ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కంప్యూటర్ టెక్నాలజీ
• కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ యంత్రం.
• కంప్యూటర్ అనే పదం Computerac అనే లాటిన్ పదం నుంచి వచ్చింది.
• కంప్యూటర్ అనగా ‘గణన’ అని అర్థం.
• కంప్యూటర్ అనేది సాఫ్ట్ వేర్ & హార్డ్ వేర్ ల కలయిక.
• చైనీయులు అబాకస్ (Abacus) అనే ఒక వస్తువును వేగంవంతమైన గణనల కోసం తయారుచేశారు.
• బి.పాస్కల్ రూపొందించిన “పాస్కల్ యంత్రాన్ని మొట్టమొదటి మెకానికల్ కాలిక్యులేటర్’ గా పిలుస్తారు.
• 1833లో ఎనాలటికల్ ఇంజిన్ ను ఛార్లెస్ బాబేజీ తయారుచేశారు.
• Father of Computer– ఛార్లెస్ బాబేజి.
• FatherofModernComputer– అలెన్ ట్యూరింగ్.
• 1948లో జాన్ వాన్ న్యూమన్ అనే శాస్త్రవేత్త కంప్యూటర్ నిర్మాణాన్ని రూపొందించాడు.
• EDVAC అనేది మొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ .
• మొట్టమొదటి సాధారణమైన కంప్యూటర్ –ENIAC (ElectronicNumericalIntegratorAndCalculator).
• అమెరికాలోని BellLaboratory 1953వ సం లో ట్రాన్సిస్టర్ ను కనుగొన్నారు. దీనిని అర్థ వాహకాలైన జెర్మేనియం, సిలికాన్ లతో తయారు చేశారు.
కంప్యూటర్ తరాలు:
• మొదటి తరం – వాక్యూమ్ ఆధారిత కంప్యూటర్లు.
• రెండవ తరం – సెమీ కండక్టర్లను ఉపయోగించారు.
• మూడవ తరం –ఇంటిగ్రేటెడ్ సర్క్యుట్స్ ను ఉపయోగించేవారు.
• నాల్గవ తరం – మైక్రో ప్రాసెసర్ ను ఉపయోగించేవారు.
• ఐదవ తరం – కృత్రిమ మేధస్సు.
పరిమాణం ఆధారంగా కంప్యూటర్ వర్గీకరణ :
1.మైక్రో కంప్యూటర్ల:
ఇవి అధునాతమైనవి. వీటిని పర్సనల్ కంప్యూటర్లు అంటారు. పోర్టబుల్ కంప్యూటర్లు అనేవి మైక్రో కంప్యూటర్ లో వేగంగా అభివృద్ధి చేయబడిన కంప్యూటర్లు. ఉదా: డెస్క్ టాప్, నోట్ బుక్ (ల్యాప్ టాప్, ట్యాబ్స్).
• ల్యాప్ టాప్ ను రూపొంధించినది – అలెన్ కె .
2.మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు:
విస్తృతమైన, సంక్లిష్టమైన కార్యక్రమాల నిర్వహణ కోసం వీటిని వాడతారు. ఏకకాలంలో అనేక కార్యక్రమాలను వేగంగా నిర్వహించుకోవచ్చు. ఉదా: IBM– 3090.
3.మినీ కంప్యూటర్లు:
పరిమాణంలో చిన్నవిగా, వేగంగా పని చేసే తక్కువ ఖర్చుగలవి. చిన్న చిన్న వ్యాపార అవసరాలకు ఉపయోగపడేవి. ఉదా: IDP– 1170.
4.సూపర్ కంప్యూటర్లు:
• ఇవి అత్యాధునిక కంప్యూటర్లు.
• వీటిని మొదటగా కనుగొన్నది - సి.మోర్ క్రె (USA).
• భారత్ లో కంప్యూటర్ ల పాలసీని తొలిసారిగా 1984లో ప్రకటించారు.
• పారాల్ ప్రాసెసింగ్ విధానం ద్వారా ఇవి పని చేస్తాయి.
• సి.మోర్ క్రె రూపొందించిన తొలి సూపర్ కంప్యూటర్ CDC– 6600.
• వీటి యొక్క వేగాన్ని FLOPS (FloatingPointOperationsPerSecond) తో కొలుస్తారు.
భారత్ లో సూపర్ కంప్యూటర్లు
1.పరమ్ – 8000:
మనదేశంలో మొదటగా తయారు చేయబడిన సూపర్ కంప్యూటర్.
• దీనిని C-DAC (పూణె) అనే సంస్థ రూపొందించింది.
• C-DAC–CenterforDevelopmentofAdvancingComputing.
2.పరమ్ పద్మ:
మొదటి టెరాఫ్లాష్ క్లబ్ లో చేరిన కంప్యూటర్. (ఏప్రిల్ 1, 2003).
3.ఏక:
దీనిని హేవిలెట్ – పకార్డ్ అనే సంస్థ యొక్క సాంకేతిక సహకారంతో టాటా గ్రూప్ వారి కోసం కంప్యుటేషనల్ రీసెర్చ్ లేబరేటరీస్ అనే సంస్థ వారు తయారు చేశారు.
4.విర్గో:
దీనిని చెన్నైకి చెందిన వారు తయారుచేశారు.
5.సాగా – 220:
ఈ సూపర్ కంప్యూటర్ ను 14 కోట్ల వ్యయంతో ఏరోనాటికల్ సైన్స్ సేవలకు ఉద్ధేశించి ఇస్రో విభాగమైన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (త్రివేండ్రమ్) వారు 2011లో తయారు చేశారు.
6.అన్నపూర్ణ:
దీనిని చెన్నైకి చెందన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెథమెటికల్ సైన్సెస్ వారు తయారుచేశారు.
7.ప్రత్యూష్ మరియు మిహిర్:
వరుసగా పూణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ మరియు నేషనల్ సెంటర్ ఫర్ మీడియా రేంజ్ వెదర్ ఫోర్ కాస్ట్ నోయిడాలో స్థాపించబడిన సూపర్ కంప్యూటర్లు.
ప్రపంచంలో సూపర్ కంప్యూటర్స్
• 2020 లో ప్రపంచంలో వేగవంతమైన మొదటి సూపర్ కంప్యూటర్ జాబితాలో చేరిన కంప్యూటర్ పూజిట్సు పుగాకు (జాపాన్); (442 PFLOPS స్పీడ్).
మొబైల్ ఫోన్ టెక్నాలజీ
• మొదటిగా సెల్యూలార్ ఫోన్ ను కనుగొన్నది – మార్టిన్ కూపర్ (1973).
• తొలిసారి సెల్ ఫోన్ తయారు చేసిన కంపెనీ – ఎరిక్ సాన్ .
• సెల్ ఫోన్ టవర్ యొక్క పరిధి – 26 చ.కి.మీ .
• మనదేశంలో మొబైల్ టెలిఫోన్ సేవలు అందుబాటులోకి వచ్చిన సం 1994.
• భారత్ లో ప్రస్తుతం అతిపెద్ద టెలిఫోన్ కంపెనీ –BSNL.
• ప్రపంచంలో అతిపెద్ద సెల్ కంపెనీ – వోడాఫోన్.
• మొబైల్ ఫోన్ లో 3 రకాల సాంకేతికాలను వాడుతున్నారు.
1.CDMA (CodeDivisionMultipleAccess):
• ఇది రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీలో సమాచార మార్పిడి కోసం ఉపయోగించే ఒక విధానం. ఇది సాధారణంగా పాతఫోన్ లలో వాడతారు. దీనిని Qualcomm (అమెరికా) అభివృద్ధి చేశారు.
2.GSM (GlobalSystemforMobileCommunication):
• ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడుతున్నారు.
కంప్యూటర్ కలిగి ఉండే భాగములు
ఇన్ పుట్ డివైసెస్
1.కీ బోర్డు
2.పాయింటింగ్ డివైసెస్
3.బార్ కోడ్ రీడర్
4.OMR (ఆప్టికల్ మార్క్ రీడర్)
5.MICR (MagneticInkCharacterRecognition)
6.మౌస్
7.కెమెరా
8.లైట్ పెన్
9.వెబ్ కామ్
10.మైక్రోఫోన్
అవుట్ పుట్ డివైసెస్
1.మానిటర్స్
2.ప్రింటర్
3.స్పీకర్
4.ప్రొజెక్టర్స్ (LCD,DCP)
5.హెడ్ ఫోన్స్
6.GPS (గ్లోబల్ పోసిషనింగ్ సిస్టమ్)
7.సౌండ్ కార్డ్స్
8.ప్లాటర్
బగ్
• కంప్యూటర్ ప్రోగ్రామ్ లో వచ్చే దోషాన్ని “బగ్” అంటారు.
• ప్రోగ్రామ్ లోని దోషాన్ని సవరించటాన్ని “డీ బగ్గింగ్” అంటారు.
ఇంటర్నెట్:
• విశ్వవ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న నెట్ వర్క్ లను కలిపే ఒక పెద్ద నెట్ వర్క్ – ఇంటర్నెట్.
• ఇంటర్ నెట్ వందకు పైగా దేశాలను కవర్ చేస్తూ, 65 మిలియన్లకు పైగా కంప్యూటర్లను అనుసంధానం చేస్తోంది.
WWW: (వరల్డ్ వైడ్ వెబ్)
• ఇది వెబ్ సైట్ల చిరునామాలకు ముందు టైప్ చేయడం ద్వారా కోరుకున్న సమాచారాన్ని కలిగిన వెబ్ సైట్లను చేరుకోవచ్చు.
• దీనిని సృష్టించిన వ్యక్తి టీమ్ బెర్నర్సలీ.
బ్రౌజర్:
• ఇంటర్నెట్ లోని వరల్డ్ వైడ్ వెబ్ పేజీలలో సమాచారాన్ని వెతకటానికి, సమాచారాన్ని పొందటానికి ఉపయోగపడే సాఫ్ట్ వేర్.
ఉదా: మైక్రోసాఫ్ట్ కంపెనీ “ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్”.
మోడెమ్
• కంప్యూటర్ ను ఇంటర్నెట్ తో అనుసంధానం చేయటానికి అవసరమైన సాధనం.
• ఇది టెలిఫోన్ వైర్లలో ప్రయాణించే ఎనలాగ్ సిగ్నల్స్ ను కంప్యూటర్ అర్థం చేసుకోగలిగే డిజిటల్ సిగ్నల్స్ గా మారుస్తుంది.
నెట్ వర్క్ పదాలు:
1.ARPANET – Advanced Research Project Agency Network.
2.LAN – Local Area Network.
.3.W-LAN - Wireless LAN.
4.WAN –Wide Area Network.
5.MAN – Metro Politon Area Network.
6.PAN – Personal Area Network.
7.VPNA - Virtual Private Network.
బ్లూటూత్:
బ్లూటూత్ అనేది తక్కువ దూరంలో పనిచేసే వైర్ లెస్ టెక్నాలజీ (10 మీ (లేదా) 32 అడుగుల మధ్య). కీబోర్డులు, మౌస్ లు, డిజిటల్ కెమెరాలలో, మొబైల్ ఫోన్ లలో వాడుకోవచ్చు. డేటాను ఒక చోటు నుంచి వేరొక చోటుకి పంపించవచ్చు.
Wi-Fi:
వై-ఫై అనగా వైర్ లెస్ ఫెడిలిటి. దీనిని నెట్ ఆపరేటర్ వైర్ లెస్ ద్వారా సిగ్నల్ అందించడాన్ని వై-ఫై అంటారు. ఇది ఏ ప్రదేశంలోనైనా తన యొక్క పరిధిలో పని చేస్తుంది.
Wi-Fiటెక్నాలజీ:
ఇది కొత్త వైర్ లెస్ టెక్నాలజీ. అత్యధిక వేగంగా ఇంటర్ నెట్ సర్వీస్ ను గ్రామీణ ప్రాంతాలకు అందించడానికి వాడుతున్నారు. కేబుల్ వైర్ లేకుండా వైర్ లెస్ సేవల ద్వారా ఇంటర్నెట్ ను వాడవచ్చు.
UniformResourceLocator (URL):
• వరల్డ్ వైడ్ సైట్ లో పేర్లు, అడ్రస్ లు ఏ సైట్ లలోనైనా చూసుకోవచ్చు.
హార్డ్ వేర్
• కంప్యూటర్ లోని మెషినరీ & ఇతర ఎక్విప్ మెంట్ (CPU, డిస్క్, టేప్ లు, మోడెమ్, కేబుల్స్)ను హార్డ్ వేర్ గా చెప్పవచ్చు.
సాఫ్ట్ వేర్
• ఇది కంప్యూటర్ లోని హార్డ్ వేర్ పని చేయించే వివిధ ప్రోగ్రామ్ ల సముదాయం.
• సాఫ్ట్ వేర్ తార్కికతకు, భాషకు (LogicandLanguage) సంబంధించిన భాగం.