భారత రాజ్యాంగం
భారత రాజ్యాంగంలోని ముక్యమైన వ్యవస్థలు మరియు వాటి పనితీరు
భారత దేశానికి స్వతంత్రం వచ్చినపుడు భారత ప్రజలు అందరూ తమ భవిష్యత్తు స్వతంత్రభారతావనిలో మహోజ్వలంగా ఉండగలదని ఆశించారు. భారత రాజ్యాంగ నిర్మాణసభ, ప్రజల యొక్క ఈ సుందర స్వప్నాన్ని సుసాధ్యం చేసేందుకు భారత రాజ్యాంగని మలిచారు. రాజ్యాంగ ప్రదాతలు భారతదేశాన్ని ఒక సంక్షేమ దేశంగా తీర్చి దిద్దాలని సంకల్పించారు. అలాగే వారు భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా తీర్చిదిద్దారు. భారత రాజ్యాంగం ఇంత మంచిగా కావడానికి ముఖ్య కారణం, ఇందులో దేశానికి సంబంధించిన ప్రతి ఒక సంస్థను మరియు శాఖను గురుంచి క్లుప్తంగా చర్చించడం.
ఏ ప్రజాస్వామ్య దేశంలో నైనా అతిముక్యమైనవి 3 భాగాలుంటాయి.
(1) శాసన వ్యవస్థ
(2) పాలనా వ్యవస్థ మరియు
(3) న్యాయ వ్యవస్థ.
ఈ 3 వ్యవస్థలు సమన్వయంతో పని చేసినపుడే ఏ దేశం అయిన సంక్షేమ రాజ్యంగా ఆవిర్భవిస్తుంది. ఈ ఊదేశంతోనే "భారత రాజ్యాంగ నిర్మాణసభ", సభ్యులు, పైన ఉన్న 3 వ్యవస్థల గురుంచి భారత రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ ద్వారా క్లుప్తంగా వివరించారు. ఆర్టికల్స్ అన్నీ కూడా పై 3 వ్యవస్థల యొక్క హక్కులు, విధులను గురుంచి వివరంగా తెలియజేస్తాయి. ఈ వ్యవస్థలు తమ యొక్క హక్కులు మరియు విధులను సక్రమంగా నిర్వహించింపుడే సంక్షేమ రాజ్యం ఏర్పడుతుంది.
శాసన వ్యవస్థ
మన దేశంలో శాసన వ్యవస్థ అనగా కేంద్ర స్థాయిలో పార్లమెంట్(లోక్ సభ, రాజ్య సభ), రాష్ట స్థాయిలో అసెంబ్లీ (విధాన సభ, విధాన పరిషత్), కేంద్ర స్థాయిలో అయిన రాష్ట్ర స్టయిలో అయిన శాసన వ్యవస్త యొక్క ప్రథమ కర్తవ్యం దేశానికి మరియు రాష్ట్రనికి అవసరం అయిన చట్టాలను లేక శాసనాలను చేయడం. అప్పటికే ఉన్న శాసనాలను అవాస్రామ్ అయితే మార్పు చేయడం లేదా తొలగించడం కూడా చేయాలి. అలాగే ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఈ చట్ట సభలను ఉపయోగించాలి. వారు ప్రజల సమస్యలు చట్ట సభలకు తెచ్చి వాటిని కులాంకుశంగా చర్చించాలి మరియు పరిష్కార మార్గాలను కనుగొనలి. ఈ చట్ట సభలు సమావేశాలను చాలా హుందాగా నిర్వహించాలి. అందులో గౌరవ ప్రజా ప్రతినిధుల ప్రవర్తన కూడా హుందాగా మరియు గౌరవంగా ఉండాలి. ప్రజా ప్రతినిధులు తెలుసుకోవాలిసిన ముక్యమైన విషయాలు.
(ఎ) చట్ట సభ అంటే చర్చా వేదిక మాత్రమే అని తెలుసుకోవాలి.
(బి) ప్రతి ఒక్క సభ్యుడు తమకు ఇచ్చిన సమయాన్ని గ్రహించి పరిమితులకు లోబడి మాత్రమే మాట్లాడాలి.
(సి) ఒక గౌరవనీయ సభ్యుడు ఒక సమస్యను ప్రస్తావించినపుడు దాని గురుంచి సంపూర్ణంగా అధ్యయనం చేసి నిర్దిష్టం గా మాట్లాడాలి.
(డి) ఒక సభ్యుడు మాట్లాడుతున్నపుడు మిగితా సభ్యులు అందరూ శ్రద్ధగా వినాలి.
(ఇ) ప్రతిపక్ష సభ్యుడు మాట్లాడుతున్నపుడు అధికార పక్ష సభ్యులు గౌరవంగా వినాలి, విమర్శలను సహృదయంగా స్వీకరించాలి. వారు ఏమి అయిన సూచనలు చేస్తే , వాటిని పరీక్షించాలి, సారి అయినవి అని భావిస్తే అమలు చేయటానికి ప్రయత్నించాలి.
(ఎఫ్) సభలో ప్రజా సమస్యల గురుంచి మాట్లాడాలి కానీ, వ్యక్తిగత విమర్శలు, దూషణలు, దాడులు మరియు ప్రతిదాడులు చేయరాదు.
పార్లమెంటరీ వ్యవస్థలో ఎత్తుగడలు, వ్యూహాలు అవసరమే, ఆ ధ్యాసలో ప్రజా ప్రయోజనాలు మరచి పోరాదు.
చట్ట సభల నిర్వహణ - స్పీకర్, చైర్మెన్ ల పాత్ర
భారత పార్లమెంట్ లో 2 సభలు ఉంటాయి.
(1) లోక్ సభ
(2) రాజ్య సభ
లోక్ సభలోను మరియు రాష్ట్ర శాసన సభ లోనూ సభ అధ్యక్షుని "స్పీకర్" అని అంటారు. రాజ్య సభ మరియు రాష్ట్ర విధానపరిషత్తులో సభ అధ్యక్షుని " చైర్మెన్ " అంటారు.
స్పీకర్/చైర్మెన్ - నిష్పక్షపాత వైకరి
స్పీకర్ మరియు చైర్మెన్ లు, చట్ట సభల నిర్వహణ భాద్యతలు సక్రమంగా నిర్వర్తించాలి.
స్పీకర్ గా నియమించబడిన వ్యక్తి మొదట అధికార సభ్యుడిగా ఎన్నిక అవుతాడు. తరువాత స్పీకర్ గా, చట్ట సభలలోని మెజారిటీ సభ్యుల ఆమోదం తో ఎన్నిక కాబడతాడు.
ఒకసారి స్పీకర్ గా ఎన్నిక కాబడిన తరువాత అతడు నిస్పక్షపాతంగా వ్యవహరించాలి.
స్పీకర్ ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవాలి.
స్పీకర్ ఎప్పుడు ఏ పార్టీ కి పక్షపతి గా ఉండకూడధు. చాలా గుణవంతుడు అయి ఉండి, సభలో సభ్యులు ఏ పార్టీ కి చెందిన వారు అయిన సరే, అందరినీ నిస్పక్షపాతంతో చూడాలి.
పాలనా వ్యవస్థ
కేంద్ర ప్రభుత్వంలో భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆయన మంత్రి వర్గ సహచరులు మరియు కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగులు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వ పాలన వ్యవస్థగా పిలవబడతారు. అలాగే రాష్ట్ర స్థాయిలో గవర్నర్, రాష్ట్ర ముఖ్య మంత్రి, అతని మంత్రి వర్గ సహచరులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉధ్యోగులు అందరినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వ పాలన వ్యవస్థ అంటారు.
రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని పాలన వ్యవస్థలు చట్ట సభలకు జవాబుదారీగా ఉండాలి.
పాలన వ్యవస్థల ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటే చట్ట సభలు చేసిన శాసనాలను అమలు పరచడం, " లా అండ్ ఆర్డర్ " ను పరిరక్షించడం.
భారత రాజ్యాంగం ప్రకారం పాలన వ్యవస్థ దేశాన్ని సంక్షేమ రాజ్యం గా చేయడంలో ముఖ్య పాత్ర వహించాలి. ఇలా చేయడానికి పాలన వ్యవస్థ అనేక నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం కలిగి ఉండును. ఆ నిర్ణయాలు అమలు పర్చడానికి కావలిసిన శాసనాలు చేయమని చట్ట సభలను అభ్యర్థించే భాద్యత కూడా ఉంటుంది.
పాలన్ వ్యవస్థ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమని ధృష్టిలో ఉంచికొని పని చేయలి.
భారత రాజ్యాంగం ప్రకారం పాలన వ్యవస్థ, శాసన వ్యవస్థకు జవాబు దారీగా ఉండాలి.
న్యాయ వ్యవస్థ
భారత దేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయిన ఈ దేశంలో కోట్లాదిమంది ప్రజలు ఇంకా దారిధ్యరేఖ కు దిగువన జీవిస్తున్నారు. అలాంటి ప్రజలకు న్యాయం అందించే భాధ్యత న్యాయ వ్యవస్థదే, రాజ్యాంగంలోని 3 భాగాలలో న్యాయ వ్యవస్థ పాత్ర ప్రధానమైనది.
జ్యుడీషియల్ మెజిస్ట్రట్ లు, జూనియర్, సీనియర్ సివిల్ జడ్జ్ లు, జిల్లా న్యాయాధికారులు, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు లదే ఈ భాధ్యత.
న్యాయధిపతులు అందరూ ప్రజలకు నిస్పక్షపాతం గా న్యాయని అందించు కార్యక్రమం ఒక పుణ్యకార్యం గా భావించాలి.
న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం, శాసన మరియు పాలక వ్యవస్థలకు, కాపలాదారుగా ఉండాలి.
అభిశంసన ప్రక్రియ - ఆచరణీయం కాదు
సాదారణ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లను మరియు జిల్లా న్యాయ మూర్తులను తొలిగించడానికి పొందుపరచిన నియమాలు సులభమైనవి. కానీ అదే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) మరియు ఆర్టికల్ 217(1) provision (b) లో పొందపరిచిన ' అభిశంసన నియమాలను ' అనుసరించవలసి ఉంటుంది.
సంకీర్ణల ప్రభుత్వంలో న్యాయమూర్తులను తొలగించడం అనేది సాద్యము కాదు.
న్యాయ మూర్తులను అభిశంసన ప్రక్రియ ద్వారా తొలిగించడం అనేది అసాధ్యం కనుక, ఒక వేల వారిని తొలిగించాలి అంటే భారత పార్లమెంట్, సుప్రీంకోర్టు మరియు హై కోర్టు అభిశంసనకు సంబందించిన ఆర్టికల్స్ ని రాజ్యాంగం నుండి తొలిగించాలి.
అప్పుడు న్యాయమూర్తులను కూడా సాదారణ ప్రభుత్వ ఉద్యోగులను తొలిగించే ప్రక్రియ ద్వారా తొలిగించాలి.
సత్వర న్యాయము
ప్రస్తుతం భారత దేశంలో 15 వేలకు పైగా న్యాయ స్థానాలు ఉన్నాయి. ఈ న్యాయ స్థానాలలో 3 కోట్లకు పైగా కేసులు ఉన్నాయి.
జనవరి 2005 లెక్కల ప్రకారం-------
ప్రస్తుతం మన దేశంలో 10 లక్షల జనాభాకు కేవలం 10.5 న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు.
ఈ నిష్పత్తి అభివృద్ధి చెందిన దేశాలలో చాలా ఎక్కవగా ఉంటుంది.
భారత దేశం లో కేసుల విచారణ శాతం 15 నుండి 17 వరకు మాత్రమే ఉంటుంది.
భారత దేశంలో ఒక కేసును విచారించి తీర్పు వెలువరించడానికి దిగువ న్యాయస్థానం లో కనీసం 7 లేక 8 సంవత్సరాలు పడుతుంది. తరువాత ఉన్నత న్యాయస్థానంలో 2 అప్పీలు ఉంటాయి.
ఈ 2 అప్పీలు కోర్టులో కేసును విచారించి తీర్పు వెలువరించడానికి కనీసం 15 సంవత్సరాల సమయం పడుతుంది.
అంటే ఒక కేసు అంతిమ తీర్పు వెలువడడానికి దాదాపు 20 నుండి 23 సంవత్సరాల కాలం పడుతుంది.
సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు - ఆవశ్యకత
సుప్రీం కోర్టు బెంచ్లను ఏర్పాటు చేయాలని అనేక సార్లు పార్లమెంట్ స్థాయి సంఘాలు, బార్ కౌన్సిల్ ల సమావేశాలు, న్యాయశాఖామంత్రులు, మరియు ముఖ్యమంత్రుల సదస్సులు దేశం లో వివిఢ ప్రాంతాలలో సుప్రీం కోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. కానీ సుప్రీం కోర్టు ప్రతిసారి ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తుంది.
సుప్రీం కోర్టు బెంచులు ఏర్పాటు చేయని పక్షం లో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయం పొందడం కక్షిదారులకు ఖరీదు అయిన వస్తువుగానే ఉంటుంది. బెంచులను ఏర్పాటు చేయడం ద్వారా కక్షిదారులు కొన్ని వేల కిలో మీటర్ ల ఉన్న సుప్రీం కోర్టు చుట్టూ తిరగ వలిసిన అవస్థ తప్పుతుంది, తాక్కువ వ్యయం లో సత్వర న్యాయం అందుతుంది.
సుప్రీం కోర్టు మాత్రం బెంచ్ ల ఏర్పాటు వలన న్యాయస్థానం సామర్ధ్యం పై రాజీపడినట్లు అవుతుందని, వ్యవస్థాగత, ఆర్థిక సమగ్రత దెబ్బ తింటుంది అని బెంచ్ ఏర్పాట్ల ప్రతిపాదనను ప్రతిసారి తిరస్కరిస్తువస్తుంది.
రాజ్యాంగం లోని 130 వ ఆర్టికల్ సుప్రీం కోర్టు బెంచుల ఏర్పాటును నిరోదించడం లేదు. పైగా చట్ట పరమైన ప్రక్రియ పూర్తి చేసి బెంచ్ లను ఏర్పాటు చేయవచ్చు అని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తుంది.