SRUGK

శాఫ్ (దక్షిణాసియా సమాఖ్య) క్రీడలు

కామన్వెల్త్ క్రీడల మాదిరిగానే దక్షిణాసియా దేశాలు (సార్క్ దేశాలు) పాల్గొనే క్రీడలే శాఫ్ క్రీడలు. దక్షిణాసియా సమాఖ్య అనేది 1982లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. ఇందులో గల దేశాలు భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, భూటాన్. శాఫ్ పతాకంపై పావురం బొమ్మ ఉంటుంది. ఈ పతాకంపై గల చిహ్నం శాంతికి సంకేతాన్ని సూచిస్తుంది. మొట్టమొదటి శాఫ్ క్రీడలు 1984 లో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగాయి. ఇప్పటివరకు మొత్తం 12 సార్లు శాఫ్ క్రీడలను నిర్వహించారు. 12వ శాఫ్ క్రీడలు 2016లో భారత్ లో 2019 ఖాట్మండూ (నేపాల్)లో జరుగగా, 2021లో లాహోర్ (పాకిస్థాన్)లో జరుగునున్నాయి.



ఆసియా క్రీడలు


1947లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియన్ రిలేషన్స్ సమావేశంలో ఆసియా ఖండంలో ఒక అంతర్జాతీయ క్రీడోత్సవాలను ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశ ఫలితంగా 1951లో న్యూఢిల్లీలో మొట్టమొదటి ఆసియా క్రీడలు జరిగాయి. ఆసియా క్రీడల చిహ్నం “ముడిపడిన వృత్తాల మధ్య నుంచి ప్రకాశిస్తున్న సూర్యుడు”. ఆసియా క్రీడల నినాదం (Motto) “ఎవర్ ఆన్ వర్డ్”. ఆసియా క్రీడలను థాయ్ లాండ్ దేశం అత్యధికసార్లు (నాలుగు) నిర్వహించింది. 2010లో ఆసియా క్రీడలు గాంగ్జూ (చైనా)లో జరిగాయి. 2014లో ఆసియా క్రీడలు ఇంచిగాన్ లో జరగగా, 2018లో జకార్తా (ఇండోనేషియా)జరగగాలో, 2022లో హంగ్జూ (చైనా)లో జరగనున్నాయి.



జకార్తాలో జరిగిన 18వ ఆసియా క్రీడలు


ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఈ ఆసియా క్రీడల్లో భారత్ కు దక్కిన 2018 ఆగస్టు 18 నుంచి సెప్టంబర్ 2 స్వర్ణాలు 15. 1951లో తొలి ఆసియా క్రీడల వరకు 18వ ఆసియా క్రీడలు ఘనంగా జరిగాయి. 45 దేశాల నుంచి 11 వేల మందికిపైగా అథ్లెట్లు మార్చ్ ఫాస్ట్ చేశారు. జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా నేతృత్వంలో భారత బృందం మార్చ్ ఫాస్ట్ లో పాల్గొంది. మొత్తం 40 క్రిడాంశాల్లోని 465 ఈవెంట్లకు పోటీలు జరిగాయి ముగింపు కార్యక్రమం సెప్టెంబర్ 2నా జకార్తాలోని గెలోరాబాంగ్ కర్నో స్టేడియంలో జరిగింది. తర్వాత ఇన్ని స్వర్ణాలు సాధించడమీదే తొలిసారి. మొత్తంగా 69 పతకాలొచ్చాయి. 65 పతకాలతో 2010లో నెలకొల్పిన అత్యధిక పతకాల రికార్డు బద్దలైంది. మొత్తంగా ఆసియా క్రీడల చరిత్రలో భారత్ కిదే అత్యుత్తమ ప్రదర్శన అయింది. షూటర్ సౌరభ్ చౌదరి ఈ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అతడికి 16 ఏళ్ల. 60 ఏళ్ల బ్రిడ్జ్ క్రీడాకారుడు ప్రణబ్. స్వర్ణం సాధించిన అతిపెద్ద వాయుస్కుడైన భారతీయుడయ్యాడు. ఆసియా క్రీడల్లో పసిడి కొల్లగొట్టిన భారత తొలి మహిళా రెజ్లర్ గా వినేశ్ ఫోగాట్ రికార్డు పుస్తకాలకెక్కింది. ఫోగాట్ 50 కిలోల విభాగంలో పసిడి పతకం సాధించింది.



ప్రపంచ కప్ హాకీ

ప్రపంచ కప్ హాకీ పోటీలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహిస్తుంది. ఈ పోటీలు మొట్ట మొదటిసారిగా 1971 బార్సీలోనా (స్పెయిన్)లో ప్రారంభమయ్యాయి. 1978 నుంచి ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి నిర్వహించబడుతున్నాయి. భారతదేశం 1975లో ప్రపంచకప్ ను గెలుచుకున్నది. ఇప్పటివరకు అత్యధికంగా పాకిస్థాన్ నాలుగుసార్లు ప్రపంచకప్ ను గెలుచుకుంది. 2018లో భువనేశ్వర్ (భారత్)లో జరిగిన హాకీ ప్రపంచకప్ ను బెల్జియం నెదర్లాండ్స్ ను ఓడించి సొంతం చేసుకుంది. 2023లో భారత్ వేదికగా ప్రపంచకప్ ను హాకీ జరగనుంది.


భారత హాకీ విశేషాలు

• హాకీ భారతదేశ జాతీయ క్రీడ.

• ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్స్వంగా జరుపుకొంటారు.

• ఆసియా కప్ హాకీలో భారత్ ఇప్పటి వరకు (2003, 2007) రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది.

• ఒలింపిక్స్ లో భారత్ హాకీ జట్టు 1928 నుండి వరుసగా 1956 వరకు ఆరుసార్లు స్వర్ణం సాధించింది. తర్వాత 1964లో ఒకసారి, చివరిసారిగా 1980లో మాత్రమే స్వర్ణాలు సాధించింది.

• 2008 బీజింగ్ ఒలింపిక్స్ కు భారత్ క్వాలిఫై కూడ కాలేదు.

• 2010 ప్రపంచ కప్ లో భారత్ 8వ స్థానంలో నిలవగా, 2014లో 9వ స్థానం నిలిచింది.


ఇతర విషయాలు:

• అంతర్జాతీయ హాకీ సమాఖ్య 1884లో ప్రారంభమయింది.

• హాకీలో ఆసియాకప్, ప్రపంచకప్ లను ఎక్కువసార్లు గెలుపొందిన దేశం పాకిస్థాన్.

• హాకీ ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యం ఇప్పడం ఇది మూడవసారి. మొదటిసారి 1982లో ముంబయిలో, 2010లో ఢిల్లీలో ప్రపంచకప్ హాకీ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది.


క్రికెట్

ప్రపంచ కప్:

1975లో తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ను ఇంగ్లాండ్ లో ప్రారంభించారు. అంతకు ముందు టెస్ట్ క్రికెట్ ఉండేది. టెస్ట్ స్థానంలో 1971లో పరిమితి ఓవర్లు మ్యాచ్ లను (60 ఓవర్లు) ప్రవేశపెట్టారు. 1975 నుండి పరిమిత ఓవర్ల ప్రపంచ కప్ ను ప్రారంభించారు. అయితే 1987లో జరిగిన ప్రపంచ కప్ నుండి పరిమిత ఓవర్లను 60 నుండి 50 ఓవర్లకు కుదించడం జరిగింది.1975 నుండి ప్రతి నాలుగు సం లకు ఒకసారి ప్రపంచ కప్ నిర్వహిస్తున్నారు. దీనిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్వహిస్తున్నది. 1975 నుండి 2019 వరకు 12 ప్రపంచ కప్ లు పోటీలు జరిగాయి. మొదటి ప్రపంచ కప్ ను వెస్టిండీస్ చేజిక్కించుకోగా, అత్యధికంగా ఐదు సార్లు ఆస్ట్రేలియా కాగా, భారత్, వెస్టిండీస్ చెరీ రెండు సార్లు విజయం సాధించాయి.


రంజీ ట్రోఫీ

భారత క్రికెట్ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీ అయిన “రంజీ ట్రోఫీ” 1934వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది. అప్పటి ప్రపంచ క్రికెట్ లో గొప్ప క్రికెటర్ గా ఖ్యాతి గడించిన ‘కె.ఎస్. రంజిత్ సింగ్’ పేరిట ఈ ట్రోఫీకి “రంజీ ట్రోఫీ” అని పేరు పెట్టడం జరిగింది. మొట్టమొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్, మద్రాస్, మైసూర్ జట్ల మధ్య జరిగింది. ట్రోఫీలో పాల్గొనే 27 జట్లను రెండు శ్రేణుల్లోకి విభజించింది. ఈ శ్రేణుల్లో ఒకటి “ఇలిట్ గ్రూప్” కాగా, రెండవది “ప్లేట్ గ్రూప్”. ఇదిలా ఉంటే.. రంజీట్రోఫీని, ఇప్పటివరకూ ఎక్కువ సార్లు గెలుచుకున్న జట్టు ముంబయి క్రికెట్ జట్టు. రంజీ ట్రోఫీ విజేతకు రూ.2 కోట్లు, రన్నరప్ కు కోటి రూపాయలు ప్రైజ్ మనీని అందిస్తారు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)

భారతదేశంలో జరిగే దేశీయ 20 ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్ నే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)గా వ్యవహరిస్తున్నారు. 2007లో బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా(బీసీసీఐ) దీనికి రూపుదిద్దింది. 2008 నుంచీ ప్రారంభమై ఏటా ఏప్రిల్, మే నెలల్లో జరుగుతాయి. టోర్నీలో నెగ్గిన జట్టుకు రూ. 20 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ. 12.5 కోట్లు. ఐపీఎల్ విజేతలు...


• ఐపీఎల్ – 1 (2008): రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్కింగ్స్ పై విజయం.

• ఐపీఎల్ – 2 (2009): దక్కన్ చార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ పై విజయం.

• ఐపీఎల్ – 3 (2010): చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పై విజయం.

• ఐపీఎల్ – 4 (2011): చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పై విజయం.

• ఐపీఎల్ – 5 (2012); కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం.

• ఐపీఎల్ – 6 (2013): ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం.

• ఐపీఎల్ – 7 (2014): కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్ ఎలెవన్ పంజాబ్ లో విజయం.

• ఐపీఎల్ – 8 (2015): ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం.

• ఐపీఎల్ – 9 (2016): సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై విజయం.

• ఐపీఎల్ – 10 (2017): ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణేపై విజయం.

• ఐపీఎల్ – 11 (2018): చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వేకెట్లు తేడాతో విజయం.

• ఐపీఎల్ – 12 (2019): ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్ పై 1 పరుగు తేడాతో విజయం.

• ఐపీఎల్ – 13 (2020): ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పై 5 వికెట్లు తేడాతో విజయం.