SRUGK

డిజిటల్ ఇండియా

• దీనిని మోదీ ప్రభుత్వం 1 జులై 2015 నాటికి ప్రారంభించింది.

• దీని నినాదం –PowertoEmpower.

• టెక్నాలజీ రంగంలో దేశాన్ని సాధికారత వైపు తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యం.

• దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు.

• 'నానో' టెక్నాలజీలోని 'నానో' పదం గ్రీకుభాషలోని 'నానోస్" నుంచి ఆవిర్బవించింది. నానోస్ అంటే మీటర్ లో 10-9 వంతు లేదా వందకోట్ల వంతు.

• కంప్యూటర్లను అవి పనిచేసే సూత్రాన్ని బట్టి, వాటికి ఇచ్చే ఇన్ పుట్ విలువను బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తారు. అవి డీజిటల్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్, ఎనలాగ్ కంప్యూటర్.

• డీజిటల్ కంప్యూటర్: సంఖ్యలకు సంబంధించిన కంప్యూటర్లు ఇవి మొత్తం ఇన్ పుట్ ను ఏరూపంలో ఇచ్చినా, వాటిని తిరిగి సంఖ్యారూపంలో మార్పు చేసుకుంటాయి. ఇవి సంఖ్యలను మార్పు చేసుకొని, కేవలం, కూడికలు, తీసివేతలతో ఇన్ పుట్ ను విశ్లేషించి, ఫలితాన్ని అందిస్తాయి. నిత్యం మనం సాధారణంగా ఉపయోగించే కంప్యూటర్లు డీజిటల్ కంప్యూటర్లు.

• ఎనలాగ్ కంప్యూటర్లు: పీడనం, ఉష్ణోగ్రత వంటి భౌతిక విలువలను తీసుకొని, వాటికనుగుణమైన విద్యుత్ రంగాలను విశ్లేషించటం ద్వారా ఫలితాన్ని అందిస్తాయి.

• హైబ్రిడ్ కంప్యూటర్లు: ఎనలాగ్, డీజిటల్ విభాగాలు రెండు కలిపి తయారుచేసిన కంప్యూటర్లు. వీటిలో కొన్ని లెక్కలు ఎనలాగ్ విభాగంలోను, మరికొన్ని డీజిటల్ విభాగంలోను జరుగుతాయి.

• మైక్రోకంప్యూటర్లు: వీటికే మరోపేరు పర్సనల్ కంప్యూటర్లు (PC). చేతిలో పట్టే టాప్ పామ్ కంప్యూటర్స్ నుంచి, డెస్క్ టాప్ కంప్యూటర్లు వరకు ఇవి వివిధ సైజులలో లభిస్తాయి. మొట్టమొదటి పి.సి.ని., ఐ.బి.ఎం. సంత 1981 లో విడుదల చేసింది.

• మినీకంప్యూటర్లు:మైక్రోకంప్యూటర్ల కన్నా అధిక వేగం, శక్తి, మెమొరీ కలిగినవి. చిన్న చిన్న వ్యాపార అవసరాలకు వాడతారు. 'సమయాన్ని విభజించి-ఉపయోగించుట' అనే సూత్రం వల్ల ఒకే సమయంలో వేర్వేరు వ్యక్తులు వివిధ రకాల కార్యకలాపాలు నిర్వర్తించే అవకాశం ఉంటుంది.

• మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు: సంక్లిష్టమైన కార్యక్రమాల నిర్వహణ కోసం రూపోండించబడినవి. ఏకకాలంలో అనేక కార్యక్రమాలను అత్యంత వేగంగా నిర్వహించడం వీటి ప్రత్యేకత. సాధారణంగా వాతావరణ పరిశోధన, రక్షణ, అనురంగాలలో వీటి ఉపయోగం అధికం. "సమయాన్ని విభజించి, ఉపయోగించుట" అనే సూత్రంపైన ఆధారపడి పనిచేస్తాయి.

• సూపర్ కంప్యూటర్లు: ఇంతవరకు కనుగొన్న వాటిలో అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్. దీనిని పెట్రోలియం వెలికతీత, ఉత్పత్తి, స్ట్రక్చరల్ ఎనాలిసిస్, భౌతిక రసాయన శాస్త్రాలు, ఎలక్ట్రానిక్ డిజైన్, న్యూక్లియర్ ఎనర్జీ పరిశోధన, వాతావరణ పరిశోధన మొదలగు రంగాలలో ఉపయోగిస్తారు. ఈ తరహా కంప్యూటర్లు 'పేరలల్ ప్రొసెసింగ్' అనే ప్రక్రియ ఆధారంగా పని చేస్తాయి. దీని వలన అనేకమైన సూచనలను కంప్యూటర్ ఏకకాలంలో విశ్లేషించి ఫలిత సమాచారాన్ని అందజేస్తుంది. తొలిసూపర్ కంప్యూటర్ 'క్రె-XMP ఈటాను అమెరికా రూపొందించింది. భారతదేశం పరమ్, పరమ్-10000, సాగా-220 అనే సూపర్ కంప్యూటర్లను నిర్మంచింది.

• డేటా;ఏదైనా సమాచారాన్ని నిర్దిష్ట స్వరూపంలో పొందటానికి, కంప్యూటర్ కు మనం అందించవలసిన ప్రాథమిక వివరాలను డేటా అంటారు.

• ఇన్ పుట్:కంప్యూటర్ కు మనం అందించే విషయం.

• అవుట్ పుట్: కంప్యూటర్ నుంచి మనం అంతిమంగా పొందే ఫలిత సమాచారం. ఇది తెరపై కనపడేది లేదా ప్రింట్ రూపంలో పొందగలిగేది కావచ్చు.

• ప్లాపీడిస్క్: కంప్యూటర్ నందుగల సమాచారాన్ని, ప్రోగ్రాములను ఇందులో నిల్వ చేయవచ్చు. దీని ఇన్ పుట్, ఔట్ పుట్ ఆపరేషన్లు రెండింటికి వినియోగించవచ్చు. మెత్తని ప్లాస్టిక్ తో తయారైన ప్లేట్ పై మాగ్నటిక్ ఆక్సైడ్ పూతపూసి ప్లాపీడిస్క్ తయారు చేస్తారు.

• డిస్క్ డ్రైవ్: కంప్యూటర్ లో ప్లాపీడిస్క్, హార్డ్ డిస్క్, కంపాక్ట్ డిస్క్ మొదలగు వాటిని ఉపాయోగించుటకు తోడ్పడే డ్రైవ్ లను డిస్క్ డ్రైవ్ లు అంటారు.

• హార్డ్ డిస్క్;డేటాను నిల్వచేయుటకు కంప్యూటర్ లోపల ఉండే భాగం. ఇది ద్వితీయ శ్రేణి మెమొరీ పరికరం. కంప్యూటర్ స్వీచాఫ్ చేసినప్పటికీ అందులో సమాచారం ఇల్వ ఉంటుంది. ఎక్కువ మొత్తం డేటాను వీటిలో నిల్వ ఉండవచ్చు.

• కాంపాక్ట్ డిస్క్ (సి.డి.): ప్రధానంగా 74 నిముషాల హై-ఫై స్టీరియో సౌండ్ వెలువరిచే డీజిటల్ ఆడియో డిస్క్ ను సి.డి.గా పిలచేవారు. 1982లో ఇది ప్రవేశపెట్టబడింది. నేడు సి.డి.లు సాఫ్ట్ వేర్ లను అందించుటకు ఉపయోగిస్తున్నారు. దీనిలోని డేటా ఎన్నిసార్లు ఉపయోగించినా చెడిపోదు.

• పి.డి.-రామ్ (CD-ROM): 'కాంపాక్ట్ డిస్క్-రీడ్ ఓన్లీ మెమురీ' అనే దానికి ఇది సంక్షిప్తరూపం. వీటిని ఏదైనా అక్షరరూపంలోను, గ్రాఫిక్స్, హై-ఫై స్టీరియో సౌండ్ తో కూడిన సమాచారాన్ని నిలవుంచటానికి ఉపయోగిస్తారు. ఇందులోని మెమొరీ మధ్యలో మార్చటం వీలుపడని శాశ్వత మెమొరీ.

• సిడి-ర్యామ్ (CD-RAM): 'కాంపాక్ట్ డిస్క్ – రెండమ్ ఎక్సెస్ మెమొరీ' అను దానికి సంక్షిప్త రూపం. ఇది తాత్కాలికమైన మెమొరీ. కంప్యూటర్ పనిచేసేటప్పుడు డేటా తాత్కాలికంగా ఇందులో నిల్వ ఉంటుంది. కంప్యూటర్ ఆఫ్ చేయగానే దీనిలోని సమాచారం పోతుంది.

• ఈరోజుల్లో చాలా కంప్యూటర్ లలో రెండు ప్రధానమైన స్టోరేజ్ రకాలను సమకూర్చడం జరుగుతూ ఉంది. ఈ రకాలు 1.రాండమ్ యాక్సెస్ మెమొరీ (RAM) 2.రీడ్ ఓన్లీ మెమొరీ (ROM). 'రాండమ్ యాక్సెస్ మెమొరీ' అనేది కంప్యూటర్ కు తాత్కాలిక మెమోరిగా ఉంటుంది. మెమొరీ లక్షణాలను సెమికండక్టర్ ఫ్లిప్-ఫ్లాఫ్ లతో తయారు చేస్తారు. RAM విషయంలో మెమొరీలో మన ప్రోగ్రాంకు సంబంధించిన సమాచారం స్టోర్ చేయవచ్చు. అయితే ఈ సమాచారం కంప్యూటర్ (స్పీచ్ ఆఫ్) ఆపివేసినపుడు తొలిగిపోతుంది. తిరిగి కంప్యూటర్ ను ప్రారంభించినప్పుడు ఖాళీగా ఉన్న RAM, తాజా దత్తాంశాన్ని స్వీకరిస్తుంది. 'రీడ్ ఓన్లీ మెమొరీ' అనేది నాన్-ఓలటైల్ విభాగం.

• ఇ-మెయిల్;ఇ-మెయిల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడనుండి ఎక్కడికయినా సందేశాలను వెంటనే పంపవచ్చును. ఇ-మెయిల్ ఇంటర్ నెట్ ద్వారా పంపవచ్చు.

• ఇ-కామర్స్: కంప్యూటర్ ల నెట్ వర్క్ ద్వారా వస్తువుల క్రయ విక్రయాలు, వస్తువుల సమాచారం అందించే మిధ్యా ప్రపంచమే ఇ-కామర్స్.

• ఇ-బిజినెస్ /ఇ-సర్వీసెస్: ఇంటర్నెట్ సౌకర్యంలేని వారికి ఇంటర్నెట్ ద్వారా సేవలు అందించటాన్నే ఇ-బిజినెస్/ఇ-సర్వీసెస్ అంటారు. ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్ సౌకర్యాలున్న మధ్యవర్తి (బ్రోకర్) ఈ విధానంలో కేంద్రంగా ఉంటాడు. ఆ మధ్యవర్తి ఇంటర్నెట్ ద్వారా లభించిన ఇ-మెయిల్, రైల్వే రిజర్వేషన్లు, పరీక్షా ఫలితాలు మొదలైన వాటిని వినియోగదార్లకి అందించి కోట కమిషన్ పొడుతారు.

• ఇ-మనీ: ఇ-మనీలో డబ్బును ఎలక్ట్రానిక్స్ పల్సెస్ గా స్మార్ట్ చిప్స్ లో నిలువ చేస్తారు. నోట్ల కట్టలను నిల్వ చేయడంలోను, తరలించడంలోను, వాటికి రక్షణ కల్పించడంలోనూ ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఇ-మనీని విముక్తి కలిగిస్తుంది. నోట్ల కట్టల నిర్వహణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇ-మనీని చట్టబద్ధం చేయడంతో ఈ వ్యయం విపరీతంగా తగ్గుతుంది.

• హైబ్రిడ్ మెయిల్ సర్వీస్: భారతీయ తపాలాశాఖ 1995లో హైబ్రిడ్ మెయిల్ సర్వీస్ ను ప్రవేశ పెట్టింది. ఇంగ్లీషులో రాయబడిన సమాచారాన్ని ఉపగ్రహంతో అనుసంధానం చేసిన కంప్యూటర్ల ద్వారా ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు అతీత్వరగా పంపించడం దీని విశిష్టత.

• ఇంటర్ నెట్: విశ్వవ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న నెట్ వర్క్ లను కలిపే ఒక పెద్ద నెట్ వర్క్-ఇంటర్ నెట్ అమెరికా మిలిటరీ అవసరాల కోసం తయారు చేయబడిన నెట్ వర్క్, నేడు ప్రపంచాన్ని దగ్గరచేసే ఇంటర్ నెట్ గా మార్పు చెందిన. విద్యా, వైజ్ఞానిక, పరిశోధనా, వ్యాపార రంగాలలో దీని ఉపయోగాలు గణనీయం. ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి ఏ ప్రాతానికైనా చిటికెలో సమాచారాన్ని పంపవచ్చు.


ముఖ్యమైన కంప్యూటర్ పదజాలం

• E-mail:ఎలక్ట్రానిక్ మెయిల్

• HTML:హైపర్ టెక్ట్స్ మార్క్ప్ లాంగ్వేజ్

• HTTP:హైపర్ టెక్ట్స్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్

• URL:యునిఫామ్ రిసోర్స్ లోకేటర్

• USB:యూనివర్సల్ సీరియల్ బస్

• FTP:ఫైల్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్

• E-C0mmerece:ఎలాక్ట్రానిక్ కామర్స్

• E-Business: ఎలక్ట్రానిక్ బిజినెస్

• E-Money;ఎలక్ట్రానిక్ మనీ

• Inter-net: ఇంటర్నేషనల్ నెట్ వర్క్

• ERNET: ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్ వర్క్

• DVD:డిజిటల్ వర్సటైల్ డిస్క్

• BPO:బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్

• ALGOL:ఆల్ గరిదమిక్ లాంగ్వేజ్

• CDN:కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్

• LAN:లోకల్ ఏరియా నెట్ వర్క్

• SWAN:స్టేట్ వైడ్ ఏరియా నెట్ వర్క్

• WLL:వైర్లెస్ లోకల్ లూప్

• XBRL:ఎక్స్ టెన్సిబుల్ బిజినెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్

• WMAN:వైర్ లెస్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్ వర్క్

• XML:ఎక్స్ టెన్సిబుల్ మార్క్ప్

• LCD:లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే

• LED:లైట్ ఎమిటింగ్ డయోడ్

• Wi-Fi:వైర్ లెస్ ఫీడలిటీ

• WiMax:వరల్డ్ వైడ్ ఇంటర్ ఆపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ యాక్సెస్

• CAS:కండిషనల్ యాక్సెస్ సిస్టమ్

• DTH: డైరెక్ట్-టు-హూమ్

• CDMA: కోడ్ డివిజన్ మల్టీబుల్ యాక్సెస్

• CAT SCAN: కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టొమోగ్రాఫి

• TIFF: ట్యాగ్ద్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్

• JPEG: జాయింట్ పోటోగ్రాఫిక్ ఎక్స్ పార్ట్స్ గ్రూప్

• PDF: పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మెట్

• IMEI: ఇంటర్ నేషనల్ మొబైల్ ఎక్యూప్ మెంట్ ఐడెంటిటీ

• SIM: సబ్ స్క్రైబర్ ఐడెంటీ మాడ్యూల్

• SMS: షార్ట్ మెసేజ్ సర్వీస్

• MRI:మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్