SRUGK

నేపాల్ కొత్త మ్యాప్ కు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం:

భారత్, నేపాల్ సరిహద్దుల్లో భారత్ కు చెందిన మూడు ప్రాంతాలను తమ దేశంలోవీగా చూపిస్తూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన ఒక మ్యాప్ ఆమోదం కోసం ఒక రాజ్యాంగంలోని షెడ్యూల్ 3 సవరణ బిల్లును జూన్ ఒకటో తేదీన నేపాల్ ప్రభుత్వం తమ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. భారత్ సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతాలైన కాలాపానీ, లీపులేఖ్, లింపియాధురాలను ఇందులో తమ దేశంలో ప్రాంతాలుగా నేపాల్ చూపించింది. ఈ సవరణకు నేపాల్ లో ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కానీ భారత సంతతికి చెందిన మధేసీ వర్గాల పార్టీలన్నీ దీన్ని తిరస్కరించాయి. ఆ మూడు ప్రాంతాలూ తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం కొత్త మ్యాప్ ను ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ జూన్ 13వ తేదీన ఎక్రగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభకు హాజరైన 258 మంది సభ్యులు ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.

కాలాపానీ ప్రాంతం:

భారత అధీనంలో ఉన్న కాలాపానీ ప్రాంతం ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని పిత్తోడ్ గఢ్ జిల్లాలో ఉంది. ఏది కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే మార్గంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 20 వేల అడుగుల ఎత్తులో ఉండడం వల్ల ఆ ప్రాంతం మొత్తాన్ని పర్యవేక్షించేందుకుగాను ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి ప్రవహించే కాళీ నది భారత్, నేపాల్ ల మధ్య సరిహద్దులను గుర్తిస్తుంది. 1816 నాటి సుగాలి ఒప్పందంలో ఈ నదిని నేపాల్ కు, భారత్ కు మధ్య గల పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. అయితే కాళీ నది ఎక్కడ ప్రారంభమవుతుందనే విషయాన్ని గుర్తించడంలో వివాదాలే ప్రస్తుతం భారత్, నేపాల్ ల మధ్య ఈ ప్రాంతం పై వివాదాలుగా మారాయి. కాళీ నది మొదలయ్యే ప్రాంతాన్ని రెండు దేశాలూ రెండు రకాలుగా చూపిస్తున్నాయి.

సుస్తా ప్రాంతం:

గండక్ నది ప్రవహించే మార్గంలో అది రెండు దేశాల మధ్య దారి మళ్లే ప్రాంతం మీద గల వివాదాల వల్ల సుస్తా ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఏర్పడ్డాయి. గండక్ నది తీరంపైనే సుస్తా ప్రాంతం నెలకొని ఉంది. ఈ నదిని నేపాల్ లో నారాయణి నదిగా పిలుస్తారు. ఇది బీహార్ లోని పాట్నా వద్ద గంగానదిలో కలుస్తుంది.



భారతదేశ ప్రథములు


• ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్- వవజోత్ కౌర్.

• ఆసియా క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత మహిళ- శాంతి సౌందరాజన్.

• తొలి భారతదేశపు లోక్ పాల్ – జష్టిస్ పినాకి చంద్రఘోష్ (2019).

• తొలిపూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి – నిర్మలా సీతారామవ్ (2019).

• తొలి భారతీయ మహిళా విదేశాంగ మంత్రి – సుష్మా స్వరాజ్ (2014).

• తొలి మహిళా ఇమామ్ – జమిథా (కేరళ) – 2018.

• లోక్ సభ తొలి మహిళా స్పీకర్ – మీరాకుమార్ (2009 – 2014 ససారం నియోజకవర్గం, బీహార్).

• మొదటి మహిళా రాష్ట్రపతి – ప్రతిభా పాటిల్ (2007 – 2012).

• మొదటి రాష్ట్రపతి – బాబూ రాజేంద్రపాసాద్ (1950 – 1962).

• మొదటి ఉపరాష్ట్రపతి – సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 – 1962).

• మొదటి ప్రధానమంత్రి – జవహర్ లాల్ నెహ్రూ (1947 – 1964).

• మొదటి ఉప ప్రధానమంత్రి – సర్దార్ వల్లభాయ్ పటేల్ (1947 – 50).

• సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి – హీరాలాల్ జె. కానియా (1950 – 1951).

• లోక్ సభ మొదటి స్పీకర్ – గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ (1952 – 56).

• లోక్ సభ మొదటి డిప్యూటీ స్పీకర్ – అనంతశయనం అయ్యంగార్ (1952 – 1956).

• అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు – రాకేశ్ శర్మ (1984 సోయూజ్ టి – 11లో).

• అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ – కల్పనా చావ్లా (1997, 2003లలో);

అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయ సంతతి మహిళ సునితా లిన్ విలుయమ్స్ (2006 – 2012).

• అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ మరియు అత్యధిక సమయం స్పేస్ లో నడిచిన తొలి భారత సంశతి మహిళ – సునీతా విలియమ్స్ .

• ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు – తెంసింగ్ వార్కే (1953 మే 29వ).

• ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ – బచేంద్రుపాల్ (1984 మే 24వ).

• ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కువసార్లు అధిరోహించిన మొదటి భారతీయురాలు –అమ్శ జంసెవ్పా (2017లో).

• ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినది – పూదోర్జ్ .

• ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక వయస్సు లో అధిరోహించిన తొలి వ్యక్తి – లవ్ రాజ్ సింగ్ (2017 మే లో).

• అతిపిన్న వయస్సులో ఎవరెస్ట్ ను అధిరోహించిన మహిళ – మాలావత్ పూర్ణ (13 సంవత్సరాలు, 2014లో).

• అతిపిన్న వయస్సులో యం.పి. అయిన వ్యక్తి – చంద్రాణి ముర్మూ కియోంహజర్ (ఒడిషా 2019).

• భారత నౌకాదళంలో తొలి మహిళా అడ్మిరల్ ర్యాంక్ ఆధికారిణి – నిర్మలా కణ్ణన్ .

• దేశంలో తొలి గ్రీన్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది – మవ్వాల్ (జమ్మూకాశ్మీర్).

• దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు - ఐ.కె. బజాజ్.

• దక్షిణ ధ్రువం చేరుకొన్న మొదటి భారతీయ మహిళ – రీవా కౌశల్ (2010).

• యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయ మహిళ పైలట్ – మోహన్ సింగ్ (2019).

• జీమ్నూస్టిక్స్ ప్రపంచకవ్ లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత మహిళ – బుడ్డా అరుణరెడ్డి .

• తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళ – పీ.వి.సింధు .

• సప్తసముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి మహిళ – బులా చౌదరి.

• ఐదు ఖండాలలోని సముద్రాలను ఈదిన తొలి మహిళ – బులా చౌదరి.

• ఇంగ్లీష్ ఛానల్ ను ఈదిన మొదటి భారతీయుడు – మిహిర్ సేన్ (1958 సెప్టెంబర్ 27వ).

• ఇంగ్లీష్ ఛానల్ ను ఈదిన మొదటి భారతీయురాలు – ఆర్తీ సాహా (ఆర్తీ గుప్తా, 1959).

• జిబ్రాల్టర్ జలసంధి ఈదిన తొలి భారతీయ మహిళ – ఆర్తీ సాహా (ఆర్తీ గుప్తా).

• మొదటి ప్రపంచ సుందరి – రీటా ఫారియా (1966).

• మొదటి విశ్వసుందిరి – సుస్మితాపెన్ (1994).

• మొదటి మిస్-ఏసియా పసిఫిక్ – దియా మీర్జా (2000).

• ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం సాధించిన మొదటి ఆంగ్లేయుడు (భారత్ తరపున)– వార్మవ్ ఫ్రీచర్డ్ (1900 పం పు పారిస్ ఒలింపిక్స్).

• ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం సాధించిన మొదటి భారతీయుడు – ఖాషాబా జాదవ్ (1952 హెల్సింకిలో బ్రాంజ్ మెడల్, రెజ్లింగ్).

• ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడు. – రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ (2004 సం పు ఏథెన్స్ ఒలింపిక్స్).

• ఒలింపిక్స్ కు అర్హత పొందిన తొలి భారతీయ మహిళా బాక్సర్ – మేరీకోమ్.

• ఒలింపిక్స్ లో జీమ్నాస్టిక్స్ నుంచి పాల్గొన్న తొలి భారతీయ మహిళ –దీపా కర్మాకర్ (2016 రియో ఒలింపిక్స్).

• భారత్ నుంచి ఒలింపిక్స్ తొలి రజతం సాధించిన మహిళ - పి.వి.సింధూ .

• ఒలంపిక్స్ లో భారత్ నుంచి రెజ్లింగ్ లో పతకం గెలిచిన తొలి మహిళ – పాక్తిమాలిక్ (2016 రియో ఒలింపిక్స్).

• మొదటి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి – అన్నా జార్జ్ .

• మొదటి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి – కిరణ్ బేడి (1972 బ్యాచ్).

• ఐ.రా.స మొదటి సివిల్ పోలీస్ కు అడ్వయిజర్ గా నియమితులైన తొలి వ్యక్తి – కిరణ్ బేడి .

• మొదటి మహిళా డి.జి.పి. అధికారి – కాంచన్ చౌదరీ భట్టాచార్య (ఉత్తరాఖండ్).

• తొలి మహిళా లేశ్టినెంట్ జనరల్ (సైనిక దళం) – పునీతా అరోరా.

• తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్ (వైమానిక దళం) – పద్మా బంధోపాధ్యాయ.

• వైమానిక దళంలో పైలెట్ గా పనిచేసిన మొదటి మహిళ – హరితాకౌర్ దయాల్.

• మొదటి పైలెట్ - జె.ఆర్.డి.టాటా (1929లో).

• మొదటి మహిళా అద్వికెట్ – కొర్నెషియా పొరాబ్జీ.

• సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి – మీరాపా హెబ్ ఫాతిమాబీబీ (1989లో).

• హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి – లీలాసేథ్ (హిమాచల్ ప్రదేశ్).

• హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి – అన్న చాందీ.

• మొదటి మహిళా రాయబారి – విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్ కు 1947-49).

• మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి – చొకిలా అయ్యర్ (2001లో).

• అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి – లెఫ్టినెంట్ రామ్ చరణ్ (1960లో).

• మొదటి మహిళా కేంద్రమంత్రి – రాజకుమారి అమృత్ కౌర్ (ఆరోగ్యశాఖ 1947-57).

• మొదటి మహిళా ముఖ్యమంత్రి – సుచేతా కృపలాని (ఉత్తరప్రదేశ్, 1963-67).

• మొదటి మహిళా స్పీకర్ – షానోదేవి (హర్యానాకు).

• భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన మొదటి మహిళ – అనిబిసెంట్(1917లో).

• భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ – సరోజినీనాయుడు (1925లో).

• మొదటి మహిళా గవర్నర్ – సరోజినీనాయుడు (ఉత్తరప్రదేశ్ కు 1947-49 వరకు).

• భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు – ఉమేష్ చంద్ర బెనర్జీ (1885లో).

• భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు – బద్రుద్దీన్ త్యాబ్జీ (1887లో).

• మొదటి మహిళా ప్రధానమంత్రి – ఇందిరాగాంధి (1966-77, 1980-84).