భారత రాజ్యాంగంలోని ముక్యంశాలు
భారత దేశంలో కొన్ని గమనించ దగిన లక్షణాలు ఉన్నాయి. ఇవి ప్రపంచం లోని మరే ఇతర రాజ్యాంగంలోనూ కనిపించవు. భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగలనుండి అరువు తెచ్చుకున్న రాజ్యాంగంగా పిలువబడినప్పటికి, ఇతర రాజ్యాంగలలోని మంచి అంశాలను సేకరించి, భారతీయ పరిస్థితుల అనుగునంగా మార్చి మన రాజ్యాంగము తయారు చేసినందుకు రాజ్యాంగ నిర్మాతలను అభినందించాలి. మన రాజ్యాంగం లోని అనేక నిభందనలు ప్రపంచంలోని వివిధ రాజ్యాంగల నుండి అరువు తెచ్చుకున్నవి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ శాసన సబా చర్చ సందర్భంలో ఇలా అభిప్రాయపడ్డారు.
“ప్రపంచ చరిత్రలో ఈ సమయంలో రూపొందించిన రాజ్యాంగంలో కొత్త అంశాలు ఏదైనా ఉందా అని అడగవచ్చు. మొదట వ్రాత రాజ్యాంగం రూపొందించి నేటికీ ఒక వంద కంటే ఎక్కువ సంవత్సరాలు గడిచాయి. ఈ సంప్రదాయాన్ని అనేక రాజ్యాలు పాటించి తమ తమ రాజ్యాంగాలను వ్రాత లోకి తెచ్చాయి. ఇ అంశాలను దృష్టి లో పెట్టుకొని చూస్తే అనేక రాజ్యాంగలలో ప్రధాన నిభంధనలు ఒకే విధం గా ఉన్నాయి. చేసిన కొత్త విషయం ఏమిటంటే మనము రూపొందించిన రాజ్యాంగంలో వివిద రాజ్యాంగలలోని లోపాలను సవరించి అవి మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చుకోగలగడం”.
1. మనది సుదీర్గ రాజ్యాంగం :-
మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే, వ్రాత రాజ్యాంగంలో పెద్దది, దీనిని ప్రవేశపెట్టేనాటికే ఇందులో 22 భాగాలుగా విభజించబడి, 395 ఆర్టికల్సు, 9 షెడ్యూళ్ళు వున్నాయి. అనేక కారణములచే 2006 సం|| ఆగష్టు 15 వ తేదీ నాటికి ఈ రాజ్యాంగంలో 444 ఆర్టికల్సు, 12 షెడ్యూళ్ళు, వున్నాయి.ఇంతవరకు, అనగా 2006 సం|| ఆగష్టు 15వ తేదీకి సుమారు 94 సార్లు భారత రాజ్యాంగము సవరించబడింది.
[i] రాజ్యాంగ రూపకర్తలు ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలను కూలంకుషంగా ఆధ్యయనము చేసిన తరువాత రూపొందించారు. ఇందులో తప్పులు, లోపాలు,పొరపాట్లు రాకుండా ఉండుట కోసం, ఇతర రాజ్యాంగంలోని అత్యుత్తమ నిబంధనలను ఇందులో చేర్చారు. ఆ ప్రకారం అమెరికన్ రాజ్యాంగము మాదిరిగా ప్రాధమిక హక్కుల ఆద్యాయం, ఇర్లాండు రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, జర్మన్ రిపబ్లికు మరియు ఇండియా ప్రభుత్వ చట్టము 1935 ననుసరించి, ఎమర్జెన్సీ నిభంధనలు, బ్రిటిష్ శాసనములను అనుసరించి పార్లమెంటరీ నామునా ప్రభుత్వము [PAELIAMENTARY FORM OF GOVERNMENT] ఇందులో చేర్చడం జరిగింది. బ్రిటన్ కు ప్రత్యేకించి “ వ్రాతపూర్వక రాజ్యాంగము” లేదు.
[ii] అమెరికన్ రాజ్యాంగము చాలా చిన్నది. ప్రపంచంలో అత్యుత్తమమైనది. ఇందులో పరిపాలనకు సంబధించిన ప్రాధమిక సూత్రాలు మాత్రమే ఉన్నాయి. కాగా మన రాజ్యాంగంలో, ప్రభుత్వ నిర్మాణము, కేంద్ర రాష్టా ప్రభుత్వాల వివరాలు వివరంగా వున్నాయి. [Structure And details of both Central and State Governments ]
[iii] భారతదేశం సువిశాలమై, భినత్వము తో కుడి ఉండడం వల్ల మన దేశంలో వివిద భాషలు, షెడ్యూల్లు కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు వంటి అనేక సమస్యలు వున్నాయి. కనుక ఈ సమస్యలను తీర్చడానికి ప్రత్యేక నిభందనలు అవనరమయ్యాయి.
[Iv] రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులు, రాజ్య విదాన ఆదేశిక సూత్రాలు విస్తృస్తంగా చర్చించబడ్డాయి. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు, శాసనిక హక్కులు ఇతర రాజ్యాంగలలో పొందపర్చబడిన హక్కుల కంటే చాలా విస్పష్టమైంది. ఆదేశిక సూత్రాలు శాసన రీత్యా అమలుపర్చదగినవి కానప్పటికి, భావి ప్రభుత్వాలు వాటి గొప్పదనాన్ని గుర్తించి అమలు పరిచేలా చేయడానికి వీలుగా రాజ్యాంగంలోని 4వ భాగంలో చేర్చబడి ఉన్నాయి.
[v] భారత రాజ్యాంగములో, శాసన నిర్మాణ, పరిపాలన, ఆర్దిక సంబంధాలు కేంద్ర, రాష్టాల మద్య ఎలా ఉండాలో, ఆ నిభంధనలను విస్తృతంగా వివరించబడినవి.
[vi] రాజ్యాంగం, న్యాయ పాలన, ప్రభుత్వ సర్వీసులు, పబ్లిక్ సర్వీసు కమిషన్లు, ఎన్నికల కమిషను, ఎన్నికలు మొదలగు వాటిని సవివరంగా చర్చించినది.
2. పార్లమెంటరీ నమూనా ప్రభుత్వము [Parliamentary form of Government ]:-
భారతదేశము, రాష్టపతి ఆధిపతిగా వుండే పార్లమెంటరీ నమూనా ప్రభుత్వమును ఎంపిక చేసుకొన్నది. దీనికి, “భారతదేశపు రాష్టపతి” నామమాత్రపు ఆధిపతిగా ఉంటారు. ఈ విషయములో, రాజ్యాంగ నిర్మాతలు బ్రిటిష్ పద్దతిని అవలంబించారు.ఇటువంటి ప్రబుత్వంలో ప్రదాన మంత్రి, మంత్రి మండలి ఆధిపతిగా ఉంటాడు. ఆయన, మరియు ఆయన మంత్రి మండలి, ఉమ్మడిగా కేంద్ర సభకు అనగా లోకసభకు భాద్యత వహించును. 18సంవస్సారలు నిండిన భారత పౌరులు లోక్ సభకు తమ ప్రతినిదులను 5 సంవస్సారములు ల కొకసారి ఎన్నుకొంటారు.
అదేవిధంగా రాష్టానికి గవర్నరు అధిపతిగా వుంటారు. ముఖ్యమంత్రి అధ్యక్షతగా మంత్రి మండలి రాష్టా శాసన సభకు భాద్యతగా వహిస్తాడు రాష్టా పౌరులు తమ ప్రతినిదులకు 5 సంవస్సారములకు ఒకసారి ఎన్నుకొంటారు. భారత రాష్టపతి మరియు రాష్టాల గవర్నర్లు మంత్రి మండలి సలహా పై తమ అదికారాలను వినియోగిస్తాడు.
3. రాజ్యాంగ అవతారిక:-
భారత రాజ్యాంగంలోని అవతారిక భారతదేశము, సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాసామ్య గణతంత్రరాజ్యంగా ఉండాలని నిభందిస్తుంది. భారత ప్రభుత్వము భారత పిఆర్‌ఏజేిఏఎల్‌ఏ చేత ఎంపిక చేయబడి ప్రజల పేరుపై పాలింపబడుతున్నది. ఇందులోని ‘సార్వభౌమ్య’ ఏఎన్‌యూ పదము ద్వారా భారతదేశము ఇంకెంత మాత్రము విదేశాలకు సామంత రాజ్యము కాదాని అది ‘సర్వసత్తాక రాజ్యమ’ని సూచిస్తుంది. “అవతారిక” నే”ప్రస్తావన” అని కూడా అందురు.
4. రాజ్యాంగం దృడత్వంతో మరియు సరళతతో కూడిన విలక్షణమైన కలయిక :-
భారత రాజ్యాంగము దృడత్వము మరియు సరళత్వంతో కూడిన విలక్షణ కలయిక గల రాజ్యాంగముగా చెప్పుతుంటారు. ఈ లక్షణం రాజ్యాంగమునకు చేసే సవరణ ప్రక్రియకు సంభందించింది. ‘సర్ ఇవన్ జెర్న్నింగ్స్’ అను ప్రక్యత రాజకీయ నిపునుడు మన రాజ్యాంగమును దృడత్వంతో కూడిన రాజ్యముగా అభివర్ణించారు. ఏందుకంటే మన రాజ్యాంగముకు సవరణ చేసే ప్రక్రియ సంక్లిక్షతతోను, ఇబ్బంది తోను కుడి ఉంది. రాజ్యాంగము దృడత్వంతో కూడింది అంటే తన ఏవేనీ నిభంధనలను సవరించడానికి, ప్రత్యేక కార్యవిదానమును కోరుతోంది. అయితే సరళత్వముతో కుడిఉన్న రాజ్యాంగము అంటే ఒక సవరణ చేయడానికి శాసన సభలో సాధారణ మెజారిటీ కోరుతుంది. అయితే, భారత రాజ్యాంగము దృడత్వము, మరియు సరళిత లక్షణాలతో కూడిన నిభందనలతో విలక్షణమైన కలయిక చెప్పవచ్చును. ఏందుకంటే రాజ్యాంగములో ని కొన్ని నిభందానాలను సవరించడానికి మాత్రమే సగము రాష్టా శాసనసబల సమ్మతి కోరగా, మిగితా నిభంధనలను సవరించడానికి పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ చాలు. ప్రతి సభలో హాజరయీ ఓటు వేయు సబ్యులతో మూడింట రెండు వంతులకు తక్కువ కానీ మెజారిటీ సబ్యులు సవరణ తీర్మానము ఆమోదించాలి. కాగా కొన్ని నిభందాలను సవరించాలంటే సాధారణ చట్టాన్ని ఆమోదించడానికి ఎంత మెజారిటీ కావాలో అంత మెజారిటీలు చాలు. అయితే ఈ మార్పులను రాజ్యాంగ సవరణలుగా భావించరాదు.ఈ కారణము విఏఎల్‌ఏఎన్‌ఏ భారత రాజ్యాంగము దృడత్వము మరియు సరళ లక్షణాలతో కూడిన విలక్షణ కలయికగా పరిగణించవచ్చు.
5. రాజ్యాంగం 3వ భాగంలో ప్రాధమిక హక్కులను గురించి వివరించుట :-
రాజ్యాంగం యొక్క 3వ భాగము ద్వారా ప్రాధమిక హక్కులకు గ్యారెంటీ ఇవ్వబడింది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలక్షణ లక్షణం. ప్రాధమిక హక్కులన్నిటిలో భారత ప్రజల వినియోగించుకొనవచ్చు. అన్ని ప్రాధమిక హక్కులు భారత పౌరులకు లబ్యము. అయితే పౌరులు కానివారికి కొన్ని ప్రాధమిక హక్కులు మాత్రమే లభిస్థాయి.ఈ ప్రాధమిక హక్కులు న్యాయస్తానంలో అమలు పరచదగునవై ఉంటాయి. ఒక ప్రాధమిక హక్కులు ఏదేని శాసనములు,ఆర్టికల్స్ ,వాడుక ,ఆచారము లేదా పరిపాలక ఉత్తరవు ద్వారా కుదించడానికి గాని, సవరించడానికి గాని, తిసి వేయడానికిగాని వీలు కాదు.
ఈ.ప్రాధమిక హక్కులు ప్రజల సంక్షేమ కోసం అవసరమైనవి:-
ప్రత్యుపాయము లేకుండా హక్కు నిష్పలము. కాబట్టి ప్రాధమిక హక్కుల ఉల్లంగన ను నివారించడానికి పలు ప్రత్యుత్యయమును రాజ్యాంగంలో పొందుపర్చడం జరిగింది. ప్రభుత్వము ప్రథమిక హక్కులను ఉల్లంగించినప్పుడు పౌరుడు 226 వ ఆర్టికల్ క్రింద హైకోర్ట్ ను, 32 వ ఆర్టికల్ క్రింద సుప్రీమ్ కోర్ట్ ను అశ్రాయించి పరిహారము కోరావచ్చును. రాజ్యాంగము ఈ రెండు కోర్ట్ లకు [High Court /Supreme Court ].
[1] హైబియన్ కార్పస్ [బందీ ప్రత్యేక్షీకరణ అధిలేఖ],చెరసాలలో ఉంచిన ఆదికరికి, లేదా ఆక్రముముగా భందించి ఉంచిన వ్యక్తి కి తన స్వాదినంలో ఉన్న ఖైదిని తెచ్చిచూపి, అతనిని నిర్భందించిన కారణంగా వెక్టాపరచవలసిందిగా కోరుతూ హై కోర్ట్ /సుప్రీమ్ కోర్ట్ జారీచేసిన ఆజ్ఞా పత్రాలు.
[2]మాండమస్ –ప్రదాన న్యాయాస్థానం, తన క్రింద న్యాయస్థానానికి జారీ చేసే ఆజ్ఞా పత్రం.
[3] ప్రొహిబిషన్[ప్రతి నిషేధ అధిలేఖ] – అనగా ఒక దావా విచారణ జరిపే అధికారం దానికి లేదని క్రింది కోర్ట్ ను ఉన్నత న్యాయాస్తనం నిషేదిస్తూ చేసిన ఉత్తరువు.
[4] సెర్షియోరారి, [ఉత్ప్రేరణ అధిలేఖ] –క్రింది కోర్ట్ లోని వ్యాజ్యములు హై కోర్ట్ /సుప్రీంకోర్ట్ కు పంపమని చేసిన ఉత్తరువు.
[5] కోవారంట్[Quo- WARRANTO ] [అదికారా పృచు ]-ఒక వ్యక్తిని అతని అధికారానికి ఆధార పత్రాన్ని చూపించమని అడుగుతూ హైకోర్ట్/సుప్రీమ్ కోర్ట్ వారు పంపే తాబిదు.
అనే ఈ ఐదు రకాల రిట్లను జారీ చేసే అధికారాన్ని రాజ్యాంగం హైకోర్ట్/సుప్రీం కోర్ట్ లకు సంక్రమింపచేసేది. అంత మాత్రాన ప్రాధమిక హక్కులు సంపూర్ణమైనవికావు. అవి కొన్ని యుక్తమైన నిర్భందాలను లో బడి ఉంటాయి. వ్యక్తిగత హక్కులకు సమానత్వమును తీసుకురావడానికి ఈ పరిమితులు ఉపయోగపడును.