SRUGK

రాజ్య విధానపు ఆదేశిక సూత్రాలు:-

భారత రాజ్యాంగములోని భాగము IV రాజ్య విధానపు ఆదేశిక సూత్రాలను గురించి వివరిస్తుంది. దేశ పరిపాలనలో ప్రభుత్వాలు సాదించవలసిన లక్ష్యాలు. ఉద్దేశాల గురించి ఈ సూత్రాలు వివరిస్తున్నాయి. భావి ప్రభుత్వాలకు మార్గదర్శకత్వము నిమిత్తం మార్గదర్శక సూత్రాలు మరియు సూచనల రూపములో ఇవి జారీచేయబడినవి. మార్గదర్శక సూత్రాలు న్యాయస్థానల ద్వారా అమలుపరచదగివి అయి వుండవు. ఒక పౌరుడు ప్రాథమిక హక్కులు అమలు నిమిత్తం హైకోర్ట్ కు గాని సుప్రీం కోర్ట్ కు గాని వెళ్లవచ్చు. అయితే ఈ ఆదేశాకసూత్రాలు అనేవి ప్రభుత్వ లక్ష్యాలు, అంశాల ప్రకటనకన్న కొంచము ప్రాధాన్యతను సంతరించుకున్నవి. ప్రభుత్వము ఆదేశాక సూత్రాల అమలులో వైఫల్యము ను గురించి ఎన్నిక సమయాల్లో ప్రజలకు సమాధానము చెప్పవలసి ఉంటుంది. వీటిని అమలుపర్చినప్పుడు మన రాజ్యాంగము కోరిన సంక్షేమ రాజ్యాన్ని అమలుపర్చడానికి వీలుంటుంది.

1971 వరకు సుప్రీం కోర్ట్, ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకన్నా ముక్యమైనవి భావించేది . అయితే 1971 లో 25 వ రాజ్యాంగ సవరణ మరియు 1976 లో 42వ రాజ్యాంగ సవరణ అనంతరము ఆదేశక సూత్రాలు ప్రాధమిక హక్కుల కే‌ఏ‌ఎన్‌టి‌ఈ ముక్యమైనవిగా భావించింది. అయితే ప్రస్తుతము సుప్రీం కోర్ట్ ధోరణి ప్రకారం ఈ రెండునూ,సమానమైనవి. ఒకదానిని మరొక్క దానితో సమన్వయించుకోవాలని. వాటి మద్య సుహృద్బవ సంభందాలు ఉండాలి.


ప్రాధమిక విధులు :-

రాజ్యాంగములోని 51-ఏ ఆర్టికల్ ప్రాథమిక విధులను గురించి వివరిస్తున్నది. ఇది 1976 లోనోకి చొప్పించబడినది. అప్పటి సోవియట్ యూనియన్ [U. S. S. R.] రాజ్యాంగము ఆదర్శంగా తీసుకొని ప్రాధమిక విధులను రాజ్యాంగంలో చొప్పించడం జరిగింది. 51-A ఆర్టికల్ పౌరుల విధులను గురించి తెలియజేస్తుంది.ఈ ఆర్టికల్ లో 10 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఇవి ప్రాధమిక హక్కుల చుట్టూ ప్రతిబంబిస్తూనేయి. వీటిని న్యాయస్థానల ద్వారా అమలుపరచడానికి వీలుకాదు.


ఏకత్వంతో కూడిన సమాఖ్య వ్యవస్థ :-

భారత రాజ్యాంగపు స్వభావమును గురుంచి వివాదముంది. కొంతమంది దీనిని ‘’ఫ్హెడరల్ సమఖ్యా తరహా రాజ్యాంగము’ అని మరికొందరు దానిని ‘క్వాసీ ఫెడరల్ రాజ్యాంగమని’ అంటుంటారు. చాలకొద్దిమంది మాత్రం, మన రాజ్యాంగమును ‘యూనిటరీ[ఏకత్వ] తరహా రాజ్యాంగముగా’ గా పిలుస్తుంటారు. ఫెడరల్[సమక్య] విదానంలో అన్నీ రంగాల లోను అదికారాలు, కేంద్ర ప్రభుత్వము, రాష్ఠ ప్రబుత్వాల విభజించబడి ఉంటాయి.

క్వాసీ ఫెడరల్ తరహా విదానంలో ఫెడరల్ లక్షణాల కంటే యూనిటరీ తరహా లక్షణలే అధికంగా ఉంటాయి. యునిటరీ తరహా విదానంలో, రాజ్యాధికారామంత కేంద్రం చేతిలో నే ఉంటుంది. కేంద్రం శక్తివంతం మైనది కాగా రాష్టాలు, ఒక రకమైన పెద్దవైన మునిసిపాలిటీలు లాగా, కేంద్ర ప్రభుత్వం పై ఆధారపడిఉంటాయి.

అయితే భారత రాజ్యాంగ ఘనత, ఏక ప్రభుత్వ పాలనపై పటిష్ట పరచబడిన సమాఖ్య విధానం పై ఉన్నది. ఏమర్జెన్సీ ఉన్నపుడు, సమాఖ్య ప్రభుత్వం, తమ అధికారాలను తన అంతకు తానే కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. అప్పుడు ఫెడరల్ ప్రభుత్వము, యూనిటరీ ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే కేంద్ర, రాష్టాల మద్య విభజించబడిన అధికారాలల్లో తీవ్రమైన మార్పులు కలుగుతాయి. అప్పుడు శాసన నిర్మాణ, పరిపాలన,ఆర్దిక విషయాలలో కేంద్ర బలవత్తరమవుతుంది.


వయోజన ఓటు హక్కు :-

భారత రాజ్యాంగము ఏలాంటి పరిమితులు అంటే లింగ లేదా పన్నులు వంటి ఇతర నిర్భంధాల ను విధించకుండా 18 సంవత్సరాలు వచ్చిన వయోజనులందరికి ఓటు హక్కు కల్పించింది. భారత దేశ వైశాల్యము మరియు అమితమైన నిరక్షరాస్యత అనే అంశాలను పరిగణిస్తూ, తక్కువ.

వయోజనందరికి ఓటు హక్కును ప్రసాదించింది. భారతదేశం లోని 18 సంవస్సారలు దాటిన స్త్రీ, పురుష ఓటర్లు, శాసన సభకు తమ ప్రతినిధులను ఎన్నుకోవచ్చును.ఇది వరకు ఓటువేసే హక్కు మనదేశంలో మతపరమైన నియోజక వర్గాలు ఉండేవి. ఇవి దేశ విభజనకు కారణమయ్యాయి. 2004 లోని 13వ సర్వస్తిక ఎన్నికలలో సుమారు 550 మిలియన్ ల ప్రజలు పాల్గొన్నారు. అయినప్పటికి, ఎన్నికలు ప్రశాంతం గా నిర్వహించబడినవి. ఇదే ధోరణి ఇతర ఎన్నికళ్లలో కూడా కనిపించింది.


స్వతంత్ర మైన నిష్పాశీకతతో కూడిన న్యాయవేవాస్థ :-

న్యాయవ్యవస్థ స్వతంత్రమైనదిగాను, నిష్పాక్షికమైనది గాను ఉండేందుకు వీలుగా భారత రాజ్యాంగంలో అనేక నిభందానలు చేయబడ్డాయి. భారత దేశంలో హై కోర్ట్ లు , సుప్రీం కోర్ట్ తో కూడిన స్వతంత్రమైన నిష్పక్షికమైన న్యాయవ్యవస్థ ఉంది. న్యాయమూర్తుల నియమకంలో, కార్యనిర్వాహకులు సంపూర్ణ అధికారాలు ఈయలేదు.భారత రాష్టాపతి, సుప్రీం కోర్ట్, సంభందిత హై కోర్ట్ ల ప్రధాన న్యాయమూర్తులను ఇతర న్యాయమూర్తులను సంప్రదించిన తరువాత మాత్రమే సుప్రీం కోర్ట్ లేదా హై కోర్ట్ న్యాయమూర్తులను నియమించాల్సి ఉంటుంది.

హై కోర్ట్ లేదా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి, అతని దుష్ప్రవర్తన లేదా అశక్తత నిరూపించబడినప్పుడు మాత్రమే తొలిగించబడును. ఆ విధంగా ప్రతి న్యాయ మూర్తి పదవి కాలవధిగా రాజ్యాంగం హామీ ఇస్తుంది. రాజ్యాంగం న్యాయమూర్తి పదవి కూడా వివరిస్తుంది. ప్రత్యేక పరిస్తితులు ఉన్నపుడు తప్ప వారి వేతనాలు మార్చడానికి వీలు కాదు. సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి తన పదవి విరమణ అనంతరము ఏదేని కోర్ట్ లేదా న్యాయిక ప్రాధికారి ముందు వాదించడం లేదా హాజరు కావడం పై నిషేధం ఉంది. సుప్రీం కోర్ట్ మరియు హై కోర్ట్ ఏదేని శాసనములోని లేదా కార్య నిర్వాహక చర్యలలోని లోపాలను పరిశీలించే ఆదికరము కలిగిఉన్నాయి. న్యాయిక సమీక్ష జరిపే అధికారము ఈ రెండు కోర్ట్ లకు ఈయబడింది. మన రాజ్యాంగము లోని నిబంధనలు అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు స్వతంత్ర మైన మరియు నిస్పక్షికమైన న్యాయ వ్యవస్థ మనకు వునట్లు విదిత మౌతుంది.


న్యాయస్తానము యొక్క న్యాయ సమీక్షాధికారం :-

అమెరికా లో న్యాయసమీక్షలు జరిపే అధికారాన్ని సుప్రీం కోర్ట్ కలిగిఉంది. అమెరికా రాజ్యాంగము ఈ అదికారాన్ని గురించి వివరించలేదు. అయితే chief justice of U.S.A. Marshall,marbury vs. Madison కేసును నిర్ణయించేటపుడు న్యాయిక సమీక్షాధికారం గురించి ప్రత్యేకంగా తెలియజేస్తారు. అందుచేత అమెరికా సుప్రీం కోర్ట్ న్యాయిక సమీక్ష అనే ఈ అధికారాన్ని ఆవిష్కరించిందని చెప్పవచ్చు. కానీ మన ఇండియాలో రాజ్యాంగము లోని 13వ ఆర్టికల్ న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికారాలను స్పష్టంగా వివరిస్తుంది. సుప్రీం కోర్ట్ గోలఖ్నాధ్ vs. స్టేట్ ఆఫ్ పంజాబ్ AIR 1967 sc 1643 కాసు లో రాజ్యాంగంలోని 13[2] ఆర్టికల్ క్రింద న్యాయస్తానలకు న్యాయసమీక్షాధికారాలు ఉంటాయియాని తీర్పు చెప్పింది. న్యాయిక సమీక్ష అధికార మనగా శాసనాలను, కార్యనిర్వాహక చర్యలను పరిశీలన జరపడానికి అవి రాజ్యాంగానికి ఎంతవరకు అనుకునంగా ఉన్నాయో నిర్ణయించి, అట్టి శాసనాలు కార్య నిర్వాహక చర్యలు రాజ్యాంగ నిభందానలకు లేవని కనుగొనబడితే శాసనమన్యత లేనివిగా ప్రకటించడానికి న్యాయస్తానలకు ఉన్న అధికారాలు అని అర్ధము. ఇలా న్యాయసమీక్షలు జరిపే అధికారము భారత దేశంలో హై కోర్ట్ కు మరియు భారత సుప్రీం కోర్ట్ కు మాత్రమే ఉంది.


లౌకిక రాజ్యాంగము :-

లౌకికత్వం అంటే రాజ్యము లేదా ప్రభుత్వము అన్నీ మతాలను సమానంగా ఆదరించడం. భారత రాజ్యాంగం అవతారిక మరియు 25 నుండి 28 వరకు ఆర్టికల్స్ భారత దేశం లో లౌకికత్వాన్ని సమకూరేటట్లు చూడడానికి మత హక్కు ని గురించి వివరిస్తుంది. లౌకికత్వం [Secular] రాజ్యాంగపు ఒకానొక ప్రదమిక లక్ష్యం గా సుప్రీం కోర్ట్ ప్రకటించింది. మనదేశ జనాభాలో 75 కంటే ఎక్కువ హిందువులే అయినప్పటికి ఇండియా అన్నీ మతాలను సమానంగా ఆదరిస్తుంది. హిందువులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక పౌరుడు తమ మత ప్రాతిపదికపై విచక్షణకు గురి కావడానికి రాజ్యాంగం అనుమతించదు. ఈ అంశం దృశ్య భారత దేశం భిన్నత్వం లో ఏకత్వానికి ఉదాహరణగా భావించవచ్చు.


ఒకే పౌరసత్వం :-

అమెరికాలో రెండో రకాల పౌరసత్వాలు ఉంటాయి. ప్రతి అమెరికా పౌరుడు అమెరికా పౌరుడుగాను, తన స్వరాష్ట పౌరుడుగను ఉంటాడు. అమెరికాది ఫెడరల్ రాజ్యాంగం. అమెరికాతో ఉన్న 50 రాష్టాలు తమ సొంత రాజ్యాంగమును కలిగిఉన్నయి. భారతదేశంలో అంతా ఒకే రాజ్యాంగము మరియు,భారతీయులకు అందరికీ ఒకే పౌరసత్వము ఉన్నాయి. అంతే కానీ రాష్టా పౌరసత్వము లేదు. ప్రజలు ఎక్కడ జీవిస్తునప్పటికి వారు ఉంటున్న రాష్టముతో నిమిత్తము లేకుండా పౌరులందరికి కొన్ని హక్కులు లబిస్తాయి.


స్వతంత్ర వ్యవస్థలు[ఏజెన్సీలు] :-

భారత రాజ్యాంగం, కంప్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎన్నికల కమిషన్లు, పబ్లిక్ దర్వీస్,మొదలగు స్వతంత్ర ఏజన్సీలకు స్థాపించడానికి నిభందిస్తున్నది. కేంద్ర మరియు రాష్టా ఆర్థిక స్థితి గతులను నిరంతర నిఘా పెట్టడం, కంప్రోలర్ మరియు అడిటరు భాద్యత. ఓటర్ల జాబితాను తయారు చేయడం, పార్లమెంటు, రాష్టా శాసన మండలాలు, రాష్టపతి పదవులకు ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల కమిషన్ భాద్యత. కేంద్ర,రాష్టా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను, నెలకొల్పడానికి రాజ్యాంగం నిబందిస్తున్నది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సర్వీసుల, నిమిత్తం వ్యక్తుల నియామకం కొరకు పరీక్షలను నిర్వహించడం, సర్వీసు కమిషన్ల భాద్యత.


శాసన శిరోధార్యత :-

శాసనం ముందు అందరూ సమనులే అని, చట్ట సంరక్షణ అందరికీ లభిస్తున్నది అని , రాజ్యాంగం హామీ ఇస్తుంది. కులం, వర్ణ, జాతి, మాట, లైంగిక, జన్మస్థలం మొదలగు ప్రతిపదికల పై విచక్షణ చూపడానికి రాజ్యాంగం అనుమతించధు. ఏదేని శాసనం లేదా కార్యపాలక చర్యలో ఏదేని అనౌచిత్యం, అన్యాయం, అసమంజనత్వం చోటు చేసుకోవడానికి అనుమతించదు. దీనినే శాసన పాలన అంటారు.ఇక్కడ పరిపాలన, సముచితమైన, యుక్తమైన, హేతుబద్దమైన చట్టాలను అనుసరించి జరుగవలనే గానీ, పాలకుల ఇష్టానిష్టాలను బట్టి జరగదు, ఇవన్నీ రాజ్యాంగ ప్రధాన లక్షణాలు.