నోబెల్ పురస్కారాలు 2020
2020 సంవత్సరానికిగాను నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. వైద్య రంగంలో ఈ పుర స్కారానికి అమెరికన్ శాస్త్రవేత్తలు హర్వి జే.ఆల్టర్, ఛార్లెస్ ఎం. రైస్లతోపాటు బ్రిటిష్ శాస్త్రవేత్త మైకేల్ హౌటన్లు ఎంపికయ్యారు. ఇక భౌతికశాస్త్రంలో బ్రిటన్కు చెందిన రోజర్ పెన్రోజ్, జెర్మనీ శాస్త్రవేత్త రెయిన్హార్డ్ గెంజెల్, అమెరికాకు చెందిన బౌటిక శాస్త్రవేత్త ఆండ్రియా గెజ్లు ఎంపికయ్యారు. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఫ్రెంచ్ ప్రొఫెసర్ ఎమ్మాన్యుయెల్ చార్పెంటియర్, అమెరికన్ బియోకెమిస్ట్ జెన్నిఫర్ డౌడ్నాకు ఎంపికయ్యారు. అమెరికా రచయిత్రి లూయిస్ గ్లక్ ఈ ఇడాది సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. నోబెల్ శాంతి బహుమతికి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్లూయేఫ్పి) ఎంపికైంది. ఇక ఆర్టిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఆర్టిక శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్డ్ బి విల్సన్లను పరించింది.
వైద్య రంగం
2020 సంవత్సరానికిగాను వైద్యరంగం లో నోబెల్ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది. కాలేయ వ్యాధికి కారణమవుతున్న హెపటైటి స్-సీ వైరైస్ను గుర్తించినందుకు గాను అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వీ జే.ఆల్టర్, ఛార్లెస్ ఏం.రైస్లతో పాటు బ్రిటిష్ శాస్తావేత్త మైకేల్ హౌటన్కు ఈ పురస్కారం దక్కింది. అవార్డు కింద విజేతలకు బంగారు పతకం, కొటి స్వీడిష్ క్రోనార్ల (రూ .8.22 కోట్లు) నగదు బహుమతి లబిస్తుంది. విజేతలు ముగ్గురూ నగదు బహుమతిని సమానంగా పంచుకుంటారు. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్లో పనిచేస్తున్న ఆల్టర్ తొలుత దీనిపై తొలి ఆవిష్కారం చేశారు. ప్లాస్మాలో ‘హెపటైటిస్ బి’ లేని రోగుల ద్వారా కూడా ఆ అంతుచిక్కని వ్యాది కారకానికి వైరస్ లక్షణాలు ఉన్నాయని తేల్చారు. ఆ తర్వాత 1989లో మైఖేల్ హౌటన్, ఆయన సహచరులు మరో కీలక ముందడుగు వేశారు. మాలిక్యూలర్ బయాలజీ, ఇమ్యునాలజీ ఆధారిత విధానాలను ప్రయోగించి ఆ వైరైస్ను క్లోన్ చేశారు. దీని జన్యుపటాన్ని వెలుగులోకి తెచ్చారు. దీనికి ‘హెపటైటిస్ సీ ‘ అని పేరు పెట్టారు. అంతుచిక్కని హెపటైస్కు ఈ వైరిసే కారణమై ఉండొచ్చడానికి కొన్ని ఆధారా లను సేకరించారు. అయితే ఆ వైరస్ ఒక్కటే ఈ రుగ్మతను కలిగిస్తోండా అన్న ప్రశ్నకు నిర్దిష్ట సమాధానం దొరకలేదు. దీన్ని నిగ్గు తేల్చాలంటే క్లోన్ చేసిన సదరు వైరస్.. తన ప్రతి రూపాలను సృష్టించుకొని, ఆ వ్యాధిని కలిగిస్తుందా అన్నది గుర్తించాలి. అప్పట్లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న శాస్త్రవేత్త చార్లెస్ ఏం రైస్ ఈ దిశగా అంతిమ ఆవిష్కారం చేశారు. ‘హెపటైటిస్ సి’ జన్యుక్రమం అంచుల్లో ఒక ప్రాంతం.. వైరస్ పునరుత్పత్తికి కీలకం కావొచ్చని భావించారు. సేకరించిన వైరస్ సమూనాల్లో కొన్ని జన్యు మార్పులనూ గుర్తించారు. వీటిలో కొన్ని.. ఆ సూక్ష్మజీవి పునరుత్పాదకతకు అవోరోధం కావొచ్చని అంచనా వేశారు. జన్యు ఇంజినీరింగ్ ద్వారా ‘హెపటైటిన్ సి ‘ కి సంబందించిన ఆర్ఎన్ఏ రకాన్ని తయారుచేశారు. ప్రతిరూపాల తయారీకి ఆటంకంగా మారిన జన్యు వైరుధ్యాలు ఇందులో లేకుండా చూశారు. ఈ ఆర్ఎన్ఏను చింపాంజీల కాలేయంలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వాటి రక్తంతో వైరస్ ఉనికి కనిపించింది. మానవుల్లో అంతుచిక్కని హెపటైటిస్ వ్యాధి లక్షణాలతో పోలిన రుగ్మతలు ఆ జీవుల్లోనూ ప్రారంబమయ్యాయి. దీంతో హెపటైటిన్ సి కారణంగానే ఆ వ్యాధి తలెత్తుతున్నట్లు నిర్దారణ అయింది. ఈ నిశబ్ద మహమ్మారిపై ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ఏటా జూలై 28న వరల్డ్ హెపటైటిన్-సి డేగా జరుపుకుంటారు.
భౌతిక శాస్త్రం
బ్లాక్ హోల్స్ (కృష్టబిలాల) గుట్టు విప్పిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. బ్రిటన్కు చెందిన రోజర్ పెన్రోజ్, జెర్మనీ శాస్త్రవేత్త రెయిన్హార్డ్ గెంజెల్, అమెరికాకు చెందిన భౌతిక శాత్రవేత్త ఆండ్రియా గెజ్లు ఈ అవార్డుకు ఎంపికియ్యారు. కృష్టబిలం ఏర్పడటం ఐన్స్టీన్ సాపేక్ష సిద్దాంతనికి ప్రబల ఉదాహరణ అని గుర్తించినందుకు పెన్రోజ్కు అవార్డ్ లభించగా, మన పాలపుంత మధ్యలో అతి భారయుతమైన, తక్కువ ప్రాంతాన్ని ఆక్రామించిన ఖగోళ వస్తువును గుర్తించి నందుకుగాను రైన్ హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్లకు ఈ అవార్డు దక్కింది. కాగా భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన నాలుగో మహిళగా ఆండ్రియా గెజ్ గుర్తింపు పొందారు. 1903లో మేరీ క్యూరీ, 1963లో మరియా గోపేర్ట్ మేయర్, 2018లో డోనాస్ట్రీక్ ల్యాండ్లను ఈ పురస్కారం వరించింది. అవార్డు కింద దక్కే సుమారు 11 లక్షల డాలర్లలో సగం బ్రిటిష్ శాస్త్రవేత్త రోజర్ పెన్రోజ్కు దక్కనుండగా, మిగిలిన సగం మొత్తాన్ని జెర్మనీకి చెందిన రైన్హార్డ్ గెంజెల్, అమెరికన్ శాస్త్రవేత్త ఆండ్రియా గెజ్లు చెరిసగం పంచుకుంటారు. బ్రిటన్ శాస్త్రవేత్త రోజర్ పెన్రోజ్ గణిత శాస్త్రం ఆదారంగా కృష్ణ బిలాలు ఏర్పడే అవకాశాలను రూడి చేశారు. గెంజెల్, గెజ్లు ఇరువురు మన పాలపుంత మధ్యభాగంలో దుమ్ముతో కూడిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పలు నక్షత్రాలు తిరుగుతున్నప్పటికి వర్దించేందుకు వీలు కానీ సంఘటనలుఏవో చోటు చేసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. తదుపరి పరిశోధనల ద్వారా ఆ ప్రాంతం ఓ భారీ కృష్ణబిలమని మన సూర్యుడికి 40 లక్షలరెట్లు ఎక్కువ బరువు ఉందని గెంజెల్, గెజ్ల పరిశోధనలలో తేలింది.
కృష్ణబిలం
విశాల విశ్వంలో అక్కడక్కడ ఉండే అదృశ్య ప్రాంతాలు. కంటికి కనిపించవు సరికదా.. చుట్టూఉన్న ఖగోళ వస్తువులన్నింటిని తమలోకి ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఇవి ఎంతటి శక్తిమంతమైనవి అంటే విశ్వంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల కాంతిని కూడా తమలో కలిపేసుకోగలవు. సూర్యుడి లాంటి భారీ నక్షత్రాలు తమలోని ఇంధనం మొత్తాన్ని ఖర్చు పెట్టేసిన తరువాత తమలో తాము కుప్పకూలిపోతూ కృష్ణబిలాలు గా మారతాయని అంచనా. పాలపుంతలతో పాటే కృష్ణబిలాలు కూడా ఏర్పడతాయని శాస్త్రవేత్తల అంచనా. కృష్ణ బిలాల్లోకి ప్రవేశించిన పదార్థం ఏమవుకుందో ఎవరికి తెలియదు. ఐన్స్టీన్ తరువాత అంతటి వాడుగా ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంచనా ప్రకారం కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం అన్నీ వైపుల నుంచి లాగబడుతుంది. దీన్నే హాకింగ్ స్పాగెటిఫికేషన్ అని పిలిచారు. కృష్ణ బిలానికి ఆవల ఏముందో కూడా ఎవరికి తెలియదు. 1960లో జాన్ ఆర్చిబాల్డ్ వీలర్ కృష్ణ బిలాలకు ఆ పేరు పెట్టారు. ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన తొట్ట తొలి కృష్ణబిలం పేరు సైగ్నస్ ఎక్స్-1.
రసాయన శాస్త్రం
2020 సంవత్సరానికిగాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఫ్రెంచ్ ప్రొఫెసర్ ఎమ్మాన్యుయెల్ చార్పెంటియర్, అమెరికన్ బయో కెమిస్ట్ జెన్నిఫర్ దౌడ్నా ఎంపికయ్యారు. జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల ఢీఎన్ఏ లో అవసరమైన మార్పులను (జిన్ ఎడిటింగ్) అత్యంత కచ్చితత్వంలో చేయుగల ‘కృస్పర్ కాస్9’ సాంకేతికతను సంయుక్తంగా అబివృద్ది చేసినందుకుగాను వీరికి ఈ అవార్డు లభించింది.అవార్డు కింద విజేతలకు కొటి క్రోనార్ల (రూ.8.23 కోట్లు) నగదు బహుమతి లభిస్తుంది. కాగా రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారి. స్థ్రెప్థోకోకస్ పయూజీన్స్ అనే బ్యాక్టీరియంపై పరిశోధనలు చేస్తున్నప్పుడు ‘ట్రెసర్ఆర్ఎన్ఏ’ అనే అణువును చార్పెంటియర్ కనుగొన్నారు. బ్యాక్టీరియాల్లోకి ప్రవేశించే వైరస్లా డీఎన్ఏను కత్తిరించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థలో ఈ అణువు కీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం డౌడ్నాతో కలిసి 2011లో ఆమె పరిశీధనలు ప్రారంభించారు. ‘ట్రేసర్ఆర్ఎన్ఏ’ను ప్రయోగశాలలో కృత్రిమంగా వారు సృష్టించారు. మొక్కలు, జంతువులు, సూక్ష్మక్రిముల డీఎన్ఏల పై సులువుగా వినియూగించేందుకు వీలుగా దాన్ని సరళీకరించారు. వాస్తవానికి కృస్పర్ సాంకేతికతపై ఇప్పటివరకు చాలామంది శాస్త్రవేత్తలు విశేష పరిశోధనలు చేశారు. అయితే – తక్కువ ఖర్చులో, అత్యంత సులువుగా వినియోగించుకునేందుకు వీలుగా దాన్ని తీర్చిదిద్దిన ఘనత మాత్రం చార్పెంటియర్, డౌడ్నాలదే.
ప్రయోజనాలు
• ఎయిడ్స్ తదితర వ్యాదులకు కారణమైన జన్యువులను సులువుగా తొలగించేందుకు ఈ కృస్పర్ కాస్-9 ఉపయోగపడుతుంది.
• మలేరియా వంటి వ్యాధులను నిరోధించగల జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
• కరువు కాటకాలను, చీదపీడలను తట్టుకోగల సరికొత్త వంగడాల సృస్టికి కృస్పర్ కాస్-9 బాగా ఉపయోగపడుతుంది.
• ఒక రకమైన ఈస్ట్ లో జన్యుపరమైన మార్పులు చేసి అవి చక్కెరలను హైడ్రోకార్బన్లుగా మార్చేలా చేయవచ్చు. ఈ హైడ్రోకార్బన్లతో ప్లాస్టిక్ను తయారు చేయవచ్చు.
• చైనాలో పాడిపశువుల్లో కండరాలు, వెంట్రుకల ఎదుగుదలను నిరోధించే జన్యువులను కృస్పర్ టెక్నాలజీ ద్వారా తొలగించి ఎక్కువ మాంసం, బొచ్చు పెరిగే గొర్రెలను అబివృద్ది చేశారు.
సాహిత్య రంగం
2020 సంవత్సరానికిగాను సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారానికి అమెరికా రచయిత్రి లూయీస్ గ్లక్ ఎంపికైంది. ఏ మాత్రం విమర్శలకు తావివ్వని రీతిలో రాజీలేని కృషి కోనసాగిస్తున్నందుకుగాను ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం కింద గ్లూక్కు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు) నగదు బహుమతి లబిస్తుంది. కాగా సాహిత్య రంగంలో నోబెల్ పొందిన 16వ మహిళా గ్లక్. హంగేరియన్ –1943లో న్యూయార్క్లో జన్మించారు. 1968లో ‘ఫస్ట్ బోర్న్’ కవిత ద్వారా రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టారు. అనతికాలంలోనే ప్రముఖ రచయితల్లో ఒకరిగా ఎదిగారు. సమకాలీన సాహిత్యంలో తనదైన ముద్రను సొంతం చేసుకున్నారు. కుటుంబ జీవితం ఇతివృత్తంగా సంసారంలో సరిగమల పై ఎక్కువ రచనలు చేసిన ఆమె.. తగినంత హాస్యాన్నీ వాటికి రంగరిస్తూ వస్తున్నారు. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రాయాంఫ్ ఆఫ్ అచిల్స్, అరారాట్ వంటి 12 కవితా సంకలనాలను, ఆమె రచించారు. గ్లూక్ ప్రస్తుతం కనెక్టికట్లోని యేల్ యూనివ్ర్సిటిలో ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు.
శాంతి బహుమతి
2020 సంవత్సరానికిగాను నోబెల్ శాంతి బహుమతికి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్లూయఎఫ్పీ) ఎంపికైంది. ఆకలి, ఆహార అభధ్రతపై సాగించిన అవిశ్రాంత పోరుకు గాను ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ పురస్కారం లబించింది. ఈ అవార్డు డబ్లూయు ఎఫ్పికు కింద 1.1 లక్షల డాలర్ల నగదు, స్వర్ణ పతకం లభిస్తాయి. డబ్లూయుఎఫ్పీ ప్రపంచవ్యాప్తంగా సాయుధ ఘర్షణలు, పెను సంక్షోభాలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నది. సంక్లిష్టమైన ఆ ప్రాంతాల్లో ఎన్నో వ్యయ ప్రయాసల కొర్చి.. ప్రాణాలకు తెగించి.. అన్నార్తుల క్షుద్బాధను తిరుస్తున్నది. గత ఏడాది ప్రపంచ ఆహార కార్య క్రమం దాదాపు 88 దేశాల్లోని పది కోట్ల మందికి ఆసరా కల్పించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్లూయుఎఫ్పీ.. రోమ్ కేంద్రంగా పనిచేస్తోంది. దక్షిణ సూడాన్లో అన్నార్తుల కోసం వాయు మార్గంలో ఆహారాన్ని జారా విడవడం నుంచి కోరోనా మహమ్మారి కారణంగా ప్రయాణ ఆంక్షలు ఉన్నప్పటికీ అత్యవసర సేవలు, సాయం అందేలా చూడటం వరకూ.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర,ఆందోళనకర ప్రాంతాల్లో సేవలు అందించడంలో ఈ సంస్థ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
ప్రపంచ ఆహార కార్యక్రమం
2030 నాటికల్లా భూమ్మీద ఆకలిబాధలను సమూలంగా తొలగించే లక్ష్యంతో పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి సంస్థ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ లేదా ప్రపంచ ఆహార కార్యక్రమం. కరువు కాటకాలొచ్చినా.. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు, యూద్దాలు చెలరేగినా నిర్రశ్రయు లకు, బాధితులకు ఆహారం అందివ్వడం ఈ సంస్థ ప్రథమ కర్తవ్యం. దీనికి మాత్రమే పరిమితం కాకుండా.. సుస్థిర అభివృద్దికి వివిద దేశాల ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. సిరియా, యోమెన్ వంటి దేశాల్లో లక్షల మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థకు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న మరో సవాలు వాతావరణ వైపరీత్యాలు. గత ఏడాది ఇడాయి తుపాను కారణంగా ముజాం బీక్లో సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో పంట నీటమునిగిపోయింది. తిండిగింజల్లేని పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకు నేందుకు తక్షణం రంగంలోకి దిగింది ఈ సంస్థ. ఆహారంతోపాటు నిరాశ్రయూలకు మళ్లీ ఇళ్లు కట్టించడం వరకూ అనేక కార్యక్రమాలను చేపట్టింది. భూసార పరిరక్షణ, పెంపు, సాగునీటి కల్పన, విద్యా, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాల్లోనూ తనవంతు సాయం అందిస్తోంది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్.
ఆర్థిక రంగం
2020 సంవత్సరానికిగాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఆర్థిక శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ బి విల్సన్లూ ఎంపికయ్యారు. వేలం సిద్దాంతాన్ని అభివృద్ది చేయడం, కొత్త వేలం విధానాలను కనుగొన్నందుకు గానూ వీరిద్దరికి ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డ్ కింద విజేతలకు 10 మిలియన్ క్రోనార్ల (1.1 మిలియన్ డాలర్లు) నగదు బహుమతి, బంగారు పతకం లభిస్తుంది. రాబార్ట్ విల్యాన్.. సాధారణ విలువగల వస్తువుల వేలానికి సంబంధించి ఒక సిద్దాం తాన్ని అబివృద్ధి చేశారు. రేడియో తరంగాల భవిష్యత్తు ధరలు, నిర్దిష్ట ప్రాంతంలోని ఖనిజాల పరిమాణం తదితరాలు. ఇలాంటి అంశాల్లో సాధారణ విలువ కంటే తక్కువగా ఎందుకు బిడ్లు వేస్తారన్నది విల్సన్ తన సిద్ధాంతం ద్వారా తెలుసుకోగలిగారు. మరీ ఎక్కువగా చెల్లిస్తున్నామేమో అన్న బెంగ వీరికి ఉంటుందని విల్సన్ చెబుతున్నారు. మరోవైపు పాల్ మిల్గ్రూమ్ వేలంపాటలకు సంబంధించి ఓ సాధారణీకరించిన సిద్దాంతాన్ని సిద్దం చేశారు. ఎందులో సాధారణ విల్లువతోపాటు ఏతర విలువలూ ఉంటాయి. ఇవి ఒక్కో బిడ్డర్ను బట్టి మారిపోతూంతాయి. వివిధ రకాల వేలం పద్దతులను పరిశీలించిన మిల్గ్రూమ్ ఒక రకమైన పద్దతీ అమ్మోవాడికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇది కూడా బిడ్డర్లు ఇతరుల అంచనా విలువలను తెలుసుకోగలిగినప్పుడు వీలవుతుందని అంటున్నారు.