SRUGK

ఒలింపిక్ క్రీడలు

2800 సంవత్సరాల చరిత్ర కల్గిన ఒలింపిక్ క్రీడలు మొట్టమొదటిసారిగా క్రీ.పూ. 776లో గ్రీస్ దేశంలో ప్రారంభమై క్రీ.శ. 394 వరకు జరిగాయి. రోమ్ చక్రవర్తి ఆదేశాల మేరకు క్రీ.శ. 394లో ఈ క్రీడలను ఆపివేశారు. ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరీ డీ కౌబార్టీన్ కృషి ఫలితంగా 1894లో మొట్టమొదటి ఒలింపిక్ సమావేశం జరిగి, 1896లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలను గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరంలో జరపాలని నిర్ణయించారు. ఈ క్రీడలను ప్రతి నాలుగు సంవత్సరాల కొకసారి నిర్వహిస్తారు. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడల్లో 13 దేశాలకు చెందిన క్రీడాకారులు మాత్రమే పోల్గన్నారు. 1900లో పారిస్ లో జరిగిన రెండవ ఒలింపిక్ క్రీడలలో భారతదేశం మొదటిసారిగా పాల్గొంది. ఈ క్రీడలలో భారత్ కు రెండు రజత పతకాలు లభించాయి. పియరీ డీ కౌబార్టీన్ సలహా మేరకు 1913లో ఒలింపిక్ పతాకం తయారు చేయబడింది. ఒలింపిక్ పతాకంపై ఐదు రింగులు ఉంటాయి. పై వరుసలో మూడు రింగులు, క్రింది వరుసలో రెండు రింగులు ఉంటాయి. నీలంరంగు రింగు – యూరోప్ ఖండాన్ని, నలుపు రింగు – ఆఫ్రికా ఖండాన్ని, ఎరుపు రింగు – అమెరికా ఖండాన్ని, పసుపుపచ్చ రింగు – ఆసియా ఖండాన్ని మరియు ఆకుపచ్చ రింగు – ఆస్ట్రేలియా ఖండాన్ని తెలియ చేస్తాయి. ఒలింపిక్ పతాకాన్ని మొదటిసారిగా 1920లో బెల్జియంలో ఆంట్వెర్ఫ్ లో జరిగిన క్రీడలలో ఒలింపిక్ స్టేడియంపై ఎగురవేశారు. ఒలింపిక్స్ స్ఫూర్తి సందేశం (EPIGRAM)“జీవితంలో గెలవడం కంటే పోరాదడమే ముఖ్యం”. ఒలోంపిక్ క్రీడల ఆశయం లేదా లక్ష్యం (MOTTO)“వేగంగా, ఉన్నతంగా, బలంగా (సైటస్-ఆల్టీస్- ఫోర్టీస్) (ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్)”. దీనిని ఫాదర్ డిడాన్ రూపొందించారు. ఒలింపిక్ జ్యోతిని 1928లో ఆమ్ స్టర్ డ్యామ్ లో జరిగిన ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఒలింపిక్స్ లో అనుసరిస్తున్న జ్యోతి బర్లిన్ (1936) నుంచి అమలవుతున్నది. 1972 నుండి ‘మస్కట్ ను” ప్రవేశపెట్టారు. దక్షిణార్ద గోళంలో ఒలింపిక్ క్రీడలు మొట్టమొదటిసారిగా మెల్ బోర్న్ లో (1956) జరిగాయి. ఆసియా ఖండంలో మొట్ట మొదటిసారిగా 1964లో టోక్యోలో జరిగాయి. 2016లో 31వ క్రీడలు రియోలో (బ్రెజిల్) జరగగా, 32వ క్రీడలు 2021లో టోక్యో (జపాన్)లోనూ, 33వ క్రీడలు 2024లో పారిస్ (ఫ్రాన్స్)లోనూ, 2028లో 34వ క్రీడలు లాస్ ఏంజిల్స్ (అమెరికా)లోనూ జరగనున్నాయి.



ఒలింపిక్స్ లో భారతదేశం


• ఒలింపిక్ లో భారత్ గెలిచిన పతకాలు 28. అందులో 9 స్వర్ణాలు కాగా.. 7 రాజతాలు, 12 కాంస్యాలు. 1900 నుంచి ఇప్పటిదాకా 24 సార్లు భారత్ ఒలింపిక్స్ లో పోటీ పడింది. 18 సార్లు పతకాలు నెగ్గగా, అరుసార్లు శూన్యహస్తమే.

• వ్యక్తిగత విభాగంలో భారత్ కు దక్కిన స్వర్ణం ఒక్కటే. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో షూటర్ అభినవ్ బింద్రా సాధించాడు.

• లండన్ ఒలింపిక్స్ (2012)లో భారత్ కు దక్కిన పతకాలు 6. ఒక ఒలింపిక్స్ లో భారత్ సాధించిన అత్యధిక పతకాలివే. అందులో 2 రాజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.

• ఒలింపిక్స్ లో భారత్ కు అత్యధిక పతకాలు దక్కింది హాకీలో 11.8 స్వర్ణాలు సహా 11 పతకాలు సాధించారు హాకీ వీరులు. 1928-1956 మధ్య భారత్ వరుసగా అరుసార్లు స్వర్ణాలు గెలవడం విశేషం.


శీతాకాలపు ఒలింపిక్స్ క్రీడలు


శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు 1924లో ఫ్రాన్స్ లోని చామోనిక్స్ లో మొట్టమొదటిసారగా జరిగాయి. అప్పటివరకు ఇందులోని క్రీదాంశాలన్నీ ఒలింపిక్ క్రీడలలోనే జరిగేవి. 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడాలని, మామూలుగా జరిగే క్రీడలను వేసవికాలపు ఒలింపిక్ క్రీడాలని పిలవడం ప్రారంభమయింది. ఈ క్రీడలలో ‘మస్కట్’ ను 1976 నుండి ప్రవేశపెట్టారు. 24వ క్రీడలు 2014లో సోచి (రష్యా)లో జరగగా, 25వ క్రీడలు 2018లో సీయాంగ్ చాంగ్ (దక్షిణ కొరియా), 26వ క్రీడలు 2022లో బీజింగ్ (చైనా)లో జరగనున్నాయి.


కామన్ వెల్త్ క్రీడలు


కామన్ వెల్త్ క్రీడలలో కామన్వెల్త్ సంస్థలో సభ్యత్వం గల దేశాలన్నీ పాల్గొంటాయి. మొదట వీటిని “బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్” అని పిలిచేవారు. మొట్టమొదటి సారిగా ఈ క్రీడలు 1930లో కేవడాలోని హామిల్టన్ ప్రారంభామయ్యాయి. ఇందులో కేవలం 11 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి ఈ క్రీడలు జరుగుతాయి. 1998 కామవెల్త్ క్రీడలలో మొదటిసారిగా క్రికెట్ ను ప్రవేశపెట్టారు. కామన్వెల్త్ క్రీడలు 2006 సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగాయి. 2010 ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల మస్కట్ గా మన జాతీయ జంతువు ‘పులి’ ని ఎంపిక చేశారు. 20వ క్రీడలు 2014లో కామన్వెల్త్ క్రీడలను గ్లాస్కో (స్కాట్లాండ్)లో జరిగాయి. 21వ క్రీడలు 2018లో గోల్డ్ కోస్ట్ సిటీ (ఆస్ట్రేలియా) జరగగా, 22వ క్రీడలు 2022 బ్ర్మింగ్ హామ్ (ఇంగ్లాండ్)లో జరగనున్నాయి. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో 2018 ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరిగిన. 21వ కామన్వెల్త్ ఈవెంట్స్ లో 23 క్రిడాంశాల్లో 71 దేశాల నుంచి 6,600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. భారత్ తరపున మొత్తం 218 మంది క్రీడాకారులు 17 క్రీడాంశాల్లో పోటీపడగా 26 స్వర్ణాలు, 20 రాజాతాలు, 20 కాంస్యాలు కలిపి మొత్తం 66 పతకాలు దక్కాయి. మొత్తం 198 పాతకాలతో పదమూడోసారి కూడా ఆస్ట్రేలియానే అగ్రస్థానలో నిలిచింది. ఇందులో 80 స్వర్ణాలు, 59 రాజతాలు, 59 కాంస్యాలున్నాయి. 136 పతకాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉండి. టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్ లో పాల్గొన్న 11 ఏళ్ల వేల్స్ చిన్నారి అనా హర్స్ అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పి.వి.సింధు పతాకధారిగా వ్యవహరించగా, ముగింపు వేడుకల్లో మెరీకొమ్ నేతృత్వం వహించింది.


ప్రపంచ కప్ పుట్ బాల్


ప్రపంచంలో ఒలింపిక్ క్రీడల తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడలు ప్రపంచకప్ పుట్ బాల్. ప్రపంచకప్ పుట్ బాల్ పోటీలను ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి అంతర్జాతీయ పుట్ బాల్ సమాఖ్య (ఫిఫా) నిర్వహిస్తుంది. 1930లో మొట్టమొదటిసారిగా ఉరుగ్వేలో ఈ పోటీలు ప్రారంభామయ్యాయి. ప్రపంచకప్ శుద్ధమైన బంగారంతో 12 అంగుళాల ఎత్తు కలిగి ఉంటుంది. ప్రపంచకప్ పుట్ బాల్ ను ఇప్పటివరకు బ్రెజిల్ అత్యధికంగా 5 సార్లు గెలుచుకొంది. 2018 లో రష్యాలో (21వ) జరగగా, 2022లో ఖతార్ లో (22వ) ప్రపంచకప్ పుట్ బాల్ జరగనుంది. 2018 జులై 15న లుజ్నికి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 గోల్స్ తేడాతో క్రొయేషియాపై గెలిచింది. విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 260 కోట్లు) ప్రైజ్ మనిగా లభించాయి. 2018 జులై 14న మూడో స్థానం కోసం జరిగిన పోరులో బెల్జియం 2-0 గోల్స్ తో ఇంగ్లాండ్ ను ఓడించింది. అవార్డులు; గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్ చేసినవారికి): హ్యారీకేన్ (ఇంగ్లాండ్; 6 గోల్స్) గోల్డెన్ బాల్ (ఉత్తమ ఆటగాడికి): లూకా మోద్రిచ్ (క్రొయేషియా); గోల్డెన్ గ్లోప్ (ఉత్తమ గోల్ కీపర్ కి): కోర్ట్ వా (బెల్జియం);ఫెయిర్ ప్లే (న్యాయంగా ఆడిన జట్టుకి): స్పెయిన్ జట్టు; యాంగ్ ప్లేయర్ (ఉత్తమ యువ ఆటగాడికి): ఎంబపే (ఫ్రాన్స్)


టెన్నిస్


• టెన్నిస్ మొదట 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది. టెన్నిస్ 4 అతిముఖ్యమైన టోర్నమెంట్లను ‘గ్రాండ్ స్లామ్స్’ అంటారు. వీటినే ‘మేజర్స్’ అని అంటారు.

• నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో అతి పురాతనమైనది - వింబుల్డన్.

• నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో ఎక్కువ ప్రైజ్ మనీ ఉన్నది - యుఎస్ (2013 నుంచి).

• పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ లు గెలిచిన క్రీడాకారుడు - రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్).

• మహిళల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన క్రీడాకారిణి - మార్గరెట్ కౌర్ట్ (24) (ఆస్ట్రేలియా).

• పురుషుల సింగిల్స్ లో 6 గ్రాండ్ స్లామ్స్ వరుసగా గెలిచిన ఏకైక క్రీడాకారుడు - డాన్ బడ్జ్.

గోల్డెన్ స్లామ్: ఒకే కేలండర్ సంవత్సరంలో 4 మేజర్ల (గ్రాండ్ స్లామ్)తో పాటు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధిస్తే అది గోల్డెన్ స్లామ్ లేదా గోల్డెన్ గ్రాండ్ స్లామ్. టెన్నిస్ లో గోల్డెన్ స్లామ్ సాధించిన ఏకైక వ్యక్తి – స్టెఫీ గ్రాఫ్ (1988లో 4 మేజర్లతోపాటు సియోల్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించింది).

• ప్రపంచ టెన్నిస్ లో అత్యధిక కాలం నెంబర్ – 1గా కొనసాగినవారు – స్టెఫీ గ్రాఫ్ (జెర్మనీ). ఒకే గ్రాండ్ స్లామ్ ను అత్యధికంగా ఎక్కువసార్లు గెలిచినవారు – 1. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియన్ ఓపెన్ – 11), 2. రఫెల్ నాదల్ (ఫ్రెంచ్ ఓపెన్).