భారత రాజ్యాంగ పరిణామం
రాజ్యాంగ శాసన అంశాన్ని సక్రమంగా అర్ధం చేసుకోవడానికి, ప్రస్తుత రాజ్యాంగమును అనుసరించుటకు దారితీసిన చారిత్రక కారణాలను గురించి తెల్సుకోవాల్సిన అవసరంముంది.
చారిత్రక కారణాలు :-
బ్రిటిష్ వారు భారతదేశానికి ఈష్ట్ ఇండియా కంపెనీ రూపంలో వచ్చారు. అప్పటి నుంచి 1858 వరకు అనేక చార్టర్లను బ్రిటిష్ ప్రభుత్వము వెలువరించింది.ఇవి ఈష్ట్ ఇండియా కంపెనీ నిర్మాణము,అధికారము మరియు విశేష హక్కు [powers and previleges ] లను గురించి తెలియజేస్తున్నవి. ఆ సమయంలో వెలువరించిన కొన్ని ముక్యమైన చార్టర్లు, చట్టాలు ఈ క్రింది పేర్కొన్నబడ్డయి.
1.చార్టరు చట్టము,1601
2.చార్టరు చట్టము,1726
3.రెగ్యులేటింగ్ చట్టము,1773
4.సెటిల్ మెంట్ చట్టం,1781
5.పిట్స్ [the pitts ] ఇండియా చట్టము,1784
6.చార్టర్ చట్టం, 1813
7.చార్టర్ చట్టము,1833
8.చార్టర్ చట్టము, 1853
పైన చట్టాలను బ్రిటిష్ ప్రభుత్వము,ఈష్ట్ ఇండియా కంపెనీ క్రింద పరిపాలన సజావుగా సాగడానికి ఆమోదించినప్పటికి భారత రాజ్యాంగ పరిణామాలను ఆద్యాయనము చేయడంలో 1858 సం|| వెనుకకుపోనక్కరలేదు.
ఇండియా ప్రభుత్వ చట్టము, 1858;- మొదటి స్వాతంత్ర యుద్దంము 1857-58 సం||లో జరిగింది. అటు తర్వాత ఈష్ట్ ఇండియా కొంపెనీ ప్రభుత్వ పరిపాలనను బ్రిటిష్ సామ్రాట్టు స్వయంగా చేపట్టారు.బ్రిటిష్ పార్లమెంటు, బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పరిపాలన క్రింద భారతదేశ ప్రభుత్వమును ఏర్పరచటకు మొదటి శాసనాన్ని తీసుకోవచ్చింది.అదే ఇండియా ప్రభుత్వ చట్టము 1858. ఈ చట్టము భారతదేశ పరిపాలనలో సంపూర్ణమైన సామ్రాట్ నియత్రణ సూత్రము ను నిభందిస్తున్నది. స్టానిక ప్రజలను దేశ పరిపాలలో ఏవిధం గా పాల్గొనడానికి అనుమతించలేదు.ఈ శాసనం భారత రాజ్యాంగ పరిణామంలో మైలురాయిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రస్తుత రాజ్యాంగ రూపకల్పన వరకు గల తదుపరి చరిత్ర క్రమేపీ సామ్రాట్ నియంత్రణ సడలింపు, [Relaxation of imperial control] భాద్యతయుట ప్రభుత్వ ఎదుగు దలకు దోహదపడింది. ఈ చట్టము Board of Court, of Directors వ్యవస్తాను రద్దు చేసింది. ఈ చట్టం ప్రకారం భారత దేశ పరిపాలనకై సామ్రాట్ అదికారాలు [the powers of the Crown] ఇండియా స్టేట్ సెక్రెటరీ[Secretary of State, Govt. , of India ] మరియు 15 మందితో కూడిన అతని కౌన్సిలు ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కౌన్సిలు స్టేట్ సెక్రెటరీకి పరిపాలనలో సలహా సంఘం గా ఉపకరించింది. ఆయన దీనికి చేర్మైన్ గా ఉండేవారు.
స్టేట్ సెక్రెటరీ [Secretary of State] భారతదేశం లోని ‘గవర్నర్ జనరల్ ‘ ద్వారా పరిపాలించారు.
1858 సం||పు చట్టం లోని ముక్యంశాలు
1. ఈ చట్టం యూనిటరీ తరహా లేదా అత్యంత కేంద్రీకృత పరిపాలన విధానాన్ని [Highly centralized system ] ప్రవేశపెట్టింది.
2. గవర్నరు లేదా లెప్టినెంట్ గవర్నరు ప్రావిస్సుల ఆదిపతిగా ఉండేవారు. ఈయనకు తన కార్యనిర్వాహక కౌన్సిలు తోర్పడేది. అయితే ఈయనకు ఏవి వాతావ అధికారాలు లేవు. కేవలము భారత ప్రభుత్వ ఏజెంటుగా మాత్రమే వెవహరించాల్సి ఉండేది. ఈ ప్రావిన్సులు ఆయా ప్రావిన్సుల పరిపాలనకు సంభందించిన అంశాలల్లో గవర్నరు జనరలు ఆదేశ మరియు నియంత్రణ [Direction and Control] ల క్రింద పని చేయాల్సి వచ్చేది.
3. ఈ చట్టము, గవర్నర్ జనరాలుకు సివిలు,మిలటరీ, కార్యనిర్వాహక శాసన నిర్మాణ ఆదికరములతో సహ సమస్త ఆదికరములను సంక్రమింపచేసింది. ఆయన ఇండియా స్టేట్ సెక్రటరీ మాత్రమే భాద్యుడు.
4. ఇండియా స్టేట్ సెక్రెటరీ భారత దేశంలో సంపూర్ణ మైన అధికారములను కలిగివుంటాడు. ఆయన భారత ప్రభుత్వానికి మరియు భారత రాబడులకు సంభందించిన ఏదైన కార్యము లేదా కార్యకలాపామును పర్యవేశించడానికి, ఆదేశించి నియంత్రించడానికి అధికారము కలిగివుంటాడు. ఇండియాలో అతని ఏజెంటే ‘గవర్నరు జనరలు’.
5. దేశ పరిపాలనలో ప్రజల భాగ్యస్వామాన్ని నిభందించే నిభందాన ఏదీ లేదు [No provision for public participation]. పరిపాలన అధికారం తో మాత్రమే జరిగింది.
6. స్టేట్ సెక్రెటరీ భారత నైతిక, విషయగత అభివృద్దిని [moral and material progress] సమీక్షిస్తూ వార్షిక నివేదికను బ్రిటిష్ పార్లమెంటుకు ఏటా సమర్పించాల్సి వుంటుంది.
ఇండియన్ కౌన్సిల్ చట్టము, 1861
ఈ చట్టము, గవర్నరు జనరలు కార్యనిర్వాహక కౌన్సిల్ లోని సబ్యుల సంఖ్యను పెంచింది. అంతవరకు అందులో కేవలం అధికారాలు మాత్రమే సబ్యులుగా ఉండేవారు. ఆ కౌన్సిలు శాసన నిర్మాణ కౌన్సిలుగా వ్యావహరించినప్పుడు, శాసనిక వ్యవహారములను జర్పుటకు కొంత మంది అనధికార సబ్యులను అదనంగా అందులో చేర్చడం జరిగింది. ఈ చట్టం ఫ్రెసిడెన్సీలలో శాసన నిర్మాణ అదికారాలను శాసన సబ్యులకు పునరుద్దరించిది.గవర్నరుకు జనరాలుకు ఆర్టినెంస్సులను జారీ చేసే అధికారాన్ని కల్పించింది.
అయితే కౌన్సిలు లో రాబడులు [revenues],మిలటరీ,నావికా లేదా విదేశీ సంభందాలను ప్రభావితపరిచే , ఏదేని చర్య తీసుకోవడానికి గవర్నర్ జనరల్ యొక్క పూర్వనుమతి తప్పనిసరి అని ప్రకటించింది. ఏదేని బిల్లును వీటో [veto] చేయడానికి, ఏదైన బిల్లును సామ్రాట్ పరిశీలన కోరాకు నిలిపి ఉంచడానికి ఈ చట్టం వల్ల గవర్నర్ జనరల్ కు అధికారం సంక్రమించింది.అదే విధంగా ఏదేని శాసనం చెల్లుబడి కావడానికి గవర్నర్ జనరల్ సమ్మతి అవసరం అని కూడ పేర్కొన్నది. ఇదేరకపు నిభందానాలు కౌన్సిలు లోని శాసన మండలికి కూడా వర్తింపు చేయబడినవి.
ఇండియన్ కౌన్సిల్ చట్టం,1892
ఈ చట్టము, కేంద్ర ప్రావీన్సియల్ కౌన్సిళ్ళలోని అదనపు సబ్యుల సంఖ్యను పెంచింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్ 10 మంధీ కి తగ్గకుండా, 16మంది సబ్యులకు మించకుండా ఉండాలని పరిమితి విదించింది. ఈ చట్టము పాక్షికంగా ఎన్నికల వ్యవస్థ ను ప్రవేశపెట్టింది. బొంబాయి,మద్రాస్సు కౌన్సిలల్లో సబ్యుల సంక్య 8 మందికి తగ్గకుండా, 20 మందికి మించకుండా ఉండాలి. బెంగాలులో మాత్రము గరిష్ట పరిమితి 20కి నిర్ణాయించబడింది. ఈ కౌన్సిలు యొక్క ఆధికారము బర్జెట్ పై చర్యకు మాత్రం పరిమితం చేయబడింది. కౌన్సిలు లేవనెత్తిన ప్రశ్నలను కౌన్సిలు అద్యక్షుడు కారణము చూపకుండానే అనుమతించక పోవచ్చును.
ఇండియన్ కౌన్సిల్ చట్టము,1909
ఇండియన్ కౌన్సిల్ చట్టము 1909 ‘మింటో మార్లే సంస్కరణము’ గా ప్రక్యాతి నొండింది. ఈ చట్టము ద్వారా భారతీయ ప్రతినిధులకు మరియు ప్రజల అభిరుచులకు అనుగుణంగా భారతదేశ పరిపాలనలో చోటు కల్పించానికి బ్రిటిషర్లు మొదటి సారి ప్రయత్నించారు.ఈ సంస్కరణను అప్పటి వైస్ రాయే లర్ట్ మింటో, ఇండియన్ స్టేట్ సెక్రెటరీ లార్ట్ మర్లే పేరుతో వెవహరించబడిన ఇండియన్ కౌన్సిల్ చట్టము, 1909, ద్వారా అమలు పర్చబడింది.ఈ చట్టము కేంద్రం లోనూ, ప్రావిన్స్సు లలోనూ శాసన నిర్మాణ కౌన్సిళ్లు పరిణము పెంచింది.గవర్నరు జనరాలు కౌన్సిల్లులోను అదనపు సబ్యుల సంఖ్య గరిష్టం 60కి పెంచబడింది.మద్రాస్సు,బెంగాలు,యు,పి.బొంబాయి,బీహార్,ఒరిస్సాలోని కౌన్సిల్ల సబ్యుల సంఖ్య 30కి పెంచడం జరిగింది. ఇండియన్ శాసన నిర్మాణ కౌన్సిళ్లు 37 మంధీ అదికారులతోనూ, 23 మంధికి అదికారుల లోనూ ఏర్పడింది. ఈ కౌన్సిల్ల చర్చ చేయవలసిన అంశాలు పెరిగాయి. బర్జెట్ పైన, ప్రజలకు ప్రయోజనం [public interest] కలిగించే ఏదైని విషయము పైన తీర్మాలను చేయడం ద్వారా పరిపాలన విధానాన్ని ప్రభుత్వం అవకాశం ఈ చట్టం కౌన్సిళ్ళకు దాఖలు పరిచింది. అయితే, సాయుడ బలగాలు, విదేశివేవాహారాలు, భారత సంస్తానలకు సంభంధించినత్తి నిర్దిత విషయంలో తమ అభిప్రాయాలు చేపట్టడానికి వాటిని అనుమతించలేదు. అంతేకాకుండా ఈ చట్టము అఎన్నికల వెవస్తాను ప్రవేశపెట్టింది. మొదటిసారిగా ముస్లిం వర్గానికి వీరు ప్రతినిద్యమును కల్పించుట ద్వారా వేర్పాటు వాదానికి అంకురార్పణ చేసింది.ఈ చర్య వల్ల ముస్లిం లీగ్ రాజకీయ పక్షంగా ఏర్పడడానికి దోహద పడింది. ఇదే తరువాతి కాలంలో దౌరాభాగ్య మైన దేశవిభజనకు దారితీసింది. [D.D. Basu ; Introducation to the Constitution of Indian 19th Edition 2002 P.5].
ఇండియా ప్రభుత్వ చట్టము, 1919
ఇండియా ప్రభుత్వ చట్టము, 1919 భారత రాజ్యాంగ అభివృద్దిలో మైలురేయి గా భావించబడుతుంది. ఈ చట్టం మంటే గు-ఛేమ్స్ ఫర్ట్ ల నివేదిగా అధికారంగా రూపొందించింది . ప్రజలు 1909 చట్టపు సంస్కరణతో బాగా అసంతృప్తి చెందారు.ఈ సంస్కరణ దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని సమకూర్చలేదు.అంతిమ నిర్ణయము చేసే అధికారం, భాద్యత రహితమైన కార్యనిర్వాహక వర్గానికి అప్పగించడం జరిగింది. అయినపటికి భారతీయులు మొదట ప్రపంచ యుద్దంలో భారతీయులు అందించిన తోడ్పాటు, మరియు జాతీయ కొంగ్రెస్ నడిపిన స్వపరిపాలన ఉద్యమం ఫలితంగా, ఇండియా స్టేట్ సెక్రెటరీ క్రొత్తగా వచ్చిన మిస్టర్ మంటేగు భారత దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ లక్షణాలను విస్తరింస్తు ఒక ప్రకటన జారీ చేసింది.
బ్రిటిష్ ప్రభుత్వ విధానం ఏమిటంటే [The policy of his Majesty’ Government] పరిపాలనలోని ప్రతి శాఖలో భారతీయుల భాగ్యస్వామ్యాన్ని పెంచడం ; బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్గత భాగమైన బ్రిటిష్ ఇండియాలో భాద్యయుత ప్రభుత్వము రావడానికి వీలుగా స్వపరిపాలన సంస్థను క్రమేపీ అభివృద్ది పరచడం.
అయినప్పటికి ఇండియా స్టేట్ సెక్రటరీ ఐనా మిస్టర్ E.S. మంటేగు మరియు గవర్నరు జనరలు అయిన లార్డ్ ఛేమ్స్ ఫర్డ్ లకు పై విధానాన్ని అమలు పర్చడానికి ప్రతి పాదనలు రూపొందించే భాద్యత అప్పగించడం జరిగింది. ఈ విధానాన్ని అనుసరించి ఆగష్టు డిక్లరేషంగా ఇండియా ప్రభుత్వ చట్టము, 1919 ని ఆమోదించడం జరిగింది.