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు. ఈ రహదారి నిర్మాణానికి నేపాల్ వెంటనే తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఆ ప్రాంతం నేపాల్ దేశం గుండా వెలుతుందనీ, అందువల్ల అక్కడ భారత్ రోడ్డు నిర్మాణం ప్రారంభించడం తగదనీ పేర్కొంది. వాస్తవానికి ఈ లీపులేఖ్ పాస్ ప్రాంతం భారత్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది చైనాలోని టిబెట్ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ తో కలుపుతుంది. భారత్-నేపాల్-చైనాల త్రైపాక్షిక సరిహద్దుల ప్రాంతం లోకి వస్తుంది. లీపులేఖ్ పాస్ దారిని వాణిజ్యరవాణాకు ఉపయోగించాలని 2015లో భారత్, చైనాలు తమ అనుమతి లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడం పై కూడా నేపాల్ ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలాపానీ ప్రాంతాన్ని తమ దేశంలో భాగంగా చూపిస్తూ భారత్ గతంలో ఒక మ్యాప్ రూపొందించడాన్ని కూడా నేపాల్ ఖండించింది. భారత్ ఇక్కడ రోడ్డు నిర్మాణం ప్రారంభించడానికి ప్రధాన కారణం – ఆ దారిగుండా కైలాస్ మానస సరోవర్ కు వెళ్లే యాత్రికులకు, వాణిజ్య రవాణాకు ఈ రోడ్డు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఒక సన్నటి దారి మాత్రమే ఉంది. దాన్ని పూర్తిస్తాయిలో రోడ్డుగా నిర్మంచాలని భారత్ తలపెట్టింది. ప్రస్తుతం భారత్ నుంచి కైలాస మానస సరోవర్ ప్రాంతానికి యాత్రకు వెళ్లే పర్యాటకులు సిక్కిం గుండా నేపాల్ కు వెళ్లి అక్కడి నుంచి మానస సరోవర్ కు చేరుకుంటారు. దీనికి రెండు, మూడు వారాల సమయం పడుతుంది. ఈ మార్గంలో లీపులేఖ్ ప్రాంతంలో 90 కిలోమీటర్ల పొడవైన క్లిష్టమైన దారి ఉంది. అక్కడ నుంచి వెళ్లడానికి వృద్ధులైన యాత్రికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారత్ తలపెట్టిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే అక్కడి నుంచి వాహనాలు వెళ్ళగలుగుతాయి. అప్పుడు పర్యాటకులు తమ యాత్రను తేలికగా పూర్తి చేయగలుగుతారు. ఇది కైలాస మానస సరోవర యాత్రకు ప్రాచీనకాలం నుంచి వాణిజ్య రవాణా కూడా వాహనాల ద్వారా జరపడం తేలికవుతుంది.
సుగాలీ ఒప్పందం:
పశ్చిమ భారతం లోని సట్లెజ్ నది నుంచి తూర్పు భారతంలోనే తీస్తా నది వరకూ నేపాల్ రాజ్యం విస్తరించి ఉండేది. అయితే ఆంగ్ల పాలనా కాలంలో ఆంగ్లేయులతో జరిగిన యుద్దంలో నేపాల్ రాజ్యం ఓడిపోయింది. తత్ఫలితంగా ఆంగ్లేయులతో 1816వ సంవత్సరంలో సుగాలీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నేపాల్ తమ దేశంలోని కాళీ నది, రాప్తి నది ఈ రెండింటి దిగువ ప్రాంతాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి అప్పగించింది. 1870 నాటికి సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన మ్యాప్ ప్రకారం – లీపులేఖ్ పాస్ నించి దిగువన ఉన్న కాలాపానీ ప్రాంతం వరకు బ్రిటిష్ ఇండియాలోకి వచ్చింది. ఆ కాలం నాటి నేపాల్ రాణా పాలకులు, తర్వాత నేపాలీ రాజులు అందురూ దీన్ని సరిహద్దుగా అంగీకరించారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత నేపాల్ దీనిపై భారత ప్రభుత్వంతో ఎలాంటి అభ్యంతరాలనూ వ్యక్తం చేయలేదు.
ప్రస్తుత వివాదం:
నేపాల్ ప్రభుత్వం కాలాపానీ ప్రాంతం వద్ద సరిహద్దుగా పేర్కొన్న మహాకాళి నదిలో కలిసే ఉపనది కాళీ నది కాదని పేర్కొంటోంది. కాళీ నది ఇంకా పశ్చిమంగా లీపులేఖ్ పాస్ వద్ద నుంచి ప్రవహిస్తోందనీ, అందువల్ల కాలాపానీ,సుస్తా (బిహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోకి వస్తుంది) ప్రాంతంలాన్ని తమ దేశంలోకే వస్తాయని నేపాల్ వాదిస్తోంది. తాజాగా ఆ మేరకు ఒక కొత్త మ్యాప్ ను రూపొందించి విడుదల చేసింది. గతంలోనే ఈ అంశం పై నేపాల్-భారత్ సాంకేతిక స్తాయి ఉమ్మడి సరిహద్దు కార్యాచరణ ఒకటి ఏర్పాటయింది. ఈ బృందం 2007 నాటికి ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుల్లోని 98 శాతం ప్రాంతాంలో ఉన్న 182 స్థలాలపై అన్నీ రకాలుగానూ అంగీకారానికి వచ్చింది. మిగిలిన రెండు శాతం స్థలంలో కాలాపానీ-లింపియాధురా-లీపులేఖ్, సుస్తా ప్రాంతాలున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం వద్ద భారత్ రోడ్డు నిర్మాణాన్ని తలపెట్టడంతో నేపాల్ వెంటేనే తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభించింది. ఈ విషయంలో నేపాల్ ప్రతిస్పందన భారత్ పట్ల అసాధారణంగా, దౌర్జన్యంగా ఉంది. భారత్ రోడ్డు నిర్మాణం ప్రారంభించగానే నేపాల్ ఆ ప్రాంతాల్లో సాయుధ పోలీసులను మోహరించిoది. దాంతో భారత ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. కాలాపానీ ప్రాంతం భారత్-చైనా సరిహద్దులకు దగ్గరగా ఉండడం వల్ల ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే అక్కడ భారత దళాల ఉనికి నేపాల్ కోసం కాకుండా చైనాతో సరిహద్దు కావడం వల్ల ఉంది. సైనికుల మోహరింపు మాత్రమే కాకుండా నేపాల్ అక్కడి లీపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ దేశంలో చూపించే విధంగా ఒక కొత్త మ్యాప్ ను కూడా రూపొందించి విడుదల చేసింది. దాంతో వివాదం మరింత క్లిష్టంగా మారింది. ఈ కొత్త మ్యాప్ ను భారత్ నిర్దందంగా తిరస్కరించింది. ఇది చారిత్రక వాస్తవాలు, రుజువుల ఆధారంగా రూపొందించినది కాదని పేర్కొంది. సరిహద్దు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపకుండా ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని ఖండించింది.