SRUGK

క్రిప్స్ మిషను :-

‘సర్ స్టాపర్డ్ క్రిప్స్’ అనే అతనిని బ్రిటీషు ప్రభుత్వము 1942 మార్చిలో భారత నాయకులతో సంప్రదించి రెండవ ప్రపంచ యుద్దములో వారి సహకారం పొందేందుకు వీలుగా భారతదేశానికి పంపింది. ఆయన, భారత రాజ్యాంగమును రూపొందించదనికి రాజ్యాంగ శాసన సభను ఎన్నుకొనుటలో తీసుకోవలసిన చర్యలను గురించి, యుద్దము ముగిసిన తరువాత బ్రిటిషు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. అట్టి రాజ్యాంగము బ్రిటిష్ ప్రభుత్వముచే అమలు పరచబడవలసి వుంది. రాజ్యాంగ శాసన సభ ప్రావిన్సియల్ శాసన మందలులచే ఎన్నుకోబడిన మరియు భారతీయ సంస్తాన్ రాజ్యాంగము చే నామినేట్ చేయబడిన సబ్యులతో ఏర్పడాలి. అయితే భారతదేశ రక్షణ భాద్యత బ్రిటీషు ప్రభుత్వము వద్దే వుండాలి.


క్విట్ ఇండియా ఉద్యమము [Quit India Movement] :-

ఈ ప్రతిపాదనలు భారత స్వాతంత్రోద్యమ నాయకులకు అంగీకారము కాలేదు. అందువల్ల క్రిప్స్ మిషను విఫలమైంది. ఇది క్విట్ ఇండియా ఉద్యమానికి దారితీసింది. కాంగ్రెస్సు ను నాయకులందరు అరెస్ట్ అయ్యారు. 1945 వరకు వారు జైళ్ళలోనే వుండి పోయారు. ఇండియా గవర్నరు జనరల్ లార్డ్ వేవల్ ఈ సమస్యను పరిష్కరించడానికి 1945 లో సిమ్లా సమావేశమును జరిపారు. అయితే, మహమ్మద్ జిన్నా దృక్పదము వల్ల ఇది విఫలమైంది.


క్యాబినెట్ మిషన్ ప్లాన్ [Cabinet Mission plan] :-

1946 సం||ములో ఇంగ్లాండ్ లో అధికారములోకి వచ్చిన లేబర్ పార్టీ ప్రభుత్వము ముగ్గురు సబ్యులతో కూడిన ఒక క్యాబినెట్ ప్రతినిది బృందాన్ని భారత్ లో సంప్రదింపులు జరగడానికి 1946 లో పంపింది. ఈ బృందంలో [1] లార్డ్ పెతిక్ లారెన్స్ [2] సర్ స్టాఫర్డ్ క్రిప్స్ [3] మిష్టర్ ఏ.ఏ. అలెగ్జాండర్ ఉన్నారు. ఈ క్యాబినెట్ మిషను ఒక ఒప్పందమును రావడములో ఇరు పార్టీల వారిని సంతృప్తి పరచలేకపోయింది. అందుచేత ఇది ఏక పక్షంగా తన ప్రతినిధులను ప్రకటించింది.

ఈ ప్రతిపాదన లేవంటే,[cabinet Mission proposals]

[1] బ్రిటిష్ ఇండియా మరియు సంస్తానలకు కలిపి భారత యూనియల్ ఉండాలి. ఇది విదేశీ వ్యవహారాలు , దేశ రక్షణ కమ్యూనికేషన్ లు మరియు ఆర్దిక వ్యవస్తాపై అదికారితను కలిగిఉంటుంది.

[2] ఈ యూనియను కార్యనిర్వాహక, శాసన నిర్మాణ సంస్త ను కలిగిఉంటుది.వీటిలో బ్రిటీష్ ఇండియా సంస్తనలు, మరియు రాష్టాల ప్రతినిధులు ఉంటారు.

[3] యూనియన్ జాబితాలో పేర్కొనిన విషయాలు మినహాయించి, మిగతా అన్నీ అధికారాలు [Residuary powers] ప్రావిన్సులకే ఉంటాయి.

[4] ఈ ప్రావిస్సులు, ప్రావిన్సియల్ విషయాలపై నిర్ణయాలు తీసు కునెదుకు కార్య నిర్వహకులతో మరియు శాసన నిర్మాణ కర్తలతో గ్రూపులు ఏర్పరచుకునే స్వేచ్చాను కలిగి ఉంటాయి.ప్రతి గ్రూపు ఉమ్మడిగా ఈ విషయాలను నిర్ణేయించు సామార్ద్యలు కలిగి ఉంటుంది.

[5] సామ్రాట్టు సర్వాధికారితము [ the supremacy of the crown] దీనితో ముగిస్తుంది.

[6] రాజ్యాంగ శాసన సభను [ constituent assembly ] నూతన రాజ్యాంగ నిర్మాణానికి [ for framing the new constitution ఎన్నుకోవలసి ఉంటుంది.

[7] ప్రదాన రాజకీయ పక్షాలు మద్దతుతో మద్యకాలిన ప్రభుత్వము [interim government] ఒకటి ఏర్పడాలి.

భారత జాతీయ కొంగ్రెస్ ను అద్యక్చుడైన పండిత్ నెహ్రూను క్రొత్త మద్యకాలిన ప్రభుత్వాన్ని [interim government] ఏర్పరచవలసిందిగా అప్పటి గవర్నరు జనరలు లార్ట్ వెవెల్ అవ్హనించారు. ఆయన 1946 సెప్టెంబర్ నెలలో ఒక మద్య కాలిన ప్రభుత్వాన్ని ఏర్పరచారు. 5 గురు ముస్లిం లీగ్ సబ్యులు కూడా ఇందులో చేరారు. ఈ ప్రభుత్వము భారత దేశ విభజన వరకు అధికారం లో కొనసాగింది.

1947 ఫిబ్రవరి లో ఇంగ్లండు ప్రధాన మంత్రి అయిన మిస్టర్ ఆట్టి ప్రదాన రాజకీయ పక్షలైనా కొంగ్రెసు ను, ముస్లిం లిగ్ల ఒక అంగీకారము కూడురానప్పటికి 1948 జూన్ కు ముందే బ్రిటిషర్లు భరాతదేశము వదిలి వెలతారని ప్రకటించారు.


Origin of Indian independence act :-

‘లార్ట్ మౌంట్ బటెన్’ 1947 మార్చ్ లో గవర్నరు జనరలు గా నిర్నైంచ బడినారు. సాద్యమైనంత వరకు ఏలాంటి సమస్యలు రాకుండా అధికారాలను బదిలీ చేయటమే ఆయన ముక్య వీధి,ఆయన కొంగ్రెసు తోను ముస్లిం లీగు తోను విశ్రుతాచర్చలు జరిపారు. భారతదేశాన్ని ఇండియా పాకిస్తాను గా విభజించాలన్న తన ప్రణాళికను వారి ముందుంచగా అవి రెండు దీనికి ఒప్పుకున్నాయి. ఈ ఒప్పందము ప్లానును బ్రిటిష్ పార్లమెంటు చట్టంగ చేసింది. ఈ చట్టము1947 జూన్ 18 వ భారత స్వతంత్రా చట్టము 1947 గా ఆమోదించబడింది.

దీనికి మహాత్మా గాందీ ఒప్పుకొనలేదు. భారత విభజనను ఆయన తట్టు కొ లేకా పోయారు. భారత భావిషతు ప్రభుత్వం లో అత్యున్నత స్తానాలను ఆశించిన కొంగ్రెసు ను నాయకులు భారత దేశ సరిహద్దు లో ప్రజలకు కలిగే భాధాలు పట్టించుకోకుండా ఈ ప్లానుకు అంగీకరించరు. ఈ గాయం 60 సంవస్సారలు రారువాత కూడా మానలేదు. వీటి వలన హిందువులు, ముస్లింలు మానసికంగా ఏంటో ఆందోళనకు గురి ఔతున్నారు. భారత ఉపకాండము [sub continent] ఈ విభజన వలన అల్లోకల్లోలం అయింది. అనైతిక మైంది,[demoralized] మరియు ఆస్తిరంగా [destablised] మారింది.


భారత స్వతంత్ర చట్టము 1947, ఆగష్టు లోని ముక్యంశాలు [salient features of Indian Independence act] :-

[1] భారత స్వతంత్ర చట్టము 1947,1947ఆగష్టు 15వ తేదీ నుండి, భారత్,పాకిస్తాన్ పేర్లతో రెండు స్వతంత్ర దేశలూ ఏర్పడడానికి ప్రకటించింది.

[2] ఈ చట్టం ప్రకారం, సింధు, బెలూచిస్తాన్, పాచిమ పంజాబ్, తూర్పు బెంగాల్ వాయువ సరిహద్దు ప్రావిస్సులు, అస్సాము లోని సిల్హట్ మినహా మిగతా ప్రావిస్సు లతో భారత్ ఏర్పడింది.

[3] ఈ చట్టము, రెండు డొమినియన్ న్లు కు వేరు వేరు గా శాసన నిర్మాణ సార్వబౌమడికారమును [legislative supremacy of the two dominions] కల్పించింది.

[4] ఈ రెండు డొమియన్లపై, బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రధికారము [control of the British government] ఆగష్టు 15,1947 నా ముగిసింది.

[5] అప్పటికే అమలులౌన్న రాజ్యాంగ శాసన సభలు [Constitutent assemblies]తాత్కాలికంగా డొమినియను శాసన సభ గా చేయ బడ్డాయి.

[6] డొమినియను అసెంబ్లీలు, ఇది వరలో కేంద్ర శాసన సభలు కలిగిఉన్న అధికారాలు అన్నిటిని వినియోగించడం జరిగింది.

[7]కొత్త నియోజక వర్గాలు ఏర్పడే దంత వరకు, రెండు డొమినియన్లు మరియు, ప్రావిసులు అవసరం అయిన మార్పులతో ఇండియా ప్రభుత్వ చట్టము 1935 ప్రకారం పాలించవలసి ఉండింది.

[8] ‘ఇండియా స్టేట్ సెక్రెటరీ’ పోస్ట్ రద్దు చేయడం జరిగింది.

[9] భారతదేశం లో సర్వభౌమత్వ రద్దుకు ఈ చట్టం లో నిభందాన చేయబడింది.

[10] రెండు డొమినియంలకు విడిగా ఒకొక్క గవర్నరు జనరలు ఉంటారు. ఆయనను ఇంగ్లండు రాజు నియమిస్తాడు.


భారత రాజ్యాంగ రూపకల్పన

క్యాబినెటూ మిషన్ ను ప్లానును ఫలితమే, రాజ్యాంగ నిర్మాణ శాసన సభ. అందుచేత 1947 ఆగస్ట్ 15 వరకు ఇది సర్వ భాఓమిక సంస్త కధు. క్యాబినెట్టు మిషన్ ను ప్లాను ను ఇచ్చిన రూపు రేకలను ద్రోష్టి యండించుకొని , రాజ్యాంగాన్ని రచించ వలసిందిగా కోరడం జరిగింది. అయితే ఇండియా ప్రభుత్వ చట్టము 1947 నిభందానాల ప్రకారం, రాజ్యాంగ శాసన సభ సార్వభూమిక సంస్త గా మారి, రాజ్యాంగ నిర్మాణముకు స్వేచ్చన అందించింది. రాజ్యాంగ శాసన సభ సబ్యులను, పరోక్ష అఎన్నిక ద్వారా ప్రావిన్షియల్ శాసన సభ సబ్యుల ద్వారా అఎన్నుకో బడ్డారు. ఆ విధం గా అవిభక్తి భారతదేశమునకు ఎన్నుకోబడిన రాజ్యగా శాసన సభ 1947 ఆగష్టు 14 వ తేదీ నా భారత డొమినియను యొక్క సర్వసత్తాక శ్హాసన నిర్మాణ సభాగా [sovereign body for the dominion of India] తీరిగి సమావేశం అయింది. పాకిస్తానుకు బదిలీ అయిన ప్రాదేశిక శేత్రాల నుండి అఎన్నికైనా సబ్యులు, భారత శాసన నిర్మాణ సభలో తమ సబ్యుత్వాలను కోల్పోయారు. దీని కోసం, ఈ ప్రాంతంలో తిరిగి ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ సభ వాస్తవ సబ్యుల సంఖ్య 299 అయితే, 26 నవంబర్ 1949 తేదీన, వాస్తవంగా 284 మంది సబ్యులు హాజరు ఆఅయి,భారత రాజ్యాంగం పై సంతకం చేశారు.

రాజ్యాంగ శాసన సభకు ఢా|| రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అద్యక్షుడుగా ఎన్నికయాడు.ఉద్దేశల తీర్మానంలో, [objectives resolution] రాజ్యన శాసన సభ చర్చలల్లో పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను జవాహర్లాల్ నేహారు ప్రతిపాదించారు. ఈ రాజ్యాంగ శాసన సభ, రాజ్యాంగ యొక్క వివిద అంశాలల్లో వ్యావహరించడానికి వివిద కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు సర్పించిన నివేదికలు, రాజ్యాంగ రచనకు పునాధిరలాలూ అయయి . ఈ పునాదులు పైనే, భారత రాజ్యాంగం రూపుదిద్దు కొంది. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఢా|| భీ ఆర్. అంబేడ్కర్ చేర్మన్ గా నిగమించబడ్డారు.

సర్.బి.ఏస్. రావ్ ముసాయిదను రూపొందించగా, దానిపైనే, ముసాయిదా కమిటీ పని జరిగింది. రాజ్యాంగ ముసాయిదా ను 1948 జనవరి లో ప్రాచీరించారు. 8 నెలల గడువును నిర్ణాయించి, ఆ లోపల సవరణలు, సూచనలు,సలహాలు ఇవ్వవలసిందిగా భారత ప్రజలను అర్ధించడం జరిగింది. 1948 నవంబర్ 15 లాగాయిటు 1949అక్టోబర్ 17 వరకు గల ఒక సంవస్సరం కాలావధిలో క్లాజుల వారీగా ముసాయిదను చర్చించారు. మొత్తం మీద 7635 సవరణలను ప్రతిపాదించారు. ఇందులో వాస్తవానికి 2473 సవరణలు మాత్రమే రాజ్యాంగ శాసన సభ చర్చించింది. రాజ్యాంగ శాసన సభ 11 సమావేశాలను జరిగింది. ఇది దాదాపు 2 సంవస్సారలు 11 నెలల, 18 రోజులు గడిపిండి. 114 రోజులపాటు, ముసాయిదా రాజ్యాంగాన్ని పరిశీలించింది. అంతిమంగా భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నా ఆమోదించింది. అయితే, రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్, 5, 6, 7, 8, 9, 60, 324, 366, 367, 372, 380, 388, 391, 392, 393 వెంటనే అమలులోనికి వచ్చింది. రాజ్యాంగం లోని ఇతర నిభందానాలు, 1950 జనవరి 26 వ తేదీ నునుడి అమలులోనికి వచ్చాయి. ఈ విధం గా భారత రాజ్యాంగ నిర్మాణం రూపకల్పనాతో భారత స్వతంత్ర సంగ్రామ్ పూర్తి అయింది.