నూతన జాతీయ విద్యావిధానం – 2020
జాతీయ నూతన విద్యా విధానానికి (ఎన్ఈపీ) కేంద్ర మంత్రివర్గం 2020 జులై 29న ఆమోదముద్ర వేసింది. నూతన విద్యా విధానంలో విద్యార్థుల సమగ్ర వికాసానికే పెద్దపీట వేశారు. అదే సమయంలో భారమూ తగ్గించే ప్రయత్నం చేశారు. కొత్త విద్యా విధానంలో మూడేళ్ల వయసు నుంచే పిల్లల చదువు మొదలవుతుంది. జాతీయ విద్యా విధానాన్ని మొదట 1968లో రూపొందించారు. తర్వాత 1986లో రూపొందించారు. దానికి 1992లో పరిమితంగా సవరణలు చేశారు. 1986 విధానమే ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. దాని స్థానంలో కొత్త విధానం రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని 2016 మే 27న ఏర్పాటు చేసింది. తర్వాత కె. కస్తూరిరాంగన్ 2019 మే 31న ఏర్పాటు చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కస్తూరీరంగన్ కమిటీ నివేదికనే. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు. నూతన విధానంలో విద్యను సరళతరంగా మార్చారు. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులను చదువుకొనే వెసులు బాటు కల్పించారు. ప్రస్తుతం భారంగా మారిన పాఠ్యాంశాలను తగ్గించి, విద్యార్థులు తమలో అంతర్గతంగా దాగిన నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు అవసరమైన సమయాన్ని కీటాయించుకొనే అవకాశం ఇవ్వనున్నారు. పాఠశాల విద్య పూర్తి చేసుకొని బయటికెళ్లే నాటికి కనీసం ఒక వృత్తి విద్యా నైపుణ్యమైనా విద్యార్థి సాధించేలా మార్పులు చేయునున్నారు. ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని నిబంధన విధించారు. అయితే ఇవన్నీ ఇప్పుడప్పుడే జరిగే అవకాశాలు కనిపించడం లేదు విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉండటంతో ఎన్ఈపీకి రాష్టాలు సహకరిస్తే తప్ప ఇది ఆచరణ సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే కేంద్రం కూడా దీర్ఘకాలిక లక్ష్యాన్ని పెట్టుకుంది. 2040 వరకు దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రకటించింది. రాజీవ్ గాంధీ హయాంలో 'కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ' పేరును 'మానవ వనరుల మంత్రిత్వ శాఖ' గా మార్చారు. ఇప్పుడు మళ్లీ దీనిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా మార్చారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
లక్ష్యం
2022: జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల (ఎన్ పి ఎస్ టీ) రూపకల్పన జరగాలి.
2025: మూడు నుంచి ఆరేళ్ల వయసులో ఉన్న వారందరికీ అక్షరాలు, అంకెలు తెలిసి ఉండాలి.
2025: కనీసం 50 శాతం మంది విద్యార్థు లకు వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం ఉండాలి.
2030: వంద శాతం గ్రాస్ ఎన్రోల్ మెంట్ రేషియో సాధించాలి.
20 ఏళ్లలో పలు సంస్థలు, కమిషన్లు, కమిటీలు ఏర్పాటు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన సభ్యులతో అంశాల వారీగా కమిటీలు వేస్తారు. 20 ఏళ్లలో కనీసం 10 నుంచి 12 నూతన సంస్థలను ఏర్పాటు చేయునున్నారు. ప్రధాన మంత్రి స్థాయిలో జాతీయ విద్యా కమిషన్ను ఏర్పాటు చేయునున్నారు. దీంతోపాటు రాష్ట్ర విద్యా కమిషన్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించారు. వివిధ సబ్జెక్టులతో కూడిన మల్టీ డిసిపైనరీ ఎడ్యుకేషన్, పరిశోధన విశ్వవిద్యాలయాలు (మెరూ) ఏర్పడతాయి. జాతీయ పరిశోధనా మండలి, టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ విద్యా సాంకేతిక వేదిక (ఎన్ఈటీఎఫ్), భారతీయ భాషలను పరిరక్షించేందుకు అనువాద సంస్థలు ఏర్పాటు చేయునున్నారు. యూజీసీ, ఏఐసీటీ ఈ స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటుకు ప్రత్యేకచట్టం తీసుకురానున్నారు.
కొత్త విద్యావిధానంలో నో చైనీస్ లాంగ్వేజ్
కొత్త విద్యా విధానంలో చైనీస్ భాషకు చోటు దక్కులేదు. సెకండరీ స్కూల్లో సాధారణంగా ప్రతీ విద్యార్థికి వారికి ఆసక్తి ఉన్న వెదేశీ భాషను నేర్చుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు దేశాల్లో సంస్కృతులు, ఆయా దేశాల్లో సామాజిక స్థితిగతులపై జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఈ వెదేశీ భాషల కేటగిరీని ప్రవేశ పెట్టారు. గత ఏడాది విడుదల చేసిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) ముసాయూదా ప్రతిలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్తోపాటు గా చైనీస్ భాష ఉంది. కానీ కేంద్రం తాజాగా ఆమోదించిన తుది ప్రతిలో చైనీస్ భాష కనిపించలేదు.
పాఠశాల విద్యా విధానం
పూర్వ ప్రాథమిక విద్యను సార్వత్రీకరిస్తారు. 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు ఆటలు, కార్యకలాపాల ఆధారమైన సరళ పాఠ్యాంశాలను అమల్లోకి తెస్తారు. దీనికి సంబంధించిన పాఠ్యాంశాలను ఎన్సిఈఆర్టీ అభివృద్ధి చేస్తుంది.
• 1 నుంచి 3 తరగతులు చదివే 6 నుంచి 9 ఏళ్ల విద్యార్థులు ప్రాథమికమైన అక్షరాలు, అంకెలు సరిగా గుర్తుపట్టి చదివేలా, లెక్కలు చేసేలా తీర్చిదిద్దెందుకు ఒక నేషనల్ మిషన్ ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక దశలో విద్యార్థులు నిర్దేశిత పాఠ్యాంశాలను సరిగా నేర్చుకొనేలా తీర్చిదిద్దాడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం.
• బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇప్పుడున్న 8, 10 తరగతుల నుంచి 12వ తరగతి వరకు పెంచుతారు.
• ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గించనున్నారు. ఏటా ఒకసారి కాకుండా రెండుస్తార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్థ్లో విద్యార్థులకు రెండు సాయిలు ఉంటాయి. బట్టి పట్టే సామర్థ్యాన్ని కాకుండా వారిలోని తెలివితేటలను పరీక్షించేలా వీటిని తీర్చిదిద్దుతారు.
• స్కూల్ నుంచి మొదలెడితే ఉన్నత విద్యవరకు ప్రతి దశలోనూ సంస్కృతం ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా అందుబాటులో ఉంటుంది. మిగిలిన భాషలు కూడా తీసుకోవచ్చు. ఏ భాషనూ విద్యార్థిపై బలవంతంగారుద్దరు. సెకండరీ స్తాయిలో విదేశీవిద్యాల్ని కూడా పరిచయం చేస్తారు.
10+2+3 బదులు 5+3+3+4
ప్రస్తుతం 10+2+3 విధానం ఉంది పదో తరగతి వరకు విద్యార్థులకు దశలవారీ పాఠ్యాంశాలు ఉంటాయి. ప్లాస్టూకీ వెళ్లిన వారికి ప్రత్యేక సబ్జెక్టులు వస్తాయి. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి 5+3+3+4 ఏళ్ల పాఠ్య క్రమ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో 3 నుంచి 6 ఏళ్ల వరకు పిల్లలకు ప్లేస్కూల్ ఉంటుంది వారికి ఎనిమిదేళ్లు వచ్చేంత వరకూ ఆటలు, ఇతర కార్యకలాపాలు, అనుభవపూర్వకంగా నేర్చుకోవడం వంటివి ఉంటాయి. 3 నుంచి 8 ఏళ్ల లోపు వారు ఫౌండేషన్ స్టేజిలో, 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు ప్రిపరేటరీ స్కూలింగ్లో, 11 నుంచి 14 ఏళ్ల వారు మిడిల్ స్కూల్లో, 14 నుంచి 18 ఏళ్లవారు సెకెండరీ స్థాయిలో ఉంటారు. 6 నుంచి 8 తరగతుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఏ కూర్పులోనేనా సబెకులు తీసుకోవచ్చు. అంటే ఫిజిక్స్ తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఆహార తయారీ కొర్పులు కానీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు కానీ ఎంచుకోవచ్చు. విద్యాహక్కును 1 నుంచి 8 వ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు విస్తరింపజేస్తారు.
3, 5, 8 లోనే పరీక్షలు
3, 5, 8 తరగతుల్లోనే స్కూల్ పరీక్షలుoటాయి. అవి కూడా నిర్దేశిత బోర్డు ద్వారా నిర్వహిస్తారు. 10, 12 తరగతులకు యధావిధంగానే పరీక్షలు ఉంటాయి గాని వాటి తీరుమారుతుంది. విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా వారి జ్ఞానాన్ని, విశ్లేషణలను ఇతరత్రా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందుకోసం పరాఖ్ (విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, విశ్లేషించే సంస్థ)ను ఏర్పాటు చేసారు. ఆరో తరగతి తర్వాతి నుంచే వృత్తివిద్యలను అందరికి పరిచయం చేస్తారు. అంటే 12వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరికీ ఏదైనా ఓ వృత్తి విద్యలో ప్రవేశం ఉంటుంది.
మాతృభాషలో ఎంబిబిఎస్, ఇంజినీరింగ్
భారతీయ భాషలకు, మాతృభాషలకు కొత్త విద్యావిధానం పెద్దపీట వేస్తోంది. కేవలo ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో కూడా మాతృభాష, భారతీయ భాషలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇండియన్ ఇన్స్థిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రెటేషన్ (ఐఐటీఐ), పాళీ, పెర్షియన్, పాకృతం, సంస్కృతాలకు సంబంధించి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి అన్నీ ఉన్న్త విద్యా సంస్థల్లో వీటి విబాగాలుండేలా చూస్తారు. ఉన్న్త విద్యాలోని అనేక కోర్సులను మాతృ భాషల్లో, స్థానిక భాధల్లో నిర్వహించేందుకు ప్రోత్సహిస్తారు.
కొత్తగా 3 కోట్ల సీట్లు
2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని ఇప్పుడున్న 26.3% నుంచి 50%కి తీసుకెళ్లాలని లక్స్యంగా పెట్టుకునారు. దీని వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో కొత్తగా 3 కోట్ల సీట్లు వస్తాయి.
• అన్నీ కోర్సుల్లో హోలిస్టిక్, మల్టీ డిసిపినరీ విద్యా విధానాన్ని తీసుకొస్తారు. సబ్జెక్టులను సరళంగా మార్చానున్నారు. యూజీ కోర్సుల్లో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడున్న విధానంలో 4 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆరు సెమిస్టర్ల తర్వాత చదువుకోలేని పరిస్తితి వస్తే పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఒక ఏడాది తర్వాత విద్యార్థి మానేస్తే సర్టిఫికట్ ఇస్తారు. రెండేళ తర్వాత మానేస్తే డిప్లొమా, 3-4 ఏళ్ల తర్వాత డిగ్రీ అందిస్తారు.
• ఉద్యోగాలకు వెళ్లాలనుకున్న వారికి మూడేళ్ల డిగ్రీ, పరిశోధన రంగం వైపు వెళ్లాలనుకున్న వారికి నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాం అమలు చేయనున్నారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి ఓ ఏడాది పీజీ కోర్సు ఉంటుంది. దాని తర్వాత ఎంఫిల్ చేయాల్సిన అవసరం లేకుండానే పీహెచ్డీకి వెళ్లౌచ్చు. మాస్టర్ తో కలిపి అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ అమలు చేస్తారు. ఎంఫిల్ను తొలగిస్తారు.
ఒకే నియంత్రణ సంస్థ
• ఉన్నత విద్యా సంస్తలన్నింటికి కలిపి ఒకే ఒక్క నియంత్రణ సంస్థ ఉంటుంది. వాటిలో ప్రవేశాలకు ‘జాతీయ పరీక్షా సంస్థ’ (ఎన్టిఏ) కామన్ ఎంట్రెన్స్ను నిర్వహింస్తుంది (న్యాయ, వైద్య విద్యకు మిసహ).
• డిగ్రీని విద్యార్థులు మధ్యలోనే మానేయవచ్చు. మళ్లీ చేరవచ్చు. (మల్టీపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్) దానికి తగినట్లుగా సర్టిఫికేట్ను అందిస్తారు.
ఉన్నత విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థ ఏర్పాటు
ప్రస్తుతం విద్యావ్యవస్థ నియంత్రణ కోసం యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వంటి వ్యవస్థలున్నాయి. వీటన్నింటినీ విలీనం చేసి మొత్తం ఉన్న్త విద్యా వ్యవస్థ నియంత్రణ కు ఒకే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే నిబంధనలు అమలు చేస్తారు.
మరికొన్ని అంశాలు
• విద్యారంగ వ్యయాన్ని త్వరలో జీడీపీలో 6 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 4.4% నిధులు ఇస్తున్నాయి.
• పరిశోధనా సంస్కృతిని అభివృద్ధి పరిచేందుకు జాతీయ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తారు. శాస్త్ర, సామాజిక శాస్త్రాల విభాగాల్లో చేపట్టే భారీ పరిశోధన కార్యక్రమాలకు దీని ద్వారా ఆర్థిక చేయూత అందిస్తారు.
• అనువాదాలు, భాషాంతరీకరణకు భారతీయ సంస్థను నెలకొల్పుతారు.
• సామాజికంగా ఆర్థికంగా వేసుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. మహిళా విద్యాతో పాటు దివ్యాంగులపై దృష్టి సారిస్తారు. వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలకు ప్రత్యేక విద్యామండలాలను ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లో బాలభావాన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తారు.
• పారదర్శక విధానం ద్వారా ఉపాధ్యాయులను నియమిస్తారు. ప్రతిభ, పనితీరు అంచనా ప్రాతిపదికగా వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు.
• 2022 కల్లా ఎన్సిఈఆర్ ఉపాధ్యాయులందరికీ ‘జాతీయ వృత్తి ప్రమాణాల’ను రూపొంది స్తుంది. ఉపాధ్యాయ శిక్షణకు జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందిస్తారు. నాలుగేళ్ల బిఈడీ డిగ్రీ ఉంటేనే బోధనకు కనీస డిగ్రీ లభింస్తుంది.
• విద్యా రంగాన్ని అంతర్జాతీయాకరణ చేస్తారు. విదేశీ విద్యాసంస్థలు ఇక్కడ ప్రోంగణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విదేశీ విద్యార్థులు భారత్కు వచ్చి చదువుకొనేలా ప్రోత్సహిస్తారు.
• ఇప్పటివరకు ఇంగ్లిష, హిందీలకే పరిమితమైన ఈ – కంటెంట్ను తెలుగుతోపాటు 8 భారతీయ భాషల్లో అభివృద్ధి చేసి అమల్లోకి తెస్తారు.
• అన్నీ ఉన్నత విద్యాసంస్థల్లో వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తారు.
• విద్యా రంగంలో సాంకేతిక వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడానికి ప్రైవేటు, ప్రభుత్వ, సాంకేతిక రంగాన్ని ఒకే వేదిక మీదికి తెస్తూ ‘నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం’ ఏర్పాటు చేస్తారు.